అందరినీ దూరం పెట్టారు | BJP State President Kishan Reddy Open Letter To KCR, Claims KCR Is A Dictator - Sakshi
Sakshi News home page

అందరినీ దూరం పెట్టారు

Published Sat, Nov 25 2023 2:43 AM

BJP state president Kishan Reddy open letter to KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పారీ్టకి ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’ అని సీఎం కేసీఆర్‌ను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరన్నారో గానీ.. దాని తోకలి్న, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు’ అని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిగా 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్‌ ఎవరి మాటా వినడు’ అన్నట్లు తయారయ్యారని విమర్శించారు.

ఈమేరకు కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ఉద్యమ కాలంలో అన్ని పారీ్టల గడపలు తొక్కిన మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్థిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కారి్మక సంఘాలు, విద్యారి్థ, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తమ కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలామందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది’ అన్నారు.  
 
అహంకారం, మీ నియంతృత్వ ధోరణి.. 
‘మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి, ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అర్థమైపోతుంది. మీ పారీ్టకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు’అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీవీలను, పత్రికలను 10 కి.మీ లోతులో పాతిపెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచి్చన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీరి్ణంచుకోవడం లేదు. ‘ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేశారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలుచేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖధ్వజమెత్తారు. 
 
సీఎం ఎక్కడ ఉంటారో తెలియదు.. 
ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు గురచెందుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘గతంలో ఎందరో పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్‌ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవ¯Œన్‌ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి ప్రజాభీష్టంతో పనిలేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా?’అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి పెద్దలెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకలి్పంచారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 
 
ఇదేనా మీ రాజ్యాంగం? 
‘మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతిభవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ‘స్పీకర్‌ దగ్గర జరిగే బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు’ అని హెచ్చరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement