ఐసెట్-2014కు ఇప్పటి వరకు 1,39,894 దరఖాస్తులు వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ తెలిపారు.
హన్మకొండ, న్యూస్‌లైన్: ఐసెట్-2014కు ఇప్పటి వరకు 1,39,894 దరఖాస్తులు వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్-2014 దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రానికి గడువు ముగిసినా, రూ.500 రుసుముతో 15వ తేదీ వరకు, రూ.2వేల రుసుముతో 25వ తేదీ వరకు, రూ.5వేల రుసుముతో మే 6వతేదీ వరకు, రూ.10 వేల రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అయితే ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ నెల 21నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.