breaking news
-
ఉమ్మడి వరంగల్.. ఎవరి వ్యూహాలు వారివే
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. నేతలు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరలేపి, ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 12 నియోజకవర్గాల నుంచి 36 మంది పోటీలో ఉన్నా రు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ సాగుతుండగా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, శ్రేణులు రంగంలోకి దిగగా.. మరోవైపు ఎలాగైనా సత్తా చాటాలని స్వతంత్రులు పావులు కదుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో నేతలు, అభ్యర్థులు తమ చివరి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరిరోజున ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, కులసంఘాల భేటీలతో పట్టభద్ర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఓరుగల్లు ప్రచారంలో అగ్రనేతలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 16న ఉమ్మడి వరంగల్‌లో తొలి ప్రచార సభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్ అప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు అమిత్‌షా, అనురాగ్ ఠాకూర్, అశ్వినికుమార్ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో తిరగ్గా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు క్యాంపెయిన్ నిర్వహించారు. ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, విజయశాంతి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్పీ పక్షాన ఆ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. మొత్తంగా 13 రోజుల పాటు పోటాపోటీగా సాగిన ప్రచారం, డీజేలు, మైకుల మోత మంగళవారం సాయంత్రం నిలిచింది. ఎవరి వ్యూహాలు వారివే.. ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లి నుంచి 9 మంది ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజుకోరీతిలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ప్రచారం పోరు రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు ప్రచార ఆర్భాటానికి మంగళవారం సాయంత్రం తెరపడడంతో రాత్రి నుంచి డబ్బులు, మద్యం, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా.. నగదు, మద్యం భారీగా పంపిణీ జరుగుతుందన్న ప్రచారం మేరకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24 చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.12 కోట్ల మేరకు నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. -
నా సపోర్ట్ ఆ పార్టీకే : జ్యోతక్క క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలంగాణ యాంకర్ శివజ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె బీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేస్తోందో వివరించింది. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనకు నచ్చినది చెప్తున్నానని క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్కు మద్దతివ్వడాన్ని ఆమె అంశాల వారిగా వివరిస్తూ సమర్థించుకున్నారు. నువ్వెందుకు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నావని తిడుతున్న వారి కోసమే వీడియో పెడుతున్నానని తెలిపింది. ‘సర్కార్‌తో హ్యాపీగా ఉన్నామని దేశంలో తెలంగాణ రైతులు మాత్రమే చెబుతున్నారు. కరెంటు లేకపోతే అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండె. అప్పులు కట్టలేనన్న రైతుల ఇండ్ల తలుపులు పీక్కుపోయిన ఘటనలున్నాయి. కరెంటే లేకపోతే ఫోన్ల చార్జింగ్‌లు ఎట్ల పెట్టుకునేటోళ్లం. యూ ట్యూబ్‌ల వీడియోలు ఇట్ల చూస్తుంటిమా. కళ్యాణలక్ష్మి ఇచ్చిందెవరు కేసీఆర్ సార్ కాదా. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య ఎప్పుడు పరిష్కారమైంది. ఎవరు పరిష్కారం చేశారు’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘పెద్దకొడుకు లెక్కముసలోల్లకు రూ.2016 పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ సార్ కాదా. ఉద్యోగాలివ్వాలని అడిగితే పెన్షన్ల గురించి ఎందుకు చెబుతున్నావని కొందరు అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలు రావు కదా. ఉద్యోగాలు రాని వాళ్ల తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి. మార్పు రావాలి అని అంటున్న వాళ్లతో 60 ఏళ్లు వెనక్కి పోతాం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుక్కుంటున్నరు. ముఖ్యమంత్రి పదవి కోసం కాదా వాళ్ల తాపత్రయం. వాళ్ల మోసాన్ని గమనించకుండా ఉద్యోగాల కోసం మార్పు కావాలనుకుంటే కరక్టేనా. దేశంలో అన్ని స్టేట్లలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ సర్కారు కాదా’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘కేసీఆర్ సారు రాజకీయాల్లో ఉన్నంత కాలం సారే సీఎం కావాలి. సార్ ఒక్క హ్యాట్రిక్ కాదు ఎన్నో హ్యాట్రిక్‌లు కొట్టాలి. మేమే ఇచ్చినం కదా అనేటోళ్లు ఎప్పుడిచ్చిండడ్రో ఆలోచించుకోవాలి. స్వాతంత్రం ఇచ్చిన బ్రిటీష్ వాళ్లు గొప్పోళ్లా సాధించుకున్న మనం గొప్పోళ్లమా. సార్ ఒక్క ఛాన్స్ కావాలని అడగలే సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినందుకు, అభివృద్ధి చేసినందుకే నేను బీఆర్ఎస్ పార్టీ సైడున్న. నెగెటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్ చేసినా సరే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని కోరతాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని జ్యోతక్క కోరారు. ఇదీచదవండి..మనమేమన్నా గొర్రెలమా..కాదని 30న చెప్పాలె -
చివరి ప్రచార సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
సాక్షి, గజ్వేల్ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్‌లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్ కావాల్నా..24 గంటల కరెంట్ కావాల్నా’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుంది’అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం -
తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదరీసోదరీమణులారా.. అంటూ భావోద్వేగపూరితంగా తన సందేశం పంపించారామె. ‘‘తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయాను. కానీ, ప్రజల హృదయాలకు మాత్రం చాలా దగ్గరయ్యాను. నన్ను సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలి. తెలంగాణ అమరవీరుల కల నెరవేరాలి. నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’’ అని వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారామె. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే: సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే. తెలంగాణ ప్రజలను గోస పెట్టించుకున్నారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. చాలా రాష్ట్రాలు మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. 50 కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్ఎస్ పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. వరంగల్ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. వరంగల్‌కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. బీసీలకు సీట్లు ఇచ్చిన ప్రతీ చోటా అందరూ ఏకమై వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కామెంట్స్ చేశారు. -
కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి!
సాక్షి, చెంగిచెర్ల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పోలీసు అధికారి కారులో డబ్బు తరలిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుని దాడికి చేశారు. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా చెంగిచర్ల దగ్గర కారులో డబ్బుల సంచుల కలకలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారును అడ్డుకుని తనిఖీలు చేశారు. కారులో నగుదు ఉన్న సంచులను గుర్తించారు. అనంతరం, ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు వచ్చి నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ చేశారు. దీంతో, ఆవేశంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త.. సీఐ అంజిత్ రావుపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దొరికిన డబ్బును మంత్రి మల్లారెడ్డికి చెందినది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. -
బీజేపీ గ్రాఫ్ పెరిగింది.. కారు షెడ్డుకు వెళ్ళడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టోనని పేర్కొన్నారు. ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతిపాలు కావొద్దన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలు ఆపివేయడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను ఏమార్చుతోందని మండిపడ్డారు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు లక్ష్మణ్. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ క్యాడర్లో జోష్ నింపిందని తెలిపారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో కారు షెడ్డుకు వెళ్ళడం... హస్తానికి మొండి చెయ్యి గ్యారంటీ అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రాలేదని ప్రస్తావించారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి చేశారు. గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్ తెలిపారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా? -
కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన వివాదం రైతుబంధు నిధుల పంపిణీ. తొలుత రైతులకు ఈ నిధుల పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం, మళ్లీ దానిని నిలిపివేయడంతో పార్టీల మధ్య రచ్చరచ్చ అయింది. రైతుబంధు ఆగడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి ప్రయోజనం అన్నది ఆలోచిస్తే రాజకీయంగా బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పక తప్పదు. నిజానికి రైతుబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ పేటెంట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం కింద జమ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ డబ్బు వేస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంటుంది. అలా చేయడం రైటా? రాంగా? అన్న చర్చలోకి వెళ్లడం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరడం, దానికి ఈసీ ఓకే చేస్తూ కొన్ని కండీషన్లు పెట్టడం జరిగింది. వాటి ప్రకారం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోరాదు. కానీ, మంత్రి హరీశ్‌రావు అత్యుత్సాహంతో ఎన్నికల ప్రచార సభలో పోలింగ్‌కు ముందే రైతుబంధు డబ్బులు జమ అవుతాయంటూ చేసిన వ్యాఖ్య ఆ పార్టీకి చికాకు అయింది. తాను కేవలం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించానని, కాంగ్రెస్ ఫిర్యాదువల్లే ఇది ఆగిందని ఆయన అంటున్నారు. ఈ పరిణామంతో నెగిటివ్ రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితర బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా రంగంలోకి దూకారు. రైతు బంధు నిలిపివేత అంశం అంతటిని కాంగ్రెస్‌పై నెట్టడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా యత్నించారు. కానీ, ఎన్నికల సంఘం నేరుగా హరీశ్ రావు పేరు ప్రస్తావించడంపై వివరణ ఇవ్వలేని పరిస్థితిలో వారు పడ్డారు. అయితే, ఎటూ తామే పవర్లోకి వస్తామని, డిసెంబర్ ఆరో తేదీన ఈ డబ్బు రైతులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఇన్నేళ్లుగా ఈ స్కీమును అమలు చేస్తున్నారు కనుక రైతులు విశ్వసించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కోణంలో బీఆర్ఎస్కు పెద్ద నష్టం ఉండదు. నిజానికి రైతులకు మరో పది రోజుల తర్వాత వారి ఖాతాలలోకి రైతుబంధు నిధులు జమ చేస్తే వచ్చే సమస్య ఏమీ ఉండదు. ఇన్నాళ్లు ఆగిన రైతులు మరో పది రోజులు ఆగలేకపోరు. కానీ, బీఆర్ఎస్ వేసిన వ్యూహానికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. సరిగ్గా పోలింగ్ రెండు రోజుల మందు డబ్బులు పడితే రైతులంతా సంతోషిస్తారని, తద్వారా రాజకీయంగా తమకు మేలు కలుగుతుందని అనుకొని ఉండవచ్చు. కానీ, అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అవడం వారికి నిరుత్సాహం కలిగించవచ్చు. బీఆర్ఎస్ నేతలంతా జనంలోకి వెళ్లి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదువల్లే రైతుబంధు ఆగిందని చెబుతున్నారు. దీనిని కాంగ్రెస్ తిప్పికొట్టడానికి కృషి చేస్తున్నా, రైతులు ఈ పార్టీ వల్లే రైతుబంధు నిలిచిందని నమ్మితే కొంత నష్టం జరగవచ్చు. ఇప్పటికే రేవంత్, తదితరులపై రైతు వ్యతిరేక ముద్ర వేస్తూ కేసీఆర్ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు. మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని రేవంత్ అన్నారని, రైతుబంధు డబ్బులు దండగ అని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారంటూ వీరు ఈ నెల రోజులపాటు విపరీత ప్రచారం చేశారు. దానిని తోసిపుచ్చలేక కాంగ్రెస్ సతమతమైంది. ఇప్పుడు రైతుబంధు నిధులను కాంగ్రెస్ ఆపిందన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి తెలివిగా కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. దీనికి రైతులు ఆకర్షితులైతే కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రయోజనం జరగవచ్చు. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్లకు పదిహేనువేలు ఇస్తారో రేవంత్ చెప్పలేదు. పైగా అది అంత తేలికకాదన్న విషయం అందరికీ తెలుసు. పదివేల రూపాయలనే రెండు విడతలుగా ఇవ్వడానికే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. అలాంటిది ఒకేసారి ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వడం అంటే దాదాపు అసాధ్యమే కావచ్చు. అయినా రైతులు తమకు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మితే అది కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విషయంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి ఘట్టాలు జరగకపోలేదు. 1999 ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఆనాటి కాంగ్రెస్ నేత రోశయ్య ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానిపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. కాంగ్రెస్ వల్ల పేదలకు నష్టం జరుగుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో దీని ప్రభావం ఎంత పడిందన్నది వేరే విషయం. ఎందుకంటే వాజ్ పేయిపై ప్రజలలో ఉన్న సానుభూతి ఉపయోగపడి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయా స్కీములలో ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు అధికారంలోకి రావాలని లేదు. ఒక్కోసారి ప్రయోజనం ఉంటుంది. ఇంకోసారి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2019లో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ హడావుడిగా రెండు స్కీములు తెచ్చి వేల కోట్ల పందారం చేసింది. అయినా ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్కు రైతుబంధు పథకం బాగా ఉపయోగపడింది. దానికి కారణం కేసీఆర్‌ను జనం నమ్మడమే. అయితే, ఎన్నికల సమయంలో ఇలాంటివి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ తరహా స్కీముల విషయంలో ఫిర్యాదు చేస్తే ఒకరకంగా, ఫిర్యాదు చేయకపోతే ఇంకో రకంగా రాజకీయం ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రజల మూడ్‌ను బట్టి ఉంటుంది. రైతుబంధు నిధుల తాత్కాలిక నిలిపివేత వల్ల రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ, రైతులకు పెద్ద నష్టం ఉండదని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాండ్ పేపర్లతో డ్రామాలా?.. కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు బాండ్ పేపర్లు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ‘‘కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారు. కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు. మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారు.11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదు. 9 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం. 50 ఏళ్లలో 41 రిజర్వాయర్లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో నిర్మించాం’’ అని కవిత పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ ‘బాండ్ పేపర్లు’ -
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్‌కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్‌రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్‌ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్‌కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్‌నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
ఇచ్చింది ఎంత? పంచేది ఎంత?
హైదరాబాద్: రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీల పోల్ మేనేజ్మెంట్ తుది దశకు చేరింది. వివిధ రకాల ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు తాయిలాలకు తెరలేపారు. అదే సమయంలో మద్యం, నగదు పంపిణీలో పలుచోట్ల కింది స్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటర్‌కు రూ.3000 నుంచి రూ.5000 వరకు నగదు, రెండు మద్యం బాటిళ్ల చొప్పున అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డివిజన్ స్థాయి నాయకులు అందులో సగం కూడా ఓటర్లకు ఇవ్వడం లేదని, దీంతో తాము పోల్మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను కలవలేకపోతున్నామని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులుఇచ్చిన డబ్బులో ద్వితీయశ్రేణి, డివిజన్ స్థాయి నాయకులే పెద్ద మొత్తంలో మింగేస్తున్నారని, దీంతో తాము ఓటర్లకు సమాధానం చెప్పకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. 48 గంటలే కీలకం.. గురువారం జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోల్ మేనేజ్మెంట్కు మంగళ, బుధవారాలే ఎంతో కీలకం కానున్నాయి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకలు పంపిణీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు. కిందిస్థాయిలో పంపకాల్లో గందరగోళం నెలకొంది. కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో ఉండే వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించే తాము చివరకు పంపకాల వద్ద ముఖం చాటేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. సగానికి తగ్గించి ఇస్తున్నారు.. ‘ప్రతిపక్షాల వాళ్లు పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారంటూ అభ్యర్థుల నుంచి వారి ప్రధాన అనుచరుల నుంచి భారీగా రాబట్టుకుంటున్నారు. కానీ ఏవో ఒకటి, రెండు కాలనీల్లో పంపిణీ చేసి మిగతా కాలనీలకు మొండి చేయి చూపుతున్నారు’ అని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన పార్టీ కార్యకర్త చెప్పారు. తాము తిరిగి ప్రచారం చేసిన కాలనీల్లో పంపిణీ చేయాల్సిన ఓటర్ల జాబితాను రూపొందించుకొని డివిజన్ స్థాయి నాయకుల వద్దకు వెళితే సగానికి సగం తగ్గించి ఇస్తున్నారని, దీంతో జాబితాలోని పేర్ల ప్రకారం డబ్బులు అందజేయలేకపోతున్నట్లు చెప్పారు. చివరకు కొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. కానీ అభ్యర్థుల నుంచి మాత్రం అంతకు రెట్టింపు మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. ‘పార్టీ’ల్లోనూ అంతే.. ఎన్నికల ఘట్టం తుది దశకు చేరిన ప్రస్తుత తరుణంలో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు మద్యం పంపిణీ కూడా అనివార్యంగా మారింది. ఈ క్రమంలో కాలనీలు, అపార్ట్మెంట్ల వారీగా రాత్రి పూట మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ చాలామంది ఓటర్లు ఇలాంటి పారీ్టలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులుగా ముద్ర పడకుండా ఉండేందుకు ఓటర్లు జాగ్రత్తలు పాటిస్తుండగా అనుచరగణాలు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయని, కార్యకర్తలకు మాత్రమే ప్రచారం అనంతరం ‘పార్టీ’లను ఏర్పాటు చేసి ఓటర్ల కోసం కేటాయించిన మద్యం బాటిళ్లను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడక్కడా భగ్గుమంటున్నారు. పోల్ మేనేజ్మెంట్కు మరో రెండు రోజులు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం మీడియాతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశం ఈనెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షలు కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు కోటి 62 లక్షల 92వేల 418 మంది పురుష ఓటర్లు 2,676 మంది ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 12వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదు సైలెంట్ పీరియడ్ మొదలైంది స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదు రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్ యూనిట్లు అదనంగా మరో 14 వేలు రిజర్వ్‌లో పెట్టిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది 27, 094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సీనియర్ సిటిజన్ ఓటర్లు(80 ఏళ్ల పైబడి)4,40,371 వీరిలో 1,89, 519 మంది పురుషులు, 2,50,840 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు 12 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు 2,933, దివ్యాంగులు 5 లక్షల 6వేల 921 మంది రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల సమస్యాత్మక కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్‌లో 1,800 సమస్యాత్మక కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఐదంచెల భద్రత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్ కేంద్రాలు సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకూ పోలింగ్ ఈసారి కొత్తగా మోడల్, మహిళా పోలింగ్ కేంద్రాలు హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ప్రతి సెగ్మెంట్లో 5 మహిళ, 5 మోడల్, ఒకటి దివ్యాంగుల పోలింగ్ కేంద్రాలు 375 కంపెనీల నుంచి కేంద్ర బలగాలు, 50 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ 144 సెక్షన్ అమలు 30వ తేదీ సాయంత్రం గం. 5.30ని.ల వరకూ మద్యం దుకాణాలు బంద్ కొడంగల్‌లో మంత్రి హరీశ్‌రావు కామెంట్స్ మార్పు రావాలని కాంగ్రెస్ అంటోంది ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు మార్పు రావాలా పేదలకు సంక్షేమం అందించినందుకు మార్పు రావాలా కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం తెలంగాణ లోక్‌పోల్ మెగా సర్వే ఇలా ఉంది.. Presenting you our final numbers for the upcoming #Telangana elections: ▪️BRS 33 - 35 ▪️INC 72 - 74 ▪️AIMIM 5 - 7 ▪️BJP 2 - 4 ▪️OTH 0 - 1 Sample size: Its a top up survey between 22nd November to 27th November with sample… pic.twitter.com/yVihaBD51z — Lok Poll (@LokPoll) November 28, 2023 బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో కిషన్‌రెడ్డి ప్రెస్ మీట్ నవంబర్ 30న ప్రజలు ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి మజ్లిస్ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే రాహుల్, ప్రియాంకలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ముస్లిం మహిళలు, తల్లులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజల్లోనూ బీజేపీకి ఆదరణ ఉంది రాహుల్, ప్రియాంకలు అవగాహన లేకుడా మాట్లాడుతున్నారు మజ్లిస్ పార్టీ రౌడీయిజాన్ని సహించేది లేదు డిసెంబర్ 3 తర్వాత తెలంగాణకు బీసీ సీఎం వస్తారు తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల దండయాత్ర పట్టున్న అసెంబ్లీ స్థానాలపై విస్తృత ప్రచారం అగ్రనేతల పర్యటనలతో కమలం క్యాడర్ లో జోష్ 8 సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ హైదరాబాద్ లో ప్రధాని భారీ రోడ్ షో బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉప కులాల విశ్వరూప మహా సభల్లో పాల్గొన్న ప్రధాని కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబ్ బాద్, కరీం నగర్ లో ప్రధాని సభలు 12 సభల్లో పాల్గొన్న జేపీ నడ్డా సికింద్రాబాద్, ముషీరాబాద్, కూకట్ పల్లి, జగిత్యాల, బాన్స్ వాడ, జుక్కల్, బోధన్, హుజూర్ నగర్ , చేవెళ్ల, నారాయణ పేట, మల్కాజ్ గిరి, జూబిలీ హిల్స్ సభల్లో పాల్గొన్న నడ్డా తెలంగాణలో 21 సభల్లో పాల్గొన్న అమిత్ షా రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట, కోరుట్ల, కొల్హాపూర్, ఖైరతాబాద్, మక్తల్, ములుగు, భువనగిరి, మునుగోడు, పటాంచేరు, ఆర్మూర్,హుజూరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, ఉప్పల్, నల్గొండ, వరంగల్,గద్వాల్, సూర్యాపేట సభల్లో పాల్గొన్న అమిత్ షా హైదరాబాద్ లో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా 8 సభల్లో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సిర్పూర్, వేములవాడ, గోషామహల్, మహబూబ్ నగర్, కల్వకుర్తి, సనత్ నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ సభల్లో పాల్గొన్న యోగి ఆరు సభల్లో పాల్గొన్న రాజనాథ్ సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం, కంటోన్మెంట్, ఆర్మూర్, మేడ్చల్, కార్వాన్ సభల్లో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ చార్మినార్, మలక్ పేట్, సిర్పూర్, పరకాల, దేవరకద్ర నియోజకవర్గాల్లో పర్యటించిన హిమంత బిశ్వశర్మ కొల్లాపూర్, ఎల్లారెడ్డి సభల్లో పాల్గొన్న నితిన్ గడ్కరీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అనురాగ్ సింగ్ ఠాకూర్ చివరిరోజు ప్రచారంలో పాల్గొన్న మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, యడ్యూరప్ప, జైరాం ఠాకూర్ సిరిసిల్ల ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కాంగ్రెస్ వల్లనే తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడింది కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతారు తప్ప ఇంకేమీ ఉండదు కేసీఆర్ వచ్చాక కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నాం గజ్వేల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని కష్టాలే కదా? ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? పెన్షన్ తమాషాకు ఇవ్వం పెన్షన్ రూ. 5 వేలకు పెంచుతాం తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష నాకు పదవులు ముఖ్యం కాదు.. తెలంగాణ అభివృద్ధే ముఖ్యం పేదలు లేని తెలంగాణ కావాలి మళ్లీ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి రావొద్దు పరిశ్రమలు తెచ్చుకున్నాం.. సంపదను పెంచుకున్నాం రైతుబంధు దుబారా అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారు పంటలకు 3 గంటల కరెంట్ సరిపోతుందా? రైతులకు 3 గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్నారు 24 గంటల కరెంట్ వృథా అంటూ రేవంత్ చెబుతున్నారు తెలంగాణ రాజకీయాల్లో నయా ట్రెండ్ బాండ్ పేపర్ల పేరుతో సరికొత్త రాజకీయం ఆరు గ్యారంటీలకు బాండ్ పేపర్ రాసిస్తున్న కాంగ్రెస్ గతంలో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్ కాంగ్రెస్, బీజేపీ నేతలకు బాండ్ రాజకీయాలు కొత్త ఏమీ కాదు: ఎమ్మెల్సీ కవిత మద్యం షాపులు బంద్ ఎల్లుండి పోలింగ్ నేపథ్యంలో మద్యం షాపులు బంద్ ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఎల్లుండి పోలింగ్ ముగిసే సమయం వరకు తెలంగాణలోని మొత్తం మద్యం షాపులు మూసివేత బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఈడీని ఉపయోగించుకుంది. అవినీతిలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే: సీఎం కేసీఆర్ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లే. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్ఎస్ పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. అందరూ మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. వరంగల్ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. వరంగల్‌కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్ హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మళ్లీ డిసెంబర్ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. *In view of the Telangana Assembly Elections 2023, all educational institutions in Hyderabad district will remain closed on 29th and 30th Nov 2023.* *Regular activities resume on 1 Dec 2023.*@TelanganaCS @CEO_Telangana — Collector Hyderabad (@Collector_HYD) November 28, 2023 మోదీతో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు: రాహుల్ గాంధీ నాంపల్లిల్లో కాంగ్రెస్ బహిరంగ సభ బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. నాపై దేశ వ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు నాపై 24 కేసులు ఉన్నాయి. ఓవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి?. కాంగ్రెస్ వాళ్లపై ఈడీ, కేసు పెట్టారు. ఓవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది బీఆర్ఎస్తో ప్రజలు కష్టాలు పెరిగాయి: ప్రియాంక ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారం పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. కాంగ్రెస్ గెలిస్తే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహిళలకు ప్రతీ నెల డబ్బుల ఇస్తాం. నిర్మల్‌లో ఉద్రిక్తత ఎన్నికల ప్రచారంలో నిర్మల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారంలో ఘర్షణ. మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తుండగా కర్రలతో దాడి చేసుకున్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒక వర్గం దాడికి దిగిందంటూ బీజేపీ నేతలు నిరసన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాహుల్ గాంధీ మాటామంతి.. హైదరాబాద్‌లోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న రాహుల్ సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందన్న ఆటోడ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నాం: రాహుల్ ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నాం కామారెడ్డి పట్టణంలో ప్రారంభమైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రోడ్ షో.. కామారెడ్డి చౌరస్తా వరకు సాగనున్న రేవంత్ రోడ్ షో. కామారెడ్డి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్న రేవంత్. హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్లతో జూమ్‌లో సమావేశం అయిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పాజిటివ్ వేవ్ నడుస్తుందని, కాంగ్రెస్ మెజారిటీ సాదిస్తుందన్న కేసీ. కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతున్నారని కానీ కానీ కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందంన్నారు కేసీ. కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారు కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పారు పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారు కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారు కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారు 11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదు 9 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం 50 ఏళ్లలో 41 రిజర్వాయర్లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో నిర్మించాం ప్రారంభమైన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొననున్న సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీం. హాజరైన జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు. పాల్గొన్న లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి సంజయ్ కుమార్ జైన్, నోడల్ ఆఫీసర్ చీఫ్ మహేష్ భగవత్. ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఈసీఐకి వివరించనున్న సీఈఓ వికాస్ రాజ్. మద్యం, నగదు కట్టిడిలో చివరి రెండు రోజులు కీలకమన్న సీఈసీ. మావోయిస్టు - సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న ఈసీఐ. కాసేపట్లో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరికాసేపట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ పాల్లొననున్న సీఈవో వికాస్‌రాజ్ అండ్ టీం హాజరుకానున్న జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఈసీఐకి వివరించనున్న వికాస్‌రాజ్ కామారెడ్డిలో పీక్స్‌కు ప్రచారం.. నేడు జిల్లా కేంద్రంలో ప్రధాన మూడు పార్టీల అభ్యర్థుల రోడ్ షోలు బీఆర్ఎస్ తరఫున రోడ్ షోలో పాల్గొననున్న కేటీఆర్, దోమకొండ, బీబీపేట, కామారెడ్డిలో రోడ్ షోలో రేవంత్ కాంగ్రెస్ బైక్ ర్యాలీలో పాల్గొననున్న రేవంత్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి రోడ్ షో ప్రధాన పార్టీల ప్రచారం నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు. నేటితో ప్రచారానికి ముగింపు నేటితో ముగియనున్న ప్రచార పర్వం సాయంత్రం ఐదు గంటకు మూగబోనున్న మైకులు 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు మూడు లక్షల మంది పోలింగ్ సిబ్బంది 13 జిల్లాలో సాయంత్రం 4 గంటలకు ముగియనున్న ప్రచార గడువు పోలింగ్ టైం ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేతరులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశం 119 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఏర్పాటు చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఈ నెల 30వ తేదీన పోలింగ్ డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా కామారెడ్డిలో కాంగ్రెస్ నేత ఇంట్లో పోలీసుల సోదాలు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంటి వద్ద ఉద్రిక్తత భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో అర్థరాత్రి దాటాక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలిసుల సోదాలు గడ్డం ఇందుప్రియ ఇంటికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం ఏ రైట్స్‌తో ఏ ఫిర్యాదుతో ఇంట్లోకి వస్తున్నారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు మహిళా కానిస్టేబుల్స్ ఎక్కడా అని ప్రశ్నించిన ఇందు ప్రియ ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగిన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్లపై కావాలనే దాడులు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావ్ ఆగ్రహం. ఫిర్యాదు చెస్తే పోలిసులు వచ్చారా? లేక బీఆర్ఎస్ నేతలు చెప్తే వచ్చారా అని ఆగ్రహం. నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలిసుల తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు పోస్టల్ బ్యాలెట్‌పై బండి సంజయ్ ఫైట్ పోస్టల్ బ్యాలెట్‌పై కొనసాగుతున్న వార్ ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాసిన బండి సంజయ్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు కరీంనగర్లోనూ ఉద్యోగులందరికీ తగిన సమయమివ్వాలని కలెక్టర్‌ను కోరిన బండి బండి లేఖపై సానుకూలంగా స్పందించిన ఈసీ నేటి సాయంత్రం వరకు గడువు పొడిగించిన ఈసీ బండికి ధన్యవాదాలు చెప్పిన ఉద్యోగులు ఖమ్మం జిల్లా రాజకీయం ఇలా.. నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాను చుట్టేసిన రాజకీయ పార్టీల అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ పర్యటనలతో జోష్‌లో గులాబీ శ్రేణులు రాహుల్, ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో కోలాహలం పొంగులేటి, భట్టి, తుమ్మల ముగ్గురు కలిసి ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలు తమవే అంటున్న కాంగ్రెస్ గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖమ్మంలో సీట్ల సంఖ్య పెరుగుతాయంటున్న బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గంలో కీలకంగా మారిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు జలగంతో పాటు వనమా, కూనంనేని మధ్య నడుస్తున్న త్రిముఖ పోటీ ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నడుస్తున్న రసవత్తరమైన పోటీ ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటమిలపై 300కోట్లు బెట్టింగ్‌లు దాటినట్లు సమాచారం మధిరలో గెలుపుపై ధీమాతో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్కమార్క. నల్లగొండ జిల్లాలో రాజకీయం ఇలా.. చివరిరోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల త్రిముఖ పోరు. సూర్యాపేటలో చతుర్ముఖ పోటీ. నియోజకవర్గాల వారీగా పోటీ వివరాలు. నల్లగొండ: కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఇక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీనిస్తున్న ఏఐఎఫ్బీ అభ్యర్థి పిల్లి రామరాజు. మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి(కాంగ్రెస్), భాస్కర్ రావు( బీఆర్ఎస్) మధ్య తీవ్రస్థాయిలో పోటీ బీజేపీ పోటీలో ఉన్నా నామమాత్రమే. నాగార్జునసాగర్: బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్, అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ బీజేపీ పోటీలో ఉన్నా నామమాత్రమే దేవరకొండ: కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర మధ్య గట్టి పోటీ నకిరేకల్: కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మధ్య తీవ్ర స్థాయిలో పోటీ బీజేపీ ఉనికి నామమాత్రమే మునుగోడు: మునుగోడులో ముక్కోణపు పోటీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ. బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య మధ్య తీవ్రస్థాయిలో పోటీ. బీఎస్పీ అభ్యర్థి చీల్చే ఓట్లే ఇక్కడ కీలకం తుంగతుర్తి: బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్, కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామ్యూల్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కోదాడ: బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ అభ్యర్థి సతీష్ రెడ్డి పోటీలో ఉన్నా నామమాత్రమే హుజూర్నగర్: హుజూర్ నగర్లో ముక్కోణపు పోటీ బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి శ్రీలత రెడ్డి నువ్వా నేనా అన్నట్లు ప్రచారం బీజేపీకి వచ్చే ఓట్లే ఇక్కడ గెలుపునకు కీలకం భువనగిరి: త్రిముఖ పోరు బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఆలేరు: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఐలయ్య మధ్య తీవ్రస్థాయిలో పోటీ ప్రియాంక కీలక కామెంట్స్ తెలంగాణ ప్రజల ఈ ఉత్సాహం సరికొత్త చరిత్ర లిఖించబోతోంది. ఈసారి తెలంగాణ ప్రజలు తమ కలల కోసం, అభివృద్ధి కోసం, వారి బలమైన భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. మార్పు కావాలి! కాంగ్రెస్ రావాలి! తెలంగాణ ప్రజల ఈ ఉత్సాహం సరికొత్త చరిత్ర లిఖించబోతోంది. ఈసారి తెలంగాణ ప్రజలు తమ కలల కోసం, అభివృద్ధి కోసం, వారి బలమైన భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. మార్పు కావాలి! కాంగ్రెస్ రావాలి! तेलंगाना की जनता का यह उत्साह इतिहास रचने जा रहा है। इस बार तेलंगाना के लोग… pic.twitter.com/PNKVsxfVnm — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 27, 2023 నేడు కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచార షెడ్యూల్.. జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ. జహీరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ. కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో ఎన్నికల ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి నేడు నల్లగొండకు ఫడ్నవీస్ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో బీజేపీ బహిరంగ సభ. హాజరుకానున్న ఫడ్నవీస్. -
అసైన్డ్ పట్టాలపైనే తొలి తీర్మానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే. గెలుపొందిన తర్వాత మంత్రివర్గం చేసే తొలి తీర్మానం అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాల అంశంపైనే ఉంటుంది. పట్టాలు ఇవ్వడమే కాదు.. వాటిని అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తాం. అసైన్డ్ భూములు గుంజుకుంటారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అసైన్డ్‌దారులకే అన్ని హక్కులు కల్పిస్తాం..’ అని భారత్ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి కాంగ్రెసోళ్లు రైతుబంధును నిలిపి వేయించారని విమర్శించారు. ‘ఇలా ఎన్ని రోజులు ఆపుతారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపితే ఈ పథకం ఆగిపోదు. కేసీఆర్ బతికున్నంత కాలం నిరాటంకంగా కొనసాగుతుంది. డిసెంబర్ మూడో తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 6వ తేదీ నుంచి రైతులందరికీ రైతుబంధు ఇస్తాం. ఈ విషయంలో రైతులు బాధపడాల్సిన అవసరం లేదు..’ అని స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి జిల్లా కేంద్రం, ఆందోల్ పట్టణాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శం ‘సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలిస్తే.. బీఆర్ఎస్ పదేళ్లు పాలించింది. అప్పుడు, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పెన్షన్ ఇస్తే..బీఆర్ఎస్ రూ.2 వేలకు పెంచింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 వేలకు పెంచుతాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నాం. అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం తర్వాత అదే వాహనంలో ఊర్లో దించుతున్నాం. కేసీఆర్ కిట్ కింద మగ బిడ్డపుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఇస్తున్నాం. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, కళ్లద్దాలు ఇచ్చాం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తున్నాం. రైతుబంధు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నాడు. రైతుబంధు దుబారానా? కాంగ్రెస్‌లోనూ రైతుబంధు తీసుకునే రైతులు, నాయకులు ఉన్నారు. వారికి సిగ్గు ఉందా? కాంగ్రెస్‌ను ఎలా సపోర్ట్ చేస్తారు? గుండెపై చేయి వేసుకుని ఆలోచించాలి. గత ఆరేళ్లుగా రెండు విడతల్లో రైతుబంధు వేస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్లు ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పథకం ఆపారు. యాసంగి పంటల కోసం నేను చెప్పిన తర్వాత అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆపారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? ‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అన్నీ బాధలే. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2 కేజీ బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాట్లాడితే మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఉండేవి. తద్దినం అని భోజనానికి పిలిస్తే మీ ఇంట్లో రోజూ ఇలాగే జరగాలని కోరుకున్నట్లు ఉంది కాంగ్రెసోళ్ల పరిస్థితి. టైలర్ బట్టలు కుడుతున్నాడు.. సూది కింద పడిపోయింది.. సూది దొరికితే కిలోశక్కరి పంచి పెడతానని దేవునికి మొక్కాడు.. ఇదేంటని ఆయన భార్య అడితే.. సూదైతే దొరకని.. శక్కరి పంచిపెట్టకపోతే దేవుడేం చేస్తాడు.. అన్న మాదిరిగా ఉంది వారి వైఖరి..’ అని ఎద్దేవా చేశారు. రైతులకు ధరణే శ్రీరామ రక్ష ‘ధరణి పోర్టల్ పుణ్యమా అని రైతులు నిశ్చితగా ఉన్నారు. కాంగ్రెసోళ్ళు దాన్ని తొలగించి భూమాత తెస్తామంటున్నారు. అది భూ మాతనా? భూ మేతనా? ధరణి పోతే..రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? మళ్లీ మొదటికే వస్తుంది. నీ భూమి నాకు..నా భూమి నీకు రాసి పంచాయితీ పెట్టే కాంగ్రెస్ కావాలా? తేల్చుకోవాలి. కాంగ్రెసోళ్లు డబ్బులు కౌలుదారులకు ఇస్తామంటున్నారు రైతులకు ఇవ్వం అంటున్నారు. రైతు మెడకు కౌలు రైతులను దూలం లెక్క పెడతామంటున్నారు. పెట్టించుకుందామా? ధరణే రైతుల భూములకు శ్రీరామ రక్ష. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే కైలాసంలో పెద్ద పాము మింగినట్లే..’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంకో పార్టీకి మతం పెచ్చి ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్రంలో ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. పీఆర్సీ కూడా వేశాం. ఆర్టీసీని ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. మైనార్టీల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు లాంటి వారు. మైనార్టీల సంక్షేమ నిధులను రూ.2 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెంచాం. కాంగ్రెస్ తన 50 ఏళ్ల పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా భావించింది. ఇంకో పార్టీకి మతం పిచ్చి. మంటలు పెట్టడం, మసీదులు తవ్వుదామా.. దర్గాలు తవ్వుదామా.. ఇదే తప్ప వేరే లేదు.. ప్రజలను విభజించి పాలిస్తుంది..’ అని ధ్వజమెత్తారు. నెలన్నరలో మాస్లర్ ప్లాన్ క్లియర్ ‘తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లె. ఎక్కువ భూములు మునగకుండా సాధ్యమైనంత త్వరలో రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. షాద్‌నగర్‌కు సాగునీళ్ల బాధపోతుంది. చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్‌కు దగ్గలో ఉంది. గత పాలకులు ఈ ప్రాంతంపై కొన్ని (111 జీఓ రూపంలో) ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్లెవరూ వాటిని ఎత్తేసే ప్రయత్నం చేయలే. పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేయలే. బీఆర్ఎస్ హయాంలో షాబాద్‌లో వెల్స్పన్ కంపెనీ, చందనవెళ్లిలో అమెజాన్ కంపెనీ, సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ, కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయి. గత ఎన్నికల్లో 111 జీఓ ఎత్తివేస్తామని హామీ ఇచ్చాం. ఈ మేరకు పూర్తిగా ఎత్తేశాం. అయితే దానికి మాస్టర్ ప్లాన్ కొంత అడ్డంకిగా మారింది. నెలన్నరలో మాస్టర్ ప్లాన్ క్లియర్ అవుతుంది. జీఓను పూర్తిగా ఎత్తివేయించే బాధ్యత నాదే. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆన్ చేశాం. మీ వాటా మీకే ఉంది. ఉద్ధండపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. కాలువలు తవ్వితే చాలు వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగు నీరు వస్తుంది. ఇక్కడికి కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాయేదో, రత్నమేదో గుర్తించాలి ‘ఎన్నికలొస్తే దేశంలో ఆగమాగం ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో చాలా పరిణితి రావాలి. మంచేదో.. చెడేదో? రాయేదో.. రత్నమేదో? గుర్తించాలి. అభ్యర్థులపై ఆరా తీయాల్సిందే. వీరి వెనుక ఉండే పార్టీల నడవడిక, ప్రజల గురించి ఆలోచించే విధానంపై ఆరా తీయాలి. గ్రామాల్లో చర్చలు పెట్టాలి. ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభల్లో మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థులు చింత ప్రభాకర్ (సంగారెడ్డి), చంటి క్రాంతికిరణ్ (ఆందోల్), అంజయ్య యాదవ్ (షాద్‌నగర్), కాలె యాదయ్య (చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల, సాక్షి,పెద్దపల్లి/హుజూరాబాద్: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తాం’అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. సింగరేణి కార్మీకుల ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేస్తామని హామీనిచ్చారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ‘సకలజనుల విజయ సంకల్ప యాత్ర’లో పెద్దపల్లి జిల్లాకేంద్రం, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లలో జరిగిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్స్ంగ్ ఉందని అమిత్ షా ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారనీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు మళ్లీ గెలిస్తే కేసీఆర్ దగ్గరకే వెళ్తారని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇచ్చి, బీఆర్ఎస్ పార్టీ కారును గ్యారేజీకి పంపే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఒవైసీకి భయపడే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని, తాము అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సామాజికంగా వెనుకబడిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన కేసీఆర్‌తో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే ... బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని అమిత్‌షా అన్నారు. పేదల తరఫున మాట్లాడినందుకే ఈటల రాజేందర్‌పై కేసీఆర్ కక్ష పెంచుకొని పార్టీ నుంచి బయటకు పంపారని నిందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత ధాన్యానికి మద్దతు ధర రూ.3100 ఇస్తామని ఆయన హామీనిచ్చారు. -
కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, యాదాద్రి: ‘తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కొట్లాడి, చెమట, రక్తం చుక్కలు చిందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వంలో కలలు సాకారం కాలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు రాలేదు. ఈ ఎన్నికల సమయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది. ప్రజాభవన్ నుంచి పాలన చేస్తాం. కేంద్రంలోని నరేంద్రమోదీ దేశసంపదను అదానీ, అంబానీకి ధారాదత్తం చేస్తోంటే.. తెలంగాణలో ఉన్న కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబానికి దోచి పెడుతున్నారు..’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, కోస్గిల్లో ప్రజాభేరి బహిరంగ సభల్లో, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. సోనియా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు ‘నా తల్లి సోనియాగాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నా తల్లి నెరవేర్చారు. ఈ దేశం కోసం నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. తెలంగాణలో ప్రాణత్యాగం చేసిన వారి ఉద్యమ స్ఫూర్తి వృధా పోకూడదు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమైనా చేస్తారని అనుకున్నాం. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా చేసిందేమీ లేదు. ప్రజల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టూ సంపూర్ణంగా పూర్తి కాలేదు..’ అని ప్రియాంక విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే ‘బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ, బీఆర్ఎస్లకు మద్దతు ఇస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో, బీఆర్ఎస్ రాష్ట్రంలో అన్నదమ్ముల పాలన సాగిస్తూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీ వాటికి చిన్న తమ్ముడిలా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. రాహుల్‌గాంధీ మీద ఒవైసీ అనవసర ఆరోపణలు చేస్తుంటారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక శక్తిగా ఎదిగారు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు రాహుల్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్తో పాటు బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే వత్తాసు పలుకుతోంది. ప్రధాని మోదీ ఈ దేశ ఆస్తులను పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారు. అదానీ ఒక్క రోజులో రూ.1,600 కోట్లు సంపాదిస్తుంటే.. రైతు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడు..’ అని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేశాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణితో లాక్కున్న భూములను తిరిగి మీకు ఇప్పిస్తాం. ఇళ్లు కట్టుకునే వారికి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం చేస్తాం. రాజస్తాన్‌లో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగాన్ని తగ్గించాం. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరి 2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అవినీతిని పారదోలతాం. తెలంగాణ అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం. ఆదివాసీలకు భూ పట్టాలిస్తాం..’ అని ప్రియాంక హామీ ఇచ్చారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ‘ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు పాలించడానికి ఎవరిని ఎన్నుకోవాలి.. మీ జీవితాలు ఎలా బాగుచేసుకోవాలి అనే విషయాన్ని మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? మోసం చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోండి..’ అని ప్రియాంక అన్నారు. ‘మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా, లిక్కర్ మాఫియా వస్తుంది. మీకు ఉద్యోగాలు రావు. ప్రశ్నపత్రాలు లీక్ ఆవుతాయి. అవినీతి ఆకాశన్నంటుతుంది. అప్పు పదింతలవుతుంది..’ అని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్, కొడంగల్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు అండగా ఉన్నంత వరకు ఇటు రాష్ట్రంలో కేసీఆర్, అటు దేశంలో మోదీ మెడలు వంచే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా..’ అని అన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), సరిత (గద్వాల) తదితరులు పాల్గొన్నారు. -
మోదీ అంటేనే 'గ్యారంటీలకే గ్యారంటీ'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో పరివర్తన కనిపిస్తోందని, ఇక్కడ మార్పు నిశ్చయమని స్పష్టం చేశారు. ‘‘మోదీ ఏం చెబితే అదే చేస్తారు.. మోదీ మాట అంటే గ్యారంటీలకే గ్యారంటీ.. గ్యారంటీ అంటేనే మోదీ.. చెప్పినవి కచ్చితంగా చేస్తారు. చేసే పనులనే చెబుతారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని చెప్పారు. తాము గెలిస్తే బీసీనే సీఎం అవుతారని, అన్ని వర్గాల వారి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ గానీ వస్తే.. వారికి తెలంగాణ ఏటీఎం అవుతుందని, ఒక రోగాన్ని తగ్గించేందుకు మరొక రోగాన్ని తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్, మహబూబాబాద్‌లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని పక్కనపెట్టి.. ప్రజలకు కన్నీళ్లు, మోసాలు మిగిల్చారు. తెలంగాణకు రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఇప్పుడు తెలంగాణలో ప్రయోగం చేయలేం. పొరపాటు చేయలేం. అందుకే బీజేపీ ప్రభుత్వం చాలా అవసరం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కాం దర్యాప్తు వేగవంతం అవుతుంది. వాళ్లు దోచుకున్న సొమ్ము కక్కిస్తాం. కాళేశ్వరం, లిక్కర్ స్కాం, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నిందితులకు జైలు తప్పదు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని కేసీఆర్ కూడా తెలుసు. అందుకే మోదీ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు. ఆ పార్టీలను ఎప్పుడూ నమ్మొద్దు కుటుంబ పార్టీలను ఎప్పుడూ నమ్మకండి. అవి చట్టాన్ని దుర్వినియోగం చేస్తాయి. కుటుంబవాదంతో ప్రతిభకు అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా.. మీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఏమాత్రం వెనుకాడవు. పీవీ నరసింహారావు వంటి గొప్ప వ్యక్తిని కూడా కాంగ్రెస్ తీవ్రంగా అవమానించింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు జరిగాయి. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్ఐ వంటి దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తుంది. వారి హయాంలోనే నక్సల్స్ హింస చెలరేగింది. బీజేపీ ఉగ్రవాదంపై, వామపక్ష తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే.. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే. రెండు పార్టీలూ తెలంగాణకు అన్యాయం చేశాయి. అవినీతి, కుటుంబ పాలన కొనసాగించాయి. బుజ్జగింపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయి. అవి ప్రజలను మోసం చేసేందుకు ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టవు. కాంగ్రెస్ సభ్యులకు గ్యారంటీ లేదు. వాళ్లు ఎప్పుడైనా బీఆర్ఎస్లో చేరుతారు. కాంగ్రెస్‌కు ఓటేయడం అంటే మళ్లీ కేసీఆర్‌ను గద్దె ఎక్కించడమే. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కోసం మోదీ సర్కారు నిధులు ఇచ్చింది. కానీ కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది. కేసీఆర్ కరీంనగర్‌ను లండన్ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశారు. కానీ బీజేపీ సర్కారు కరీంనగర్‌ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంది. బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్ కలుస్తానంటే తిరస్కరించా.. కేసీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీతో కలుస్తామని అడిగారు. కానీ నేను, మా పార్టీ ఒప్పుకోలేదు. దానిని మనసులో పెట్టుకుని బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు. మేం ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకోసమే బీఆర్ఎస్ను దగ్గరికి రానివ్వలేదు. ఇకముందు కూడా బీఆర్ఎస్ను బీజేపీ దగ్గరకు రానివ్వదు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం దేశంలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. గిరిజనులు, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తుంది. సంచార జాతులకోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశాం. సేవాలాల్ మహరాజ్‌కు గౌరవం వచ్చి జయంతి వేడుకలు నిర్వహించాం. రాంజీ గోండు, కుమురంభీం వంటి నాయకుల స్మారకంగా మ్యూజియం నిర్మిస్తున్నాం. సమ్మక్క–సారక్క జాతరకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇంతకాలం అన్యాయానికి గురైన మాదిగ సమాజానికి ఊరటనిస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తాం..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోతోందని, డిసెంబర్ 3న వారి కరెంట్ కట్ అవుతుందని వ్యాఖ్యానించారు. తెలుగులో మాట్లాడుతూ.. బీజేపీనే వస్తుందంటూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో తరచూ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. కరీంనగర్ సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు. వేములవాడ రాజన్నకు, శాతవాహన, కాకతీయ, మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫాంహౌజ్ సీఎం కేసీఆర్‌కు ప్రజలు ట్రైలర్ చూపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్ ఖతం. యావత్ తెలంగాణ అంతా ఒక్కటే మాట వినిపిస్తోంది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది..’’ అని మోదీ పేర్కొన్నారు. కరీంనగర్‌కు రక్షణ కవచం అవుతా: బండి సంజయ్ కరీంనగర్లో మోదీ ప్రసంగం అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడారు. ‘‘కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్క చాన్స్ ఇస్తే ఐదేళ్లు మీకు సేవ చేసుకుంటా.. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా..’’ అని పేర్కొన్నారు. తాను ఎంపీగా జిల్లాకు తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని.. స్మార్ట్‌సిటీ, గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారులకు కేంద్ర నిధులు మంజూరు చేయించానని తెలిపారు. కరీంనగర్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో భూకబ్జాదారులు ఎవరో, ప్రజల కోసం పోరాడేదెవరో ఆలోచించి ఓటువేయాలని కోరారు. ఒక రోగానికి మందు వేస్తే.. మరో రోగం వచ్చినట్టు.. ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. కాంగ్రెస్ విషయంలో అయోమయంలో ఉన్నారు. ఒక రోగానికి మందు వేద్దామని.. మరో రోగం తెచ్చుకోవద్దు. బీఆర్ఎస్ దుర్మార్గ పాలనకు చెక్‌పెడదామని.. కాంగ్రెస్ అవినీతి పాలన తెచ్చుకోవద్దు. ఇంతకాలం తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు నాశనం చేశారు. వారి పాపపు పాలన ప్రజలకు శాపంగా మారింది. విసిగిపోయిన ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు కొత్త శకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వారు బీఆర్ఎస్ను పరుగెత్తిస్తారు, కాంగ్రెస్‌ను అడ్డుకుంటారు. బీజేపీని ఎన్నుకుంటారు. – ప్రధాని మోదీ -
కాంగ్రెస్‌కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్‌లీక్ తదితర స్కామ్‌ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
హామీలు నెరవేర్చే చరిత్ర కాంగ్రెస్‌దే
మరిపెడ: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చే చరి త్ర కాంగ్రెస్‌ది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం’అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడలో నిర్వహించిన ప్రజా విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రంగులు మార్చే మోసగాడని.. ఈసారి ఆయనకు ఓటు తో బుద్ధిచెప్పాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు నోటిదురు సు వల్లే రైతులకు రైతుబంధు సొమ్ము జమకాకుండా పోయిందని రేవంత్ విమర్శించారు. వచ్చే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏటా 12 వేలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్... ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని... 2004లోనే వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారని రేవంత్ గుర్తుచేశారు. ఆ రోజుల్లోనే ఉచిత విద్యుత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవ్వదని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులకే కాకుండా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇల్లెందులో రోడ్ షోకు రేవంత్ దూరం ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం జరిగే రోడ్ షోలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి రేవంత్ పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పాల్గొనలేకపోయారు. హైదరాబాద్ నుంచి రేవంత్, ఖమ్మం నుంచి పొంగులేటి వేర్వేరు హెలికాప్టర్లలో ఇల్లెందు వరకు చేరుకున్నారు. తొలుత పొంగులేటి హెలికాప్టర్ ల్యాండ్ అవగా ఆ తర్వాత రేవంత్ హెలికాప్టర్‌కు సిగ్నల్ లభించక పోవడంతో పొంగులేటి ఒక్కరే ప్రసంగించారు. -
కాంగ్రెస్ ‘బాండ్ పేపర్లు’
సాక్షి, హైదరాబాద్, బోనకల్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరుగ్యారంటీలను తప్పకుండా అమ లు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. సీఎల్పి నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కతో సహా పలువురు నేతలు ఈ మేరకు ప్రజలు బాండు పేపర్లు రాసిస్తున్నారు. అఫిడవిట్లపై సంతకాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బోనకల్ మండలంలోని చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ బాండ్ పేపర్‌పై భట్టి సంతకం చేశారు. దైవసన్నిధిలో సంతకం చేసిన ఈ బాండ్‌పేపర్‌లో ఉన్న అంశాలను బయటకు చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాండ్ పేపర్లో పేర్కొన్న అన్ని అంశాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా పొట్లపల్లి రాజరాజేశ్వర ఆలయంలో దైవసాక్షిగా అఫిడవిట్‌పై సంతకం చేసి ప్రమాణం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి కూడా ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ బాండ్ పేపర్లు రాసిచ్చారు. వీరితో పాటు చిట్టెం పరిణికారెడ్డి (నారాయణపేట), ఏనుగు రవీందర్‌రెడ్డి (బాన్సువాడ), ఆగం చంద్రశేఖర్ (జహీరాబాద్), గడ్డం వినోద్ (బెల్లంపల్లి), ఈర్ల శంకర్ (షాద్‌నగర్), వేముల వీరేశం (నకిరేకల్), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర) తదితరులు దైవ సన్నిధానాల్లో, ప్రజల మధ్యన ఈ బాండ్‌పేపర్లపై సంతకాలు చేశారు. -
గెలిపిస్తే ‘నిజాం షుగర్స్’ తెరిపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్‌లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే... గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు. -
అవి ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలుగా మారిన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై పోరాడేది తామేనని, తెలంగాణ ప్రజలు, భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీని గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీజేపీ గెలవకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం పార్టీ నాయకులు డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సోలంకి శ్రీనివాస్, సునీతారెడ్డి, అమర్నాథ్, జి, వెంకటరెడ్డి, మౌనికతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు ఎలా అనేది కోటి డాలర్ల ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ గ్యారంటీల అమలుకు తెలంగాణకు ఇప్పుడొస్తున్న రెవెన్యూకు మూడింతలు డబ్బు అవసరమని లెక్క వేశారు. ఇక్కడ ఎన్నికలకు కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఎలా ఇస్తారు ? తెలంగాణలో ఏ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఎన్నికల కోసం కర్ణాటకలోని కాంట్రాక్టర్లు, ఐటీసంస్థలు, వ్యాపారులను బెదిరించి వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 50 శాతం మందికి కేసీఆర్, మరో 50 శాతం మందికి కర్ణాటక సర్కార్ ఖర్చు చేస్తోందని నిందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల దోస్తీ, కాంగ్రెస్ కేంద్ర కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేయడం, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు వంటి అంశాలపై రాహుల్‌గాంధీ చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్... ‘ఎన్నికల నేపథ్యంలో...కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్...రాహుల్‌గాంధీ అంత చేతగాని రాజకీయనాయకుడు మరొకరు లేడు’అని కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేతకాదంటూ వదులుకున్న వ్యక్తి రాహుల్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్యకళాశాలల ఏర్పాటు కోసం కేసీఆర్ రాసినట్టు చెబుతున్న 50 లేఖలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు.. ‘రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి బీఆర్ఎస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఫిర్యాదు చేయించడం ద్వారా బీఆర్ఎస్కు ఇది ఇవ్వడం ఇష్టం లేదని తేలిందన్నారు. హైదరాబాద్ పేరు మారుస్తాం... బీజేపీ అధికారానికి వస్తే హైదరాబాద్ పేరును కచ్చితంగా భాగ్యనగర్‌గా మార్చేస్తామని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ‘ఎవరైనా బీజే పీ, బీఆర్ఎస్ ఒక్కటంటే.. లాగి చెప్పుదెబ్బ కొట్టండి...ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదు’అని తీవ్రంగా స్పందించారు. -
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీయే
సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు.. కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్చేసిందని, కాంగ్రెస్అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు. అవి చిత్తు కాగితాలు.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.