breaking news
-
పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు: పీఎం మోదీ ఫైర్
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ మైదానంలో బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు. యూపీఏ ఇండియా కూటమిగా మారింది. టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది. ఇండియా కూటమి అంటూ మళ్లీ మోసం చేసేందుకు జతకట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి పిల్లల కోసం చూసుకుంటారు. బీజేపీ మాత్రం ప్రజల పిల్లల కోసం ఆలోచిస్తుంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారు.’ ‘బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. వాగ్దానం ఇచ్చామంటే అది అమలై తీరుతుంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం. మహిళల రిజర్వేషన్లు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాం. నిజామాబాద్‌లో పనుపు బోర్దు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్ఎస్ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయలేవు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్ఎస్కు పట్టడం లేదు. నీటి ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయాయి. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుంది. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారింది. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం. పథకాలన్నీ బీఆర్ఎస్కు ఏటీఎంలా మారాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్ఎస్ మోసం చేసింది. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తీరుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు ఇస్తున్నాం. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీని ఇప్పుడు 300 స్థానాల్లో గెలిపించి ఆశీర్వదించారు. మేము తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. -
ప్రియాంకకు చరిత్ర తెలియకపోవడం దురుదృష్టకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతాకాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు: రాహుల్ గాంధీ #WATCH | Hyderabad: On Former PM PV Narasimha Rao, Telangana Minister and BRS MLA KT Rama Rao says, "It's truly unfortunate that Priyanka Gandhi does not seem to have any information on the history of the injustice meted out to late PM PV Narasimha Rao. He is someone we all look… pic.twitter.com/mjMOSdew3j— ANI (@ANI) November 25, 2023 #WATCH | Telangana Minister and BRS MLA KT Rama Rao says, "Rahul Gandhi is jobless today because he lost his job in 2014. He and his party both lost their job in 2014. That's why today he remembered unemployment... I want to ask if Rahul Gandhi has ever written a single entrance… pic.twitter.com/7PkNPpajrx— ANI (@ANI) November 25, 2023 -
రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. -
ప్రజలు కోరుకుంది ఇలాంటి తెలంగాణ కాదు: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదని.. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. కాంగ్రెస్‌తోనే రాష్ట్రం మళ్లీ కోలుకోలగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం బోధన్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది. ధరణి పేరుతో ఎమ్మెల్యేలకు భూములు అప్పజెప్తున్నారు. దళిత బంధు పథకంలో తీవ్ర అవినీతి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వకుంటే దళిత బంధు రాదు. తెలంగాణలో భూ, ఇసుక, వైన్స్ మాఫియా పెరిగింది. ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరింది. .. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని కేసీఆర్ సర్కార్ ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది అని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200గా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిలిండర్ ధర తగ్గిస్తాం. కాంగ్రెస్ గెలిచాక.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కేసీఆర్ కారు పంక్చర్ అయ్యింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో చేరిన మండవ బోధన్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆదిలాబాద్ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఇసుకలో.. మైనింగ్‌లో.. ఎటు నుంచి చూసినా కేసీఆర్ ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. ఎవరి భూములు వారికి ఇచ్చేదే ప్రజా తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లీ దళితుల అభివృద్ధి అని గండికొట్టారు. మీ స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారు. మీ చేతుల్లో తెలంగాణ గ్యారెంటీ కార్డు పెట్టాం. ఇవి గ్యారెంటీలు కావు(కాంగ్రెస్ గ్యారెంటీ ప్రతిని చూపిస్తూ..) చట్టంగా అమలు చేయబోతున్నాం. తొలి కేబినెట్లోనే వీటిని చట్టాలుగా మారుస్తాం. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఓటుకు పదివేలు ఇచ్చి నగదు బదిలీ పథకం మొదలైందని, ఈ ఓట్ల కొనుగోలు రాజకీయానికి బీజేపీ సహకారం అందిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతు బంధు నిధుల జమకు సీఈసీ అనుమతులు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్-బీజేపీలపై తీవ్ర విమర్శలే గుప్పించారాయన. ‘‘కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఇక్కడ ప్రధానంగా నేను మూడు అంశాలను ప్రస్తావిస్తున్నా. రైతు బంధు, వివేక్.. పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడం. .. 2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెస్ కు సహకరించింది. .. అలా బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో.. రైతులకు నష్టం జరుగుతోంది. కౌలు రైతులు, రైతు కూలీలైతే పూర్తిగా నష్టపోతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావొద్దు. రైతులు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి. కాంగ్రెస్ వచ్చాక.. మేం ఇవ్వాల్సింది మేం ఇస్తాం. .. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. 2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. .. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ఆయన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు బంధుత్వం కూడా బీఆరెస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది. సీనియర్ నేత ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆరెస్ వారిని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలి. బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదు. కాంగ్రెస్ గెలుస్తుందనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి అని తెలంగాణ ప్రజల్ని రేవంత్ కోరారు. -
సీపీఎం పోటీ చేయని చోట కాంగ్రెస్‌కు మద్దతు: సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు. ‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి, పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి. ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు. చదవండి: మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి -
కేసీఆర్ లక్ష్యం కేటీఆర్‌ను సీఎం చేయడమే!: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిన హామీలను చూడండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం. మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్ షా కోరారు. హలాల్ బ్యాన్పై నిషేధం తీసుకోలేదు హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కొల్లాపూర్‌లో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం, భూమి ఇస్తాం. మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. బీజేపీ చెప్పిన ప్రకారం.. హమీలన్నీ నెరవేరుస్తాం. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్‌కు యువతపై ప్రేమ లేదు. ఆయన ప్రేమంతా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే.. వాళ్లు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. వాళ్లు రేపు బీఆర్ఎస్లోకే వెళ్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకుంటాం. -
ఓటు విలువ.. వీళ్ల ఓటమి ఎన్నికల చరిత్రకెక్కింది!
ఒక్కటి.. చాలా చాలా చిన్న అంకె. అందుకునేమో చాలామంది దానిని తేలికగా తీసుకుంటారు. కానీ, గెలుపోటముల విషయానికొచ్చేసరికి మాత్రం ఆ ‘1’ ఎంతో ఎంతో కీలకంగా మారుతుంటుంది. పరీక్షల్లో ఒక్క మార్కు, ఆటలో ఒక్క పరుగు, ఎన్నికల్లో ఒక్క ఓటు.. అంతెందుకు చరిత్రలో ఒక్క ఓటుతో ప్రభుత్వం కుప్పకూలడం కూడా చూశాం. ఎన్నికల్లోనూ ఒక్క ఓటుతో ఓడిన నాయకుల చరిత్రను ఒక్కసార తిరగేస్తే.. ఓటు విలువేంటో కచ్చితంగా తెలియడం ఖాయం. ►2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. సంతేమరహళ్లి నియోజకవర్గంలో జనతాదళ్(సెక్యులర్)-JDS అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి .. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధ్రువనారాయణ్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ధ్రువనారాయణ్‌కు 40,572 ఓట్లు.. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు పోలయ్యాయి. ►2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు. నాథ్‌ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్‌కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఓటమి గురించి చర్చ జరిగింది. ఎందుకంటే సీపీ జోషి అప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఎన్నికపై జోషి కోర్టుకు ఎక్కారు. ప్రత్యర్థి చౌహాన్ భార్య రెండు పోలింగ్ బూత్‌లలో ఓటేసినట్లు ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. సుప్రీం కోర్టులో మాత్రం వ్యతిరేక ఫలితం దక్కింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో తానే గెలుపును చవిచూడలేకపోయారాయన. ఫలితంగా.. రెండోసారి అశోక్ గెహ్లాట్ సీఎం పదవి చేపట్టారు. జోషి ఎన్నిక వ్యవహారంలో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఉంది. సీపీ జోషి తల్లి, సోదరి, ఆఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. ఇక కర్ణాటకలో ఓడిన కృష్ణమూర్తి విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఆయన కారు డ్రైవర్ ఆయనకు ఓటేయలేదు. ఓటేసేందుకు కృష్ణమూర్తిని డ్రైవర్ అనుమతి అడిగినా.. పోలింగ్ రోజు కావడంతో కుదరని డ్యూటీలోనే ఉంచారట కృష్ణమూర్తి. ఫలితం.. ఒక్క ఓటు ఆయన్ని ఓటమిపాలుజేసింది. అందుకే రాజకీయ ప్రత్యర్థులెవరికీ కూడా ఇలాంటి ఓటమి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెబుతూ వచ్చేవారు. ►సింగిల్ డిజిట్ ఓట్లతోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. 2018 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయివావ్ల్ నిజయోకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ఎల్ పియాన్మావాయి కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రత్యర్థి మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్‌చాందమా రాల్తేకు 5,207 ఓట్లు రాగా.. పియాన్మావాయికి 5,204 ఓట్లు పోలయ్యాయి. దీంతో రీకౌంటింగ్‌కు ఆయన పట్టుబట్టినా.. అక్కడా అదే ఫలితం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండుసార్లు ఇలా సింగిల్ డిజిల్ ఓటములు ఎదురైన సందర్భాలు నమోదు అయ్యాయి. 1989లో అనకాపల్లి(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నిజయోకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తొమ్మిది ఓట్ల తేడాతో నెగ్గారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో.. బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మారండి కేవలం 9 ఓట్ల తేడాతోనే నెగ్గారు. 192 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎంపీలు లోక్‌సభకు కేవలం సింగిల్ లేదంటే డబుల్ డిజిట్ ఓట్లతో నెగ్గారనేది ఎన్నికల సంఘం లెక్క. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనూ అభ్యర్థుల తలరాతలు తారుమారు అవుతుంటాయి. రాజ్యాంగం 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ అందించిన హక్కు.. ఓటేయడం. ఆ ఓటు హక్కు అందరూ సక్రమంగా వినియోగించుకుని ఉంటే.. చారిత్రక ఓటముల్లోకి పైన నేతల పేర్లు ఎక్కి ఉండేవి కావేమో!. -
ఐటీ దాడులు దడ పుట్టించాయా?.. విజయానికి బాటలు వేశాయా?
ఎన్నికల సమయాన ఐటీ, ఈడీ దాడులు మామూలే. ఇటువంటివన్నీ రాజకీయ ప్రేరేపిత దాడులే అన్నది ప్రతిపక్షాల మాట. ఈ దాడులన్నీ ప్రతిపక్షాల నేతలపైనే జరుగుతున్నాయని వారి వాదన. మరి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై జరిగిన ఐటీ దాడి ఆయనకు దడ పుట్టించిందా? లేదంటే దాడి రివర్సైందా? అభ్యర్థికి దడ పుట్టించాల్సిన ఐటీ దాడులు ఆయన విజయానికి బాటలు వేశాయా? కేంద్ర సంస్థల దాడులు వివేక్ మీద సానుభూతి పెంచాయా? ప్రజల్లో పలుచన చేశాయా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వివేక్‌కు హైదారాబాద్ లోని ఇల్లు, మంచిర్యాలలో ఆయన ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం నాడు తెల్లవారుఝాము నుంచి రోజంతా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ అనుచరులు నగదు పంచుతున్నారని... ఆయన ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయనే అనుమానంతో పదిహేను మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామికి వివిధ కంపెనీల నుండి నగదు వచ్చిందన్న సమాచారంతో వచ్చిన అధికారులు ఆ లావాదేవీలపై సోదాలు జరిపారు. ఐటీ దాడుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. తాను చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఈ దాడులు జరిగాయని ఆయన అంటున్నారు. తనపై బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న బాల్క సుమన్ కుట్రతోనే కేంద్ర సంస్థలతో దాడులు చేయించారని వివేక్ ఆరోపించారు. తనను ప్రజల్లో పలుచన చేయాలనే కుట్రతోనే, తనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని అన్నారు. మేము తప్పుడు మార్గాలలో ధనాన్ని తరలించలేదన్నారు. సుమన్ తప్పుడు ఫిర్యాదుతోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ దాడుల వెనుక బిజెపి బిఅర్ఎస్ పార్టీల హస్తం ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని..ఐటీ దాడులతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రుజువు చేసుకున్నారని కామెంట్ చేశారు వివేక్. ఆదాయప్ను ఆధికారులు దాడులు నిర్వహిస్తున్న ఇంటి దగ్గర..చెన్నూరులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీ దాడులు వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో సానుభూతి పెంచిందనే చర్చ చెన్నూరు నియోజకవర్గంలో సాగుతోంది. ప్రజల్లో వివేక్‌పై ఏర్పడ్డ సానుభూతి, పెరిగిన ఆదరణ ఆయనకు ఓట్ల వర్షాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇక ఆయన విజయానికి ఢోకా లేదని భావిస్తున్నారు. అయితే వివేక్ ఇంటిపై ఐటీ దాడులు జరగడంలో సుమన్ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిచింది. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు. ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. కొన్నిసార్లు కొన్ని వ్యూహాలు బెడిసికొడుతుంటాయి. కొన్ని విజయవంతమవుతాయి. మరి కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో అసలు నిజాలు ఎలా ఉన్నా... వీటి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా అనేది ఫలితాల రోజే తెలుస్తుంది. -
బోధన్‌లో పోస్టర్ల కలకలం.. రాహుల్, రేవంత్ ఫోటోలతో విమర్శలు
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ.. పోస్టర్లు అంటించారు. వీటిపై రాహుల్, రేవంత్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని,ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు. బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు జత చేశారు. ‘కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక. దివాళా తీస్తున్న పరిశ్రమలు.. కాంగ్రెస్ పేరెత్తితేనే జనం తిట్లు. గీ కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా?. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికే నిరుద్యోగుల గోస.’ అంటూ పోస్టర్లు అంటించారు. కాగా బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ: సోనియాగాంధీ ఆశీర్వదిస్తే ఏదో ఒకరోజు సీఎం అవుతా నని నల్లగొండ కాంగ్రెస్ అభ్యరి్థ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం థానేదారుపల్లి, కంకణాలపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలన లో తెలంగాణ ఆగమైందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నార ని చెప్పారు. 15 రోజుల్లో కేసీఆర్‌ను ప్రగతి భవ న్ నుంచి బయటకు పంపే పరిస్థితి రాబోతుందని జోస్యం చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో పడేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణను కాపాడేది కాంగ్రెస్సే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలనుంచి ప్రజల ను కాపాడేది కాంగ్రెస్ పార్టీనేనని, ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలని సీడబ్ల్యూసీ సభ్యురాలు ఆల్కాలాంబా పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...తెలంగాణ తో పాటు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తర్వాత ప్రజల్లో ఆలోచన పెరిగిందని, అందుకే కర్ణాటకలోని డబుల్ఇంజన్ సర్కారును ఓడించి అక్కడి ప్రజలు కాంగ్రెస్ పారీ్టకి పట్టం కట్టారని చెప్పారు. బీజేపీ నేతలు దేశాన్ని విడిచిపెట్టి తెలంగాణలో ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చారని, కశ్మీర్లో ఐదుగురు జవాన్లు చనిపోతే వెళ్లకుండా అమిత్‌షా తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తమను గెలిపించడం ద్వారానే సమగ్రాభివృద్ధి జరుగుతుందని అల్కాలాంబా చెప్పారు. -
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యరి్థ, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update మంత్రి కేటీఆర్‌కు ఈసీఐ నోటీసులు టీ వర్క్ ఆఫీస్‌లో విద్యార్థులతో ముఖాముఖి కోడ్ ఉల్లంఘనకు వస్తుందని నోటీస్ రేపు మధ్యాహ్నం 3గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్న ఈసీఐ అశోక్‌నగర్‌లో యువతతో రాహుల్ చిట్‌చాట్ ముషీరాబాద్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం ముషీరాబాద్ నియోజక వర్గం అశోక్ నగర్లో చౌరస్తాలో విద్యార్థులతో కలిసి చాయ్ తాగుతూ ముచ్చటిస్తున్న రాహుల్ గోషామహల్లో కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ భగ్గుమన్న గ్రూపు రాజకీయ విభేదాలు ఉద్యమకారుడు దిలీప్ ఘనాటేపై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించిన ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే నన్నే ప్రశ్నిస్తావా అంటూ దిలీప్ ఘనాటే పై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిన దిలీప్ రేవంత్ ప్రచారానికి ఏటీసీ అడ్డంకులు మోదీ పర్యటనను సాకు చూపుతూ రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌కు అనుమతుల నిరాకరణ మూడు గంటలుగా హెలికాప్టర్ అనుమతుల కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూపులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు నో అనడంతో తుర్క యాంజల్ రోడ్ షోకు రాలేక పోయిన రేవంత్ రోడ్ షోలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న పటాన్చెరు ప్రచార సభలో అమిత్ షా ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా.. వద్దా? 2024లో మోదీ మరోసారి ప్రధాని కావాలా.. వద్దా? రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుంది 2019లో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021లో విగ్రహ ప్రతిష్టాపన చేశాం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే 370 ఆర్టికల్‌ని కాంగ్రెస్ అడ్డుకుంది.. అయినా మోదీ సర్కార్ ఆ ఆర్టికల్‌ని రద్దు చేసింది పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్టైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించాం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు పటాన్చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారు నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారు నిరుద్యోగులకు భృతి ఏమైంది? 2.50 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా పేపర్ లీక్ కాలేదు తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయి కాంగ్రెస్‌కి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు పెంచారు కేసీఆర్ బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం తెలంగాణలో బీఆర్ఎస్కి ఓట్లు అడిగే అర్హత లేదు బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తాం ఎస్టీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం తొలి క్యాబినెట్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తాం రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం ప్రజారోగ్యం కోసం రూ. 10 లక్షల బీమా ములుగులో మావోయిస్టుల లేఖ కలకలం.. బీఆర్ఎస్కు షాక్! భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుపై క్లారిటీ ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతికి మావోయిస్టు పార్టీ మద్దతు లేదు. బీఆర్ఎస్కు చెందిన లీడర్లు, మాజీ మావోయిస్టులు చేస్తున్న ప్రచారం బూటకం. మావోయిస్టు పార్టీ మద్దతు అని పచ్చి అబద్దాన్ని ప్రజలు నమ్మవద్దు నాగజ్యోతికి మావోయిస్టు పార్టీ మద్దతు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 21వ తేదీన పేపర్లలో ఇచ్చిన ప్రకటనలపై ఫిర్యాదు మళ్లీ ఈరోజు పేపర్లలో బీఆర్ఎస్ ఇచ్చిన ప్రకటన వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా ఉందని ఫిర్యాదు పోస్టల్ బ్యాలెట్ గందరగోళంపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఇచ్చే ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను ఆర్వోలు రిజెక్ట్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై ప్రతీ జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయి. బీఎల్వోలు ఓటర్ స్లీప్‌లు పంపిణీ చేయడం లేదు. మాజీ IAS అధికారి గోయల్ ఇంటి దగ్గర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. అధికారి ఇంట్లో భారీగా డబ్బు పెట్టారని కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అధికారి ఇంట్లో సోదాలు, తనిఖీలు న్యాయబద్ధంగా జరగలేదు. గోయల్ ఇంట్లో ఏం జరిగిందో స్పష్టత కావాలని సీఈవోను అడిగాము. గోయల్ మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో సోదాలు జరిపే అధికారులపై ఒత్తిడి జరిగింది. నిన్నటి ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గోయల్ ఇంట్లో వంటి ఘటనలు రాష్ట్రం అంతటా జరిగే ప్రమాదం ఉంది. కొడంగల్‌లో రేవంత్‌పై నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ప్రధాని మోదీ మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది తెలంగాణలో టెక్నాలజీ సామర్థ్యం కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ అవినీతి వల్ల వారంతా వెలుగులోకి రాలేదు కాంగ్రెస్-బీఆర్ఎస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి బీఆర్ఎస్-కాంగ్రెస్‌లు బయట తిట్టుకుంటాయి.. లోపల కలుస్తాయి కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధం ఈనాటిది కాదు బీజేపీ అంటే బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు వణుకు కేంద్రంపైఅవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్లో మంత్రి పదవులు తీసుకున్నారు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే తెలంగాణలో జరిగిన అవినీతి చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇరిగేషన్ స్కీమ్‌లను స్కాములుగా మార్చారు దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు బీజేపీ గిరిజన మహిలను రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్‌కు కేసీఆర్‌కు ప్రాణమిత్రుడు మాదిగ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీస సమయంలో జీతాలు ఇవ్వడం లేదు అభివృద్ధి అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గిట్టదు బీఆర్ఎస్ తెలంగాణను అవినీతిలో నెంబర్‌వన్ చేసింది బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు దళితబంధు రావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వాల్సిందే కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీస సమయంలో జీతాలు ఇవ్వడం లేదు పాలకుర్తి సభలో మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ పాలనలో నల్లా నీళ్లు రాలేదు కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్‌పై పాటలొచ్చాయి కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతాం కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఏంటి? పాలకుర్తి ప్రజలు నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వారు కాదు పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు నోట్ల కట్టలున్నాయన్నది వారి అహంకారం కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో 50 ఏళ్లు చూశాం 50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది? వేములవాడ బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణా ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణాను దోపిడీ చేసేశారు బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం నీళ్లు, నిధులు, నియామాకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణాలో ఆ కలలు ఇంకా నెరవేరలేదు సర్ ప్లస్ ఆదాయంతో ఉన్న తెలంగాణాను అప్పులకుప్పగా మార్చేశారు ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణా పరిస్థితే గతంలో ఉండేది కానీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా ఉన్నాం తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది ప్రపంచంలో భారతదేశం గొప్పదనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్ ను దృఢంగా నిల్పిన ఘనత మోదీజీది ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ ను గెలిపించి మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను కామారెడ్డిలో ప్రధాని మోదీ కామెంట్స్ బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది గిరిజన యూనివర్సిటీ హామీ నిలబెట్టుకున్నాం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మహిళా రిజర్వేషన్లు, అయోధ్య రామమందిరం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ హామీలను అమలు చేశాం సకల జనుల సౌభాగ్య తెలంగాణే లక్ష్యం మేము హామీ ఇస్తే నెరవేర్చి తీరుతం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించాం బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుంది ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేశాం ప్రాజెక్టుల నిర్మాణం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారింది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్ఎస్కు పట్టడం లేదు తెలంగాణ మంత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకున్నారు: రేవంత్ మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు. నల్లరైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దుకు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సాయం చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ సీఎం కావాలని మోదీ కోరుకుంటున్నారు. మోదీ తీరు మారనంత వరకు రాహుల్ పోరాతుడూనే ఉంటారు. మాపై అనేక కేసులు పెట్టారు. నా ఇల్లు లాక్కున్నారు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. కేసీఆర్ ఇల్లు లాక్కున్నారా?. కేసీఆర్‌పై కేసులు పెట్టారా? మోదీ కేసీఆర్ ఒకటే కాబట్టి కేసులు పెట్టలేదు. కారు నాలుగు టైర్లలో గాలిని తీసేశాం. ఇక్కడ బీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీని ఓడిస్తాం. ఆదిలాబాద్‌లో రాహుల్ ఎన్నికల సభ. ఇసుకలో దోపిడీ, మైనింగ్‌లో దోపిడీ. ఎవరి భూములు వారికిచ్చేదే ప్రజా తెలంగాణ. ధరణి తెలంగాణలో కేసీఆర్ మీ భూములు లాక్కున్నారు. ఎటునుంచి చూసినా కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. 8 వేల మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహతోయ చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లీంచి దళితుల అభివృద్ధికి గండి కొట్టారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. మీ స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులునాశనం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్లోనే గ్యారంటీలను చట్టాలుగా మారుస్తాం. ప్రజల తెలంగాణలో మొదటగా తీసుకురాబోయేది మహాలక్ష్మి స్కీం. ప్రజల తెలంగాణలో గ్యాస్ సిలీండర్‌ను రూ.500కే ఇస్తాం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. రైతులు ఆ్మహత్యలను ఆపాలని అనుకుంటున్నాం ఇళ్లు కట్టుకోవలనుకుంటున్న పేదలకు రూ. 5 లక్షలు ఇస్తాం. మీ చేతుల్లో గ్యారంటీ కార్డు పెట్టాం. కేసీఆర్ అందులో ఎక్స్పర్ట్: కాంగ్రెస్ నేత డీకేఎస్ హైదరాబాద్‌లో మీడియాతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలు కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుండి నడుస్తుంది. తెలంగాణలో పాలన ఫామ్ హౌజ్ నుండి నడుస్తుంది ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్ గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనదంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.. వేరే పార్టీలు ఎమోషన్స్ తో పాలిటిక్స్ చేస్తాయి. కాంగ్రెస్ ప్రజల జీవితాలను దృష్ఠిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తాయి.. తెలంగాణ విషయంలో కర్ణాటక హృదయంతో ఆలోచిస్తోంది ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడ్డారు రూరల్‌లో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ఫైవ్ స్టేట్స్ ఎన్నికల ఫలితాలపై విదేశాల్లోనూ ఆసక్తి జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం లేనిపోని పుకార్లు రేపుతున్నారు: కేటీఆర్ 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులెన్నో చేశాం లేనిపోని పుకార్లు రేపుతున్నారు అసైన్డ్భూములు ఉన్నవారికి పూర్తిగా అధికారం ఇస్తాం చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మనందరి కోసం 14 ఏండ్లు ఢిల్లీ రాక్షసులతో కేసీఆర్ పోరాడిండు ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కాంగ్రెస్ మార్పు అంటే ఆరునెలలకొక సీఎం బీఆర్ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం సంపన్న రాష్ట్రం తెలంగాణలో అప్పుల కుప్పగా మారింది నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పూర్తిగా పక్కనపెట్టారు బీఆర్ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి యువతను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలే మహబూబాబాద్‌లో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలే ప్రజలు మళ్లీ అలాంటి రిస్క్ తీసుకోవద్దు రైతు బంధు ఇస్తే సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది రేవంత్‌కు బూతులు తప్ప భవిష్యత్తు తెలియదు కేసీఆర్ పాలనలో విద్య, వైద్యం, కరెంట్ వచ్చాయి కాంగగ్రెస్ వస్తే మళ్లీ మనం ఆగం కామా? చౌటుప్పల్ మండలం దామెర వద్ద టెన్షన్ వాతావరణం దామెర బీజేపీ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ప్రచార రథం. డీజేలతో కాంగ్రెస్ పాటలు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే రెచ్చగొడుతున్నారని బీజేపీ కార్యకర్తల నిరసన. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి చలమళ్ళ కృష్ణారెడ్డి. పోలీసుల రంగ ప్రవేశం. కాంగ్రెస్ ప్రచార రథాన్ని బీజేపీ కార్యాలయం వద్ద నుంచి పంపించిన పోలీసులు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది: ప్రియాంక గాంధీ పాలేరులో కాంగ్రెస్రోడ్ షో.. ప్రియాంక ప్రసంగం తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని సాధించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. మార్పు రావాలి.. తెలంగాణ రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. పాలేరు రోడ్‌షోలో ప్రచార వాహనంపై హుషారుగా చిందులేసిన ప్రియాంక గాంధీ కరీంనగర్లో ఓటర్ల ఆగ్రహం కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బారులు తీరిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఓటర్ల మండి పాటు తమ విధులు మానుకుని ఓటు వేయడానికి వస్తే ఆర్డీఓ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం హరీష్‌రావు హెలికాఫ్టర్ రాంగ్ ల్యాండింగ్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో సమాచార లోపం గందరగోళం నడుమ.. హరీష్‌రావు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మరోచోట ల్యాండింగ్ మహబూబాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన హెలికాఫ్టర్ గూడూరులో ల్యాండింగ్ మహబూబాబాద్‌కు రోడ్డు మార్గంలో బయల్దేరిన హరీష్‌రావు అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్‌లో అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ అటాక్ అమిత్ షా కాదు.. అబద్దాల షా.. ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపిస్తాం అని చెప్పుతున్నారు. బీజేపి వాళ్లు ఎయిర్ ఇండియా మూసివేశారు, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ముంచిందే బీజేపి నాయకుడు గోకరాజు గంగరాజు. ప్రభుత్వానికి చెప్పకుండా లేఅవుట్ చేసి కోర్టులో పంచాయతీ పెట్టాడు. షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు తెరిపిస్తామని చెప్పడం విడ్డూరం. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీతో కలుస్తుంది: ఏచూరి సీతారామ్ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉంటుంది. మోదీ, కేసీఆర్ మధ్య ఫెవీకాల్ బంధం మరోసారి బయటపడింది: రేవంత్ ఏకే గోయల్ ఇంట్లో ఉన్న మూడు వందల కోట్ల రూపాయలు పోలీసులే బయటకు పంపించారు. ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని గత ఎన్నికల సమయంలో చర్చ జరిగింది. ఈ సారి అలా జరగకుండా నవంబర్ 15 లోపే రైతు బంధు వేయాలని మేము ఎన్నికల కమీషన్‌ను కోరాం. కానీ ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించేలా నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న పెవికాల్ బంధం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు రైతు బంధు వేయడం వల్ల.. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చే 15 వేల రూపాయలలో 5 వేల నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు నష్టపోయిన 5 వేల రూపాయలు ఇస్తాం. కౌలు రైతులకు ఇప్పుడు నష్టపోతున్నారు.వారికి కూడా ఇస్తాం అవీనితి తప్ప.. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు: అమిత్ షా 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను దివాళ తీసింది. సెప్టెంబర్17 నిర్వహణపై ఇచ్చిన మాట తప్పింది. కేజీ టూ పీజీ విద్యను గాలికొదిలేశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. ప్రతీజిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల హామీ అమలు కాలేదు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ. యువత, పేదలు,రైతులు అందరూ నిరాశలో ఉన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అవినీతి తప్ప బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేం లేదు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మేం రద్దు చేస్తాం. ఇచ్చిన హామీలన్నీ ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ తీర్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక, పెట్రోల్, డీజీల్‌పై వ్యాట్ తగ్గిస్తాం. మీ ఓటు భారతదేశ భవిష్యత్తును మార్చేస్తుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అఖండ విజయం ఖాయం: రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులతో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి,ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆత్మీయ సమావేశం అందరి ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజలకు సేవ చేస్తున్న సండ్ర వెంకటవీరయ్య అంటే నాకెంతో అభిమానం. 10 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేనంత సత్తుపల్లి ప్రాంతం అభివృద్ధి చెందింది. 1000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి సత్తుపల్లి ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేశారు. పనిచేసే వ్యక్తికి పట్టం కట్టాలి. 15 ఏళ్లుగా అభివృద్ధికి తోడ్పడుతున్న నాయకులను ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. నేడు బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటన నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభ మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు.. బోధన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి. గత పార్లనెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు. బీఆర్ఆస్లో తగిన గౌరవం దక్కలేదని పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన మండవ. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి మండవ నిజామాబాద్ జిల్లాలో సెటిలర్ల ఓట్లపై మండవ ప్రభావం. సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం. నిజామాబాద్ రూరల్, ఆర్ముర్, బోధన్, బాన్సువాడలో సెటిలర్ల జనాభా ఎక్కువ. సెటిలర్లకు పెద్ద దిక్కుగా మండవ వ్యవహరిస్తారన్న పేరుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోరుట్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రచారం చేయనున్న కవిత. సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని వివిధ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి ప్రచారంలో పాల్గొననున్న కవిత. కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ అరవింద్‌కు మద్దతుగా ఈ రోజు నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ పర్యటన. ఇబ్రహీంపట్నం ప్రచారంలో అరవింద్‌తో పాటు పాల్గొననున్న మందకృష్ణ. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలతో పాటు.. సాయంత్రం కరీంనగర్ నగరంలో ప్రచారం చేయనున్న బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్. ఖమ్మంలో ప్రియాంక రోడ్ షో. ఉదయం 9:30 గంటలకు ప్రియాంక గాంధీ సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జడ్పీ సెంటర్, వైరా రోడ్, పాత బస్టాండ్, సెంటర్, మీదుగా కాల్వ ఒడ్డు, వరకు రోడ్ షో కొనసాగనుంది. మధిరలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ. మధ్యాహ్నం 2:40 గంటలకు మధిరలో కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీతో పాటు హాజరుకానున్న పలువురు అగ్రనేతలు. నేడు కామారెడ్డికి ప్రధానిమోదీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సాయంత్రం 42గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు. సభకు లక్ష మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నేతలు. బీజేపీ టాప్–5 నేతలంతా నేడు రాష్ట్రంలోనే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శనివారం ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. బీజేపీలోని ఐదుగురు అగ్రశ్రేణి నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ తమ రాకతో పార్టీ కేడర్‌లో జోష్ నింపనున్నారు. ప్రధాని మోదీ శని, ఆది, సోమవారాల్లో వరుస సభలు, రోడ్ షోలలో పాల్గొంటుండగా, అమిత్ షా శుక్ర, శని, ఆదివారాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సిర్పూర్, వేములవాడలలో బహిరంగ సభలు, సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొంటున్నారు. పార్టీ ఎన్నికల కమిటీల పనితీరును బీఎల్ సంతోష్ శనివారం సమీక్షించనున్నారు. అధికార బీఆర్ఎస్పై ప్రజావ్యతిరేకత ఉందన్న సొంత సర్వేల అంచనాల నేపథ్యంలో బీజేపీ శక్తియుక్తులను తెలంగాణపై కేంద్రీకరిస్తోందని.. అందులో భాగంగానే అగ్రనాయకత్వం ముమ్మర ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. నేడు యూపీ సీఎం యోగి విస్తృత ప్రచారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం రాష్ట్రంలో విస్తృత ప్రచారం. ఉదయం 11 గంటలకు సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వేములవాడ అసెంబ్లీలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ఆకాశ్‌పురి హనుమాన్ మందిరం నుంచి రోడ్‌షో ప్రారంభించి అనిత టవర్, పురానాపూల్ గాంధీ స్టాచ్యూ, గోల్కొండ (గోషామహల్ జిల్లా)లలో కార్నర్ మీటింగ్‌లలో యోగి ప్రసంగిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల వివరాలివ్వండి రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అందజేయాలి. తదుపరి విచారణలోగా కేసుల వారీగా వివరాలు సమర్పించాలి. విచారణను డిసెంబర్ 15కు వాయిదా అశ్వినీకుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నవంబర్ 9న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విచారణలను హైకోర్టు వేగవంతం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం సుమోటో పిల్‌గా విచారణ. క్రిమినల్ కేసుల డేటాను రెండు వారాల్లోగా క్రోడీకరించి హైకోర్టుకు అందజేయాలని రిజిస్ట్రీకి ఆదేశం. కాంగ్రెస్ రావడం ఖాయం: సీడబ్ల్యూసీ సభ్యురాలు సుప్రియా శ్రీనటే తె లంగాణ ప్రజలకు అధికారంలో సమానత్వం లభిస్తుందని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో సగటు మనిషి జీవితం దుర్భరమైపోయింది. రాష్ట్రంలో ఏ వర్గం అభివృద్ధి చెందకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ ఇంట్లోనే సీఎం, మంత్రి పదవులు తెచ్చుకున్నారని, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణలోని ప్రతి వర్గం మార్పు కోరుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి రావడం ఖాయం. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. నేటి నుంచి సీతారాం ఏచూరి, బృందా కారత్ ఎన్నికల ప్రచారం సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం నుంచి ఈనెల 28 వరకు వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సీతారాం ఏచూరి ఈ నెల 25న సాయంత్రం పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని, 26న మధ్యాహ్నం భువనగిరి సభలో ప్రసంగిస్తారు. 27న మిర్యాలగూడ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. బృందా కారత్ ఈనెల 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సభలో పాల్గొంటారు ,27న భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్లలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 28న కోదాడ, హుజూర్‌నగర్‌లలో రోడ్ షో నిర్వహిస్తారు. సోనియా దీవిస్తేసీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం థానేదారుపల్లి, కంకణాలపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సోనియాగాంధీ ఆశీర్వదిస్తే ఏదో ఒకరోజు సీఎం అవుతా. కేసీఆర్ పాలన లో తెలంగాణ ఆగమైంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. 15 రోజుల్లో కేసీఆర్‌ను ప్రగతి భవ న్ నుంచి బయటకు పంపే పరిస్థితి రాబోతుంది. ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో పడేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. నేటిలోగా ఆర్వోలకు ఫారం 12డీలను పంపాలి జిల్లా కలెక్టర్లకు సీఈఓ ఆదేశం ఫారం 12డీలను పరిశీలించిన అనంతరం సదరు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలి ఆర్వోలకు ఈ దరఖాస్తుల చేరవేతను శనివారంలోగా పూర్తి చేయాలి దరఖాస్తును సంబంధిత నియోజకవర్గ ఆర్వో పంపడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక పరేడ్‌గ్రౌండ్‌లో నేటి బీఆర్ఎస్ సభ రద్దు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నేడు నిర్వహించ తలపెట్టిన ప్రజాఆశీర్వాద సభ రద్దు హైదరాబాద్-సికింద్రాబాద్‌లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారసభలు తెలంగాణలో కాంగ్రెస్ గాలి: ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ గెలుపుతోనే తెలంగాణ యువత కల సాకారం బీఆర్ఎస్, బీజేపీ.. బొమ్మా బొరుసు ఆ పార్టీలకు ఎంఐఎం అంటకాగుతోంది యువత జీవితాలను కేసీఆర్ చీకట్లోకి నెట్టారు.. రైతులు, మహిళలకు ఏం చేశారని ఓట్లు అడుతున్నారు? మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రచారం ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ వస్తే కర్ణాటక తరహాలో ఇక్కడా దగానే ‘అభివృద్ధి’ పాలన కావాలా? దళారీల పాలన కావాలా? బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే.. సింగరేణి కొంగు బంగారం.. దీన్ని మరింత విస్తరిస్తాం పార్టీల చరిత్ర, పాలన బేరీజు వేసుకుని ఓటేయాలని విజ్ఞప్తి -
ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేక పోయాం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా వ్యక్తీకరణ బాగా చేసి చూపించ లేకపోవడంతో నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. అందరితో తిట్లు తింటున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని సంజాయిషీలు, వివరణలు ఇచ్చేందుకే ఉద్యోగార్థులతో ఇటీవల భేటీ అయ్యాం. వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు, ఇతర అవాంతరాలను అధిగమించి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తాం..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్, సంజయ్ ఎంట్రన్స్‌లు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నారా? ‘టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని గుర్తించి చర్యలు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. నేను అనేక ఎంట్రన్స్‌లు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నా. చదువుకుని ఉద్యోగాలు చేశా. రేవంత్, బండి సంజయ్ లాంటి వారు ఎప్పుడైనా ఇలాంటివి ఎదుర్కొన్నా రా? దేశంలో మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచి్చన రాష్ట్రాలు లేవని మోదీ, రాహుల్‌కు సవాలు చేస్తు న్నా. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నిరుద్యోగుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. కేంద్రంలో 59 లక్షల ఉద్యోగాలు ఉంటే, రాష్ట్రంలో ఉన్నవి ఏడున్నర లక్షలు మాత్రమే. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నార నేది అవాస్తవం, వారి సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు ఉండొచ్చు..’ అని కేటీఆర్ చెప్పారు. సాధించాల్సింది ఇంకా ఉంది ‘స్థిరత్వం, సమర్ధత, నమ్మకత్వం, పనితీరు, తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం పెంచడం వంటివి మేము సాధించాం. తెలంగాణలో మేము తెచి్చన మార్పు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టం ప్రజలకు విడమరిచి చెప్తున్నాం. ‘సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది’ అనేది మా నినాదం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉన్నాయి. కోవిడ్ వల్ల రాష్ట్ర బడ్జెట్‌కు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. సంక్షేమ పథకాలు కొనసాగించడం వల్ల ఇతర పనులు కొంత మందగించాయి. రక్షణ శాఖ భూములు కేటాయించి ఉంటే పాట్నీ, జేబీఎస్ స్కైవేలు పూర్తి చేసి ఉండేవాళ్లం. హైదరాబాద్‌లో రోడ్లు, కరెంటు తదితరాలు బాగు చేశాం. డ్రైనేజీ, వరద నీటి వ్యవస్థను ఇంకా మెరుగ్గా చేయాల్సి ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే మూసీ సుందరీకరణ, వరద నీటి నిర్వహణ పనులు చేస్తాం. కాళేళ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే పేదరికం తొలిగిపోతుంది..’ అని అన్నారు. సోనియా సరిగా హ్యాండిల్ చేయలేదు ‘కాంగ్రెస్‌లో మా పార్టీ విలీన ప్రతిపాదనను సోనియా సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్లే మేము ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చాం. నేను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. కుటుంబ పార్టీ విమర్శలు వస్తాయని కేసీఆర్‌కు చెప్పినా ఆయన తోసిపుచ్చి మంత్రిని చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు నీరు అందించడం నా జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం..’ అని కేటీఆర్ చెప్పారు. తమపై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. ‘మాపై దుర్భాషలాడు తున్న ప్రతిపక్షాలను తొక్కేసి ఉండాల్సింది. జర్నలిస్టుల ముసుగులో యూ ట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రతికూల ఎజెండాను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఉండాల్సింది...’ అని వ్యాఖ్యానించారు. కుంభకోణాలకు చిరునామాగా మార్చేందుకా? ‘మార్పు కోసం అధికారం ఇవ్వాలని కోరుతున్న వారు.. ఆరు నెలల్లో సీఎంని మార్చేందుకా, కుంభకోణాలకు చిరునామాగా మార్చేందుకా? ఎందుకో చెప్పాలి. గుజరాత్లో బీజేపీ ఐదుమార్లు గెలిచినప్పుడు, 50 ఏండ్లు కాంగ్రెస్ అధికారం చెలాయించినపుడు మార్పు అవసరం అనిపించలేదా? ప్రజలు ప్రగతికి, సానుకూల రాజకీయాలకే ఓటు వేస్తారు. మేము బీజేపీ సహా ఏ పార్టీకి బీ టీమ్ కాదు. మేము జాతీయ రాజకీయాల్లోకి విస్తరించకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలు ఇవి. 2014, 2018 లోనూ మేము ఓడిపోతున్నామంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు వంటి నేతలు రూ.500 కోట్లతో వచ్చి మహాకూటమి ఏర్పాటు చేయడం వంటివి చూశాం. ఇప్పుడు కూడా ఏదో జరుగుతుందని అపోహలు సృష్టించడం కాంగ్రెస్ గేమ్‌ప్లాన్‌లో భాగం. మేం 70 నుంచి 82 స్థానాల్లో గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయి. సొంతంగానే మెజారిటీ సాధిస్తాం. అనుకున్నది సాధించే నైజం కలిగిన కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధిస్తాం. ఐదు అంచెల పాలన వ్యవస్థ ఉన్న చోట సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదు. అయినా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ప్రజా దర్భార్’ నిర్వహిస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు. -
ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం
సాక్షి, మహబూబాబాద్/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్ఎస్కూ కాలం చెల్లింది. ఓటమికి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అంతిమ గడియలు లెక్కపెట్టుకుంటోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారన్నారు. ‘మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ప్రజలు చైతన్య వంతులు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచి్చందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఈ చైతన్యంతో ఫాం హౌజ్‌లో ఉండి పాలించే నాయకులు కావాలో.. ప్రజల మధ్య ఉండి పాలించే కాంగ్రెస్ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని తొర్రూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం ప్రజలు చేసిన పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉందని చెప్పారు. I wanted to see Indiramma but cannot see, Now I have seen her Granddaughter Priyanka Gandhi Ji. A woman who met Priyanka Gandhi Ji expresses her love towards Gandhi Family.@INCIndia @INCTelangana @SpiritOfCongres pic.twitter.com/fvION4sSJY — Abdur Rahman Ansari (@AnsariiTweets) November 24, 2023 యువత జీవితాలు చీకటి మయం ‘రాష్ట్రం సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ యువత జీవితాలను చీకటి మయం చేశారు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీలతో చదువుకున్న వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ఉద్యోగం రాలేదని విద్యారి్థని ఆత్మహత్య చేసుకుంటే. ఆ కుటుంబాన్ని ఓదార్చా ల్సిన ప్రభుత్వం, నాయకులు అసలు ఆమె పరీక్షే రాయలేదని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ప్రభుత్వానికి యువతపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరిగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మంచి విద్యను అందించేందుకు ప్రతీ మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్‌ను నెలకొల్పుతామన్నారు. మహిళగా వారు పడే బాధలు తెలుసు ‘ఒక మహిళగా తెలంగాణలో మహిళలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఉప్పులు పప్పుల రేట్లు పెరిగినప్పుడు, గ్యాస్, కరెంట్ బిల్లులు భారమైనప్పుడు మహిళలే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇటువంటి ఖర్చులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన పథకాలు అమలు చేస్తాం’ అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. సాగునీటి కోసం రూ.లక్ష కోట్లు వెచి్చంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు పారీ్టలూ ఒక్కటే.. వారికి మద్దతుగా ఎంఐఎం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. డబ్బులు పెరిగితే మనిíÙలో అహం పెరుగుతుందని, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు అహం పెరిగి ప్రజల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పార్లమెంట్లో పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలకు అంటకాగుతున్న ఎంఐఎం నాయకులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ను విమర్శించడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని ప్రియాంక చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అభ్యర్థులు యశస్వినిరెడ్డి (పాలకుర్తి), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), పార్టీ రాష్ట ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రులు దినేష్ గుండూరావు, తీన్మార్ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజలను నమ్ముకుంది: పొంగులేటి బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్‌రావు డబ్బులను నమ్ముకున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను నమ్ముకున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో ఇచి్చన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9, మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం గెలుస్తుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం కేసీఆర్ మాత్రమే అనుభవిస్తున్నారని, మన త్యాగాల ఫలం మనమే అనుభవించాలంటే కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. Priyanka Gandhi Surprise visit to a Farmer Family house in Telangana 👉 Today afternoon, Congress leader Priyanka Gandhi suddenly got an opportunity to speak to Ramadevi in the language of love in Telangana, not Telugu / Hindi#PriyankaGandhi #ByeByeKCR #TelanganaElection2023 pic.twitter.com/tYZHUeBaUI — Team Congress (@TeamCongressINC) November 24, 2023 ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం ప్రియాంక ఉన్న ఫళంగా ఓ గీతకార్మికుడి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభను ముగించుకొని కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో కిషన్‌నగర్‌లో నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇంటికి మామిడి తోరణాలు, బంతిపూల దండలు కనిపించడంతో ప్రియాంక కారు ఆపి వారి ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ యజమాని గీత కార్మికుడు జాగిరి రాజయ్య, రమ దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండటంతో పూజ గురించి ఆరా తీశారు. ఇంటి నిర్మాణం ఎందుకు ఆపారని, దుకాణం ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. దీంతో ఇంటి యాజమాని ఆర్థిక ఇబ్బందులే కారణమన్నారు. ఇంటి యజమానురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోన్ నంబర్ తీసుకున్నారు. -
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బండ్లగూడ, అంబర్‌పేట (హైదరాబాద్): తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కోట్లాది రూపాయలు తెచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని, బీసీని సీఎం చేసి తీరుతామని అన్నారు. తన కుమారుడు కేటీఆర్ కోసమే కేసీఆర్ రాష్ట్రంలో అవినీతి పాలన సాగించారని ఆరోపించారు. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్లకే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని, ఇక కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రి పదవి కావాలంటే ఢిల్లీలో చర్చ జరగాలని అన్నారు. ఇలాంటి పారీ్టలు మనకు అవసరం లేదని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల సకల జనుల సంకల్ప సభలో, హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్షాకోట్, నగరంలోని నిజాంపేట, అంబర్‌పేటల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ అంకం ముగిసిపోయింది.. ‘గత ఎన్నికల్లో ఇచి్చన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. 2014 ఎన్నికల తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారు. బీఆర్ఎస్ అంకం ముగిసిపోయింది. ఆ పార్టీ పాలనలో ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు, మద్యం, గ్రానైట్ కుంభకోణాలే ఉన్నాయి. అవినీతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనులు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్‌లు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు ప్రజలంతా బీజేపీని గెలిపించాలి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారికి జైలు శిక్షలు విధిస్తాం. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా యువత జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. కేవలం తన కుటుంబానికే పదవులు కలి్పస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు కొమ్ముకాస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అవినీతిని అంతమొందించి ఆయన్ను ఇంటికి పంపిస్తేనే ఎంఐఎం అగడాలకు అడ్డుకట్ట పడుతుంది..’ అని అమిత్‌షా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి బీజేపీ కృషి ‘ప్రధాని మోదీ దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా పరిష్కరించని అయోధ్య రామాలయం సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పాటుపడుతోంది. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించి బాధ్యులను జైలుకు పంపుతాం. రెండున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఉన్న గల్ఫ్ కారి్మకుల కోసం ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీని తీసుకొస్తాం. బీడీ కారి్మకులకు ఉచిత చికిత్స కోసం నిజామాబాద్‌లో 500 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తాం. పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీని తగ్గిస్తాం. రూ.3,100కు క్వింటాల్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అయోధ్య శ్రీరాముని దర్శనం కలి్పస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మోదీ సంకల్పంతో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నాం. దీంతో పసుపు రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి..’ అని అమిత్‌షా చెప్పారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారీ్టతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, అభ్యర్థులు కృష్ణయాదవ్ (అంబర్‌పేట), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్), ఏలేటి అన్నపూర్ణమ్మ (బాల్కొండ), పైడి రాకేశ్‌రెడ్డి (ఆర్మూర్), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరినీ దూరం పెట్టారు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పారీ్టకి ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’ అని సీఎం కేసీఆర్‌ను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరన్నారో గానీ.. దాని తోకలి్న, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు’ అని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిగా 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్ ఎవరి మాటా వినడు’ అన్నట్లు తయారయ్యారని విమర్శించారు. ఈమేరకు కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ఉద్యమ కాలంలో అన్ని పారీ్టల గడపలు తొక్కిన మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్థిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కారి్మక సంఘాలు, విద్యారి్థ, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తమ కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలామందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది’ అన్నారు. అహంకారం, మీ నియంతృత్వ ధోరణి.. ‘మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి, ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అర్థమైపోతుంది. మీ పారీ్టకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు’అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీవీలను, పత్రికలను 10 కి.మీ లోతులో పాతిపెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచి్చన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీరి్ణంచుకోవడం లేదు. ‘ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేశారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలుచేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖధ్వజమెత్తారు. సీఎం ఎక్కడ ఉంటారో తెలియదు.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు గురచెందుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘గతంలో ఎందరో పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవ¯Œన్ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి ప్రజాభీష్టంతో పనిలేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా?’అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వంటి పెద్దలెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకలి్పంచారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదేనా మీ రాజ్యాంగం? ‘మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతిభవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ‘స్పీకర్ దగ్గర జరిగే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు’ అని హెచ్చరించారు. -
రాష్ట్రంలో బీజేపీదే అధికారం
కీసర, గోల్కొండ/కంటోన్మెంట్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎంతమందికి భూమి ఇచ్చారో చెప్పాలనీ, ఇంటికో ఉద్యోగమన్న సీఎం రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని విచారణ చేపడుతామన్నారు. శుక్రవారం నాగారంలోని రాంపల్లిలో, కార్వాన్ నియోజకవర్గంలో, కంటోన్మెంట్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి పీఎం మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారనీ, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మడం లేదన్నారు. దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తున్న బీజేపీ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. దశాబ్దాల తన పాలనలో దేశాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు అన్ని చోట్లా తిరస్కరించారని, ఇక్కడా అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పరిపాలన దక్షత ఏమిటో ప్రజలకు తెలిసినందువల్లే వారు వరుసగా మోదీకి జై కొడుతున్నారని అన్నారు. నేడు దేశం ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరిందంటే అది ప్రధాని మోదీ సమర్థపాలన, సరైన విధాన నిర్ణయాలే కారణమని చెప్పారు. పార్టీ అభ్యర్థులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి (మేడ్చల్), టి.అమర్‌సింగ్ (కార్వాన్)కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్వాన్ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్ చౌరస్తా నుంచి దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు జరిగిన బీజేపీ రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కుటుంబ పాలనకు ప్రాధాన్యమిచ్చే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు. బీజేపీ ఏదైనా చెబితే తప్పకుండా చేసి తీరుతుందన్నారు. 1951లో ఏర్పడిన జనసంఘ్ తమకు పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ వస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని మరుసటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అలాగే, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని 1980 దశకంలో ప్రకటించిందన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370 రద్దు చేశామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తిచేసి జనవరిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు బేకార్ అని వ్యాఖ్యానించారు. -
రైతురాజ్యం తీసుకొస్తాం
కొత్తపల్లి (కరీంనగర్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతురాజ్యం తీసుకొస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వరికి రూ. 3,100 మద్దతు ధర చెల్లిస్తామని, ఎకరానికి రూ. 24 వేల సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (హెచ్)లో చేపట్టిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రెండు పంటలకు కలిపి రైతులకు ఏటా రూ. 12 వేలు ఇవ్వడంతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ. 18 వేలు చెల్లిస్తోందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ. 6 వేలను బ్యాంకులో జమ చేస్తోందని చెప్పారు. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 24 వేలు సాయం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతుబంధు పేరుతో రూ. 10 వేలు మాత్రమే సాయం చేస్తోందని బండి సంజయ్ వివరించారు. పేదలకు ఇప్పటికే ఉచితంగా ‘ఉజ్వల’సిలిండర్లు ఇస్తున్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ అధికారంలో ఉండి ఏమీ చేయలేక.. తనపై అవినీతి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మంత్రి తెచ్చిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని... ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా ఆ భవనంలోకి రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదని బండి సంజయ్ ఆరోపించారు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తామని రూ. 46 వేలు డిపాజిట్ చేయించుకొని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దని ఆయన దుయ్యబట్టారు. రేషన్ మంత్రిగా ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉండి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా రూ. 1,300 కోట్లను గోల్మాల్ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు భూకబ్జాదారులని, ఎవరి చరిత్ర ఏమిటో బేరీజు వేసుకొని ఓటేయాలని ప్రజలను సంజయ్ కోరారు. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్‌కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్‌కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
రూ.300 కోట్లు డంప్ చేశారు
బంజారాహిల్స్: విశ్రాంత ఐఏఎస్, మాజీ ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఎన్నికల కోసం ఏకే గోయల్ ఇంట్లో సుమారు 300 కోట్ల రూపాయల డంప్ ఉందని దీనిపై విచారణ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు జూబ్లీహిల్స్‌లోని గోయ ల్ ఇంట్లో సోదాలు జరిపారు. ఐదుగురు అధికారుల బృందం లోపలికి వెళ్లగా జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న మల్లు రవితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గోయల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన వాహనాలతోపాటు టాస్‌్కఫోర్స్ సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినప్పటికీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశ్, జ్ఞానేశ్వర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజారుద్దీన్ అండ్ కో ధర్నా పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో జూబ్లీహిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సీ నియర్ కాంగ్రెస్ నాయకుడు భవాని శంకర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసి న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశా రు. దీంతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితమే సమాచారం: మల్లు రవి గోయల్ ఇంట్లో నుండి డబ్బులు తరలిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే తమకు సమాచారం అందిందని మల్లు రవి తెలిపారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి నిర్ధారించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చాక కొన్ని వాహనాలు బయటికి వెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆరోపించారు. సోదాలు రాత్రి పొద్దు పోయేవరకు సాగాయి. పశ్చిమ మండలం అడిషనల్ డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్‌పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్‌గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్‌కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.