12 తులాల బంగారం చోరీ | 12 Tula of gold theft | Sakshi
Sakshi News home page

12 తులాల బంగారం చోరీ

Mar 6 2016 8:30 PM | Updated on Oct 16 2018 3:12 PM

గజ్వేల్ పట్టణంలోని బంగారు నగల తయారీ వ్యాపారి ఇంట్లో 12తులాల బంగారం ఆదివారం చోరీకి గురైంది.

గజ్వేల్ పట్టణంలోని బంగారు నగల తయారీ వ్యాపారి ఇంట్లో 12తులాల బంగారం ఆదివారం చోరీకి గురైంది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని వాసవినగర్‌లో నివాసముంటున్న అనంతోజు ఆంజనేయచారి బంగారు ఆభరణాల తయారు చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం వారి ఇంటికి గుర్తు తెలియని మహిళ వచ్చి మీ ఇంట్లో గదులు కిరాయికి ఉన్నాయా అంటూ అడగగా ఆంజనేయచారి భార్య శోభారాణి లేవని చెప్పడంతో సదరు మహిళ అక్కడి నుంచి వెళ్తూ ఇంట్లో గోడకు వేసి ఉన్న ఓ బ్యాగును తీసుకెళ్లిపోయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి తర్వాత శోభారాణి గుర్తించి భర్తకు తెలపగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో 12 తులాల బంగారం ఉన్నట్టు ఆయన పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement