breaking news
-
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని కార్యక్రమాలను నిలిపివేయాలని కోరింది. దీంతో, ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో జరుపుతున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భవన్ లోపలే జరుపుకోవాలని అధికారులు సూచించారు. దీంతో, కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 29వ తేదీన కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు. అందుకే ఈరోజున దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్లో కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచించింది. ఈ క్రమంలో ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. ఇక, కమిషన్ సూచనల మేరకు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. దీక్ష దివస్ సందర్భంగా కేటీఆర్ రక్తదానం చేశారు. #DeekshaDiwas చరిత్రను మలుపుతిప్పిన దీక్ష..! తల్లి తెలంగాణ సంకెళ్లను తెంచిన సత్యాగ్రహం... స్వరాష్ట్ర సమరంలో సముజ్వల సన్నివేశం... స్వాతంత్ర్య పోరాటాన్నిమించిన సమున్నత సందర్భం... యావత్ జాతి ఏకమై ఉద్యమ కడలి ఉవ్వెత్తున ఎగసిన దృశ్యం... చావునోట్లో తలబెట్టి గెలిచిన సాహసం... ఢిల్లీ… pic.twitter.com/fhrD5eTzUr — KTR (@KTRBRS) November 29, 2023 -
కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించండి: కౌశిక్ రెడ్డి భార్య
ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేసిండు. ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా పని చేసి కూడా సొంత మండలం, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఉపఎన్నికల్లో గెలిచి ఒక్కసారి మండలానికి రాలేదని, మంత్రిగా ఉండి మహిళా సంఘం భవనం కట్టించలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోవద్దన్నారు. ‘మీ దయ, దండం పెట్టి, గదవ పట్టుకొని, మీ కడుపులో తలపెట్టి మరీ అడుగుతున్న నన్ను గెలిపించండి.. చేసిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తా’నని అన్నారు. వేరేవారు గెలిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది, తనను గెలిపిస్తే కమలాపూర్‌ను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మీ ఆడబిడ్డగా కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించాలని కౌశిక్‌రెడ్డి భార్య షాలిని కోరారు. మా డాడీని భారీ మెజార్టీతో గెలిపించాలని కూతురు శ్రీనిక ఓటర్లను వేడుకున్నారు. అనంతరం కార్యకర్తలు, మహిళలతో కలిసి కౌశిక్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. కౌశిక్‌రెడ్డికి మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ రాణిశ్రీకాంత్, జెడ్పీటీసీ కల్యాణిలక్ష్మణ్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, వైస్ ఎంపీపీ శైలజఅశోక్, సర్పంచ్ విజయతిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, రాధికారమే‹శ్, నాయకులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి ఇల్లందకుంట మండలంబూజునూర్ గ్రామంలో ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేశ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పాడి కౌశిక్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఎంపీటీసీ విజయ–కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు విక్రమ్, మాజీ ఎంపీటీసీ రామ్ స్వరణ్‌రెడ్డి, నాయకులు,తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి, బేతిగల్, కనపర్తి, ఘన్ముక్కుల గ్రామాలలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు ప్రచారం జమ్మికుంట పట్టణంలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ ఆర్యవైశ్యుల సంఘం అ«ధ్యక్షుడు ఐత మహేశ్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ఒక్కసారి పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి షాక్.. ఈసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రేపు(గురువారం) పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. మంగళవారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక. ఓట్ల అభ్యర్థులు తీవ్ర ప్రయత్నలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. కౌశిక్‌రెడ్డి తన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక, నిన్న హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
నా బలం, బలగం ‘సాగర్’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్
‘సాగర్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాక్షితో మాట్లాడారు. నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్‌లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా.. 2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం. నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది. -
హ్యాట్రిక్ వాకిట్లో కేసీఆర్..?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి ఒక ముఖ్యమంత్రి హ్యాట్రిక్ సాధించడం ఒక అరుదైన రికార్డు. దక్షిణ భారతదేశంలో గతంలో ఒక్క ఎంజీఆర్ మాత్రమే వరుసగా మూడు ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి నడిపించారు. అయితే ఆయన పదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. 1977లో ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రభుత్వాన్ని 1980లో గవర్నర్ బర్తరఫ్ చేశారు. గవర్నర్ పాలన అనంతరం 1980 ఎన్నికల్లో ఆయన పార్టీ మళ్లీ విజయం సాధించింది. 1984లో ఆయన మరోసారి గెలిచారు. 1987లోనే ఆయన చనిపోయారు. శిఖరప్రాయులైన తమిళ నాయకుడు సి. రాజగోపాలాచారి రెండేళ్లు, కామరాజ్ నాడార్ తొమ్మిదేళ్లు, అన్నాదొరై రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కరుణానిధి సుదీర్ఘకాలం 17 సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పటికీ ఆయన నాయకత్వంలో వరుసగా రెండుసార్లు పార్టీ విజయం సాధించలేదు. కర్ణాటకలో దిగ్గజ నాయకులైన నిజలింగప్ప, వీరేంద్రపాటిల్, దేవరాజ్ అర్స్, రామకృష్ణ హెగ్డేలకు ఎవరికీ ఈ ఘనత దక్కలేదు. కేరళలో ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఘనత ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌కే దక్కింది. ఈకే నయనార్, కరుణాకరన్‌లు పదేళ్లు అధికారంలో ఉన్నా వరుసగా లేరు. వివిధ సందర్భాల్లో మూడు విడతలుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కోసం నాటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవిని త్యాగం చేశారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ పుట్టేవరకూ రాష్ట్రం కాంగ్రెస్ ఏలుబడిలోనే ఉన్నది. సంజీవరెడ్డి దగ్గర్నుంచీ విజయభాస్కరరెడ్డి దాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల కాలం పని చేయలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ల కాలం పని చేసినా ఒక ఎన్నిక దగ్గర్నుంచి మళ్లీ ఎన్నికల వరకు ఆయన పదవిలో లేరు. ఎన్టీఆర్ కూడా అంతే. వరుసగా ఐదేళ్లు లేరు. 1989లో ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో తొలిసారి వాజ్‌పేయి అండతో గెలిచారు. ఆ తర్వాత ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత మాత్రమే ఆయన ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ, ఆ తదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక్క వైఎస్.రాజశేఖరరెడ్డికి మాత్రమే రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఎన్నికల నుంచి ఎన్నికల దాకా ఐదేళ్లు పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఘనత దక్కింది. దురదృష్టవశాత్తు ఆయన కొద్ది రోజులకే చనిపోయారు. లేకపోతే పదేళ్ల కిందనే తెలుగునాట హ్యాట్రిక్ అంచనాలు వెలువడేవి. ఇన్నాళ్లకు కేసీఆర్‌కు అటువంటి అవకాశం ఎదురైంది. హ్యాట్రిక్ కొట్టగలమనే నమ్మకాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణంగా పదేళ్ల తమ పరిపాలనా ఘనతలను వారు ఏకరువు పెడుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ అభివృద్ధి కారణంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించిన వైనాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నది. 24 గంటల వ్యవసాయ విద్యుత్, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల గణాంకాలను ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించింది. నీటిపారుదల సౌకర్యం, వైద్య కళాశాలల ఏర్పాటులో రికార్డు సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా ప్రముఖంగా ప్రకటనలిస్తున్నది. -
సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది?
జనం ఆసక్తిని ఆసరాగా చేసుకుని..: స్వతహాగానే ఎన్నికల సర్వేలంటే జనంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నందున, ఈ రెండు పార్టీల్లో దేని ఆధిపత్యం ఎంతన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనలు లేకుండా, ఇంట్లో కూర్చుని తోచిన అంకెలు వేసుకుంటూ సర్వేల పేరుతో బోగస్ సంస్థలు ఫలితాలను సోషల్ మీడియాలో ఉంచుతున్నాయి. ఇళ్లలో కూర్చుని అంకెల గారడీ చేసే క్రమంలో ఎన్నో పొరపాట్లు నమోదవుతున్నాయి. పోటీలో లేని పార్టీ పేరు, పోటీలో లేని అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తుండటమే వాటి డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక మరికొందరు ఘనులు.. అప్పటికే వెల్లడైన నాలుగైదు సర్వే ఫలితాలను బేరీజు వేసి, అన్నింటిని జోడించి అటూ ఇటూ మార్చి సర్వే ఫలితాలంటూ వివరాలను పోస్ట్ చేస్తున్నారు. సర్వే ఫలితాలను చాలామంది అనుసరించే వీలుండటంతో ఎక్కువ వ్యూస్ కోసం ఈ మాయ చేస్తున్నారు. దీంతో జనం వేటిని విశ్వసించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. సర్వే సంస్థల పేరు ధ్వనించేలా..: ప్రతి ఎన్నికల్లో శాస్త్రీయంగా సర్వే చేస్తూ కొన్ని సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా నెట్వర్క్ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ సేకరించాలి, ఒక ఊరిలో ఎన్ని ఇళ్లను కవర్ చేయాలి, అందులో పురుషులెందరు, మహిళలెందరు, ఎన్ని ఇళ్లకో శాంపిల్ సేకరించాలి.. లాంటి శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుంటారు. వీటిని ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆ సర్వే సంస్థల పేరుకు ముందో, వెనకో మరో పదాన్ని జోడించి కొన్ని బోగస్ సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ -
ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్!
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావ్? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఓటరు నాడి ఎలా ఉంది?’’ ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ వినిపించిన ప్రశ్నలివి. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తారసపడిన వ్యక్తులతో ఆసక్తిగా ప్రశ్నలడిగారు. వాటికి వస్తున్న జవాబులతో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ విశ్లేషణ వాతావరణం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వ స్థాయిలో కొత్త కార్యక్రమాలేవీ లేవు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక, లబ్థి చేకూర్చే కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు కాస్త విరామం దొరికినట్టయ్యింది. దీంతో ఆ కార్యాలయాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చోపచర్చలు జరిగాయి. ఉద్యోగులు కాకుండా ఇతరులెవరైనా కార్యాలయానికి వెళ్తే ‘‘ఎవరు గెలుస్తారంటావ్’’ అంటూ ఉద్యోగులు సరదాగా ఆసక్తికర చర్చ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) అధికారం చేపట్టగా... ఇప్పుడు మూడోసారి కూడా గెలుపుపై అదే ధీమా వ్యక్తం చేస్తూ అందరి కంటే ముందుగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటరు నాడిని అంచనా వేస్తూ గత పదేళ్లలో జరిగిన సంక్షేమ పథకాలు, లబి్ధదారులు, ఓటరు నాడి తదితర విశ్లేషణతో గెలుపోటములు ఎలా ఉంటాయో ఊహాజనిత అంచనాలకు దిగారు. స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్న చర్చల్లో కొందరు ఉన్నతాధికారులు సైతం పాలుపంచుకుంటున్నారు. అప్పుడే బెట్టింగ్‌లు? చాలామంది ఉద్యోగులు, అధికారులు వారి సొంత నియోజకవర్గాలు, పనిచేసిన నియోజకవర్గాల్లో స్నేహితులను ఫోన్లలో అడిగి మరీ ఎన్నికల సరళిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరి కొందరు మరో పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ కొందరైతే ఏకంగా బెట్టింగులకు సైతం దిగారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ -
ప్రజలతో మాది పేగు బంధం.. కాంగ్రెస్‌ది చేదు బంధం: ఎమ్మెల్సీ కవిత
‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన క్రమంలో ప్రజల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆదరణ కనిపిస్తోంది. బీఆర్ఎస్కు ప్రజలతో ఉన్నది పేగు బంధం అయితే, కాంగ్రెస్‌తో ఉన్నది చేదు బంధం. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో సృష్టించే అయోమయం, చెప్పే అబద్ధాల నడుమ బీఆర్ఎస్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల్లోనూ 105 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏమీ ఉండదు. కాంగ్రెస్ మాకు చాలా దూరంలో ఉన్నా ఎంతో కొంత పోటీనిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఆలోచన సరళి, అహంకారం, అజ్ఞానం గురించి ప్రజలకు విడమరిచి చెప్తున్నాం’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పదేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్యారంటీల పేరిట కాపీ కొట్టి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటోందని ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శల సంగతేంటి? ప్రజాదరణ ఉన్న కేసీఆర్‌ను అందుకోలేని విపక్ష నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించేలా దిగజారి మాట్లాడుతున్నారు. కష్టపడేతత్వం లోపించిన విపక్షాలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయి. తెలంగాణకు భౌగోళికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న వారు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజల గొంతు వినిపించి రాష్ట్రాన్ని, అనేక రక్షణలు తెచ్చామనే విషయాన్ని గమనించాలి. లక్ష సవాళ్లు, విష ప్రచారాలను ఛేదించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను గతంలో ప్రజలు దీవించారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. మీ కష్టం ఎంత మేర ఫలిస్తుంది? కేసీఆర్ పెద్ద మనసుతో తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నా, అమలు చేసే శక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మాకు ఆత్మబంధువులు. సంపదను సృష్టించి తెలంగాణ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని పెట్టిన పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే 50 ఏళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను దూరదృష్టితో అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ది మాకు రెండు కళ్ల లాంటివి. మళ్లీ అధికారంలోకి వస్తే దిగువ, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. యువత విషయానికి వస్తే ఈ తరం చాలా తెలివైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పోలిస్తే కొత్త తరానికి సమాచారం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందనే విషయంలో కొత్త తరానికి స్పష్టత ఉంది. కేసీఆర్ కమిట్మెంట్ను వీరు గుర్తిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టంపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి? 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా భారత జాగృతి తరఫున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతాం. డిసెంబర్ 3 తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తాం. జాతీయ పార్టీల అగ్రనేతల ప్రచారం మీ పార్టీపై ప్రభావం చూపిందా? విపక్షాలకు పీఎంలు, సీఎంలు ఉంటే తెలంగాణకు కేసీఆర్ ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఫెయిల్ కావడంతోనే కాంగ్రెస్ గెలిచింది. మా సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ నేతలు చెప్పడం లేదు. సీల్డ్ కవర్ సీఎంల చేతిలో రాష్ట్ర భవిష్యత్‌ను పెట్టలేము. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు, పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. వ్యక్తిగత ప్రయోజనం తప్ప, ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయి. కేసీఆర్‌ను గెలిపించడంలో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. రైతుబంధును నిలిపివేయాలనే కాంగ్రెస్ ఫిర్యాదుపై ఏమంటారు? రైతు కష్టాలను తీర్చేందుకు రైతుబంధు అమలు చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ రైతుల నోటి ముందు ముద్దను లాక్కొంటున్నది. వీరికి రైతులు, ప్రజల విషయంలో ఎలాంటి పట్టింపు లేదు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Updates.. ఈసీ సీఈఓ వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ రాజకీయ పార్టీల ఏజెంట్లు సమయానికి చేరుకోవాలి బ్యాలెట్ యూనిట్‌తోపాటు వీవీప్యాట్ ట్రేను పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశాలు రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు 27,094 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 1.48 లక్షల మంది ఉద్యోగులు పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించలేదని హైకోర్టులో పిటిషన్ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించామని కోర్టుకు తెలిపిన ఈసీ అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారని కోర్టుకు తెలిపిన ఈసీ పిటిషన్‌ను ముగించిన హైకోర్టు రేపు సెలవు ఇవ్వడం లేదని ఎలక్షన్ కమిషషన్‌కు వరుస ఫిర్యాదులు పలు MNC సంస్థల నుంచి 1950కి కంప్లైంట్స్ దీక్ష దివస్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ భవన్లో దీక్ష దివస్ కార్యక్రమం మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైమ్‌లో దీక్ష దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ సందీప్ శాండిల్య ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు హైదరాబాద్‌లో 1700 ప్రాంతాల్లో 4915 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు. హైదరాబాద్‌లో 666 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు. అత్యంత సమస్మాత్మమైన 310 ప్రాంతాల్లో అదనపు ఫోర్స్ ఏర్పాటు. సిటీ పోలీసుతో పాటు 40 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరా మానిటరింగ్‌కు స్పెషల్ టీమ్. హైదరాబాద్‌లో 2400 మందిని బైండోవర్ చేశాం. నగరంలో 7 జోన్లలో 1600 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ప్రతీ రౌడీ షీటర్‌పై దృష్టిపెట్టాం. 