పెట్రోల్ బంక్‌ల మోసాలపై 18 కేసులు | 18 cases filed on Petrol bunks cheating | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంక్‌ల మోసాలపై 18 కేసులు

May 8 2014 4:27 AM | Updated on Sep 3 2019 9:06 PM

రాష్ర్టంలో పెట్రోల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్‌బంక్‌లపై 18 కేసులు నమోదు..

సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో పెట్రోల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్‌బంక్‌లపై 18 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీపీ ఎస్.గోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. శ్రీకాకుళంలో 4, వరంగల్‌లో 3, గుంటూరు, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో రెండు చొప్పున, కర్నూలు, నిజామాబాద్, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కో పెట్రోల్‌బంకుపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. వినియోగదారులు పెట్రోల్ పంపింగ్‌పై అనుమానాలుంటే  తూనికలు కొలతల శాఖ  టోల్‌ఫ్రీ నంబర్ 1860-425-3333, లేదా 9490165619 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement