‘100 అసెంబ్లీ, 10 లోక్‌సభ సీట్లకు పోటీ’ | 10 lok sabha seats contest to 100 assembly : | Sakshi
Sakshi News home page

‘100 అసెంబ్లీ, 10 లోక్‌సభ సీట్లకు పోటీ’

Apr 9 2014 5:08 AM | Updated on Aug 29 2018 8:54 PM

సార్వత్రిక ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిలుపుతున్నట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు మంగళవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిలుపుతున్నట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు మంగళవారం తెలిపారు. వికలాంగుల సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిపై వికలాంగుడైన ప్రభాకర్‌ను పోటీలో నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. కే సీఆర్‌పై మెదక్‌లో సిద్ధిపేట వాసి ఖాజా ఉద్దీన్‌ను పోటీలో పెడుతున్నట్లు తెలిపారు. వికలాంగులమైన తమకు సానుభూతి అవసరం లేదని, సమా నావకాశాలు కావాలని ప్రజలను కోరనున్నట్లు వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే 100 మంది, 10 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement