కరీంనగర్ జిల్లా మహదేవ్ నగర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప (టేకు) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్ నగర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలప (టేకు) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మాపూర్ శివారులో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న టేకు కలపను అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసి కలప ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కలప విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.