విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతి | 11 Months Old Dies After Developing Breathing Problem On Flight | Sakshi
Sakshi News home page

ఊపిరాడక 11 నెలల శిశువు మృతి

Published Wed, Sep 26 2018 9:43 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

11 Months Old Dies After Developing Breathing Problem On Flight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్‌ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement