కారు బోల్తా: ఒకరి మృతి | 1 died in road accident at ananthapuram distirict | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఒకరి మృతి

May 4 2015 9:30 AM | Updated on Sep 3 2017 1:25 AM

వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

అనంతపురం: వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో  కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. హిందూపూర్ టీచర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్(21), శేఖర్(25)  అనే ఇద్దరు స్నేహితులు సోమవారం ఉదయం పెనుకొండ నుంచి హిందూపూర్‌కు కారులో బయలు దేరారు. కారు చిలమత్తూరు మండలం కోడూరు వద్దకు చేరు కోగానే ఒక్కసారిగా ముందు టైరు పేలిపోవడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు శేఖర్‌ను హిందూపూర్ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement