తనను ప్రేమించమని ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
పెన్‌పహాడ్ (నల్లగొండ) : తనను ప్రేమించమని ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణి(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వినోద్(22) తనను ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.