48 గంటలు పోలీసులు అలర్ట్‌గా ఉండాలి. తెలంగాణభవన్‌కు ఈసీ స్క్వార్డ్ టీమ్ తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్కార్డ్ టీమ్ కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ భవన్లో దీక్ష దివాస్ కార్యక్రమం చేయవద్దన్న ఈసీ టీమ్ సంప్రదింపులు జరుపుతున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్ 200 మీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రం లేదని, ఇది కొత్తగా చేసే కార్యక్రమం కాదన్న బీఆర్ఎస్ లీగల్ టీమ్ వాదన దీక్ష దివస్ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం డీసీపీతో సంప్రదింపులు జరిపిన బీఆర్ఎస్ లీగల్ టీమ్. తెలంగాణ భవన్ లోపల కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించిన డీసీపీ తెలంగాణ భవన్ లోపల కార్యక్రమం యథావిధిగా కొనసాగింపు కాసేపట్లో దీక్ష దివస్‌లో పాల్గొననున్న కేటీఆర్ గంగుల కమలాకర్ సీరియస్ కామెంట్స్ రేపు జరగబోయేది నాకు నాలుగో ఎన్నిక విజయం దిశగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది కరీంనగర్లో నేను మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. బండి సంజయ్ అకృత్యాలకు ప్రజలు విసిగిపోయారు. కరీంనగర్ అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదు. ధర్మం పేరుతో రూపాయి కూడా ఖర్చుచేయలేదు. బండి సంజయ్ మూడోసారి సక్సెస్‌ఫుల్‌గా ఓడిపోతున్నారు. బండి సంజయ్‌కి ఓటు అడిగే హక్కులేదు. నిన్న కొత్తపల్లిలో బండి సంజయ్ గుండాలను వేసుకొని విచ్చల విడిగా డబ్బు పంచారు భాగ్యలక్ష్మి టెంపుల్లో డబ్బులు, మందు పంచలేదని ప్రమాణం చేద్దామా? మేమే డబ్బులు పంచుతున్నామని ఆరోపిస్తున్నారు బండి సంజయ్ డబ్బులు పంచుతున్నాట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది చట్టాన్ని నువ్వు ఎలా చేతుల్లోకి తీసుకుంటావ్?. బండి సంజయ్ డబ్బులు పంచుతుండగా దొరికిండు వంద శాతం బండి సంజయ్ నువ్వు ఓడిపోతున్నావ్ పాడి కౌశిక్‌రెడ్డిపై ఈసీ సీరియస్ హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించిన ఈసీ నిన్న హుజురాబాద్‌లో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి కొనసాగుతున్న ఈవీఎం పంపిణీ.. మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ కాలేజీ డీఆర్సీ సెంటర్లో రిపోర్ట్ చేస్తున్న పోలింగ్ సిబ్బంది.. కొనసాగుతున్న ఈవీఎంల పంపిణీ.. ఏఆర్వో జ్యోతి కామెంట్స్.. మధ్యాహ్నంలోపు అన్ని బూత్‌లకు ఈవీఎంలు పంపిణీ చేస్తాం. సాయంత్రంలోపు అన్ని బూత్‌ల ఎన్నికల అధికారులు బూత్‌లకు చేరుకుని రిపోర్ట్ చేయాలి. ఈసారి పోలింగ్ మెటీరియల్ మిస్ కాకుండా చెక్ లీస్ట్ ఇస్తున్నాం. నాంపల్లిలో 5 మోడల్ పోలింగ్ బూత్‌లు, ఐదు ఉమెన్ పోలింగ్ బూత్‌లు, ఒక యూత్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసాం. డీఆర్సీ సెంటర్ నుంచి ఈవీఎంల పంపిణీ నుండి రేపు పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. నిజామాబాద్‌లో భారీ నగదు స్వాధీనం.. జిల్లాల్లో నాలుగు కోట్ల 60 లక్షల నగదు, కోటి 10 లక్షల బంగారం, ఆభరణాలు.. కోటీ రెండు లక్షల విలువ చేసే బహుమతులు, నాలుగు కోట్ల ఐదు లక్షల విలువ చేసే లిక్కర్ సీజ్.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన ఎనిమిది మందిపై కేసులు నమోదు ప్రతీ నియోజక వర్గంలో ఐదు మహిళ పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కూడా అంతా మహిళలే మొత్తం పోలింగ్ వెబ్ క్యాస్టింగ్.. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు రేపటి పోలింగ్‌కు సర్వం సిద్దం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు చేరుకుంటున్న పోలింగ్ సిబ్బంది అభ్యర్థుల నమూనా పత్రాలు, ఈవీఎం మెషీన్లు, వీవీప్యాట్స్, ఇంక్, ఎన్నికల ఇతరత్రా సామగ్రి సిద్దం చేసుకోనున్న సిబ్బంది కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు సిద్ధం ఎన్నికల వేళ డబ్బు తరలిస్తున్న సీఐ సస్పెండ్ మేడ్చల్‌లోని మేడిపల్లి మండలం చెంగిచర్లలో డబ్బుతో పట్టుపడిన సీఐ అంజిత్ రావ్ కారులో డబ్బుతో వెళ్తుండగా పట్టుకున్న కాంగ్రెస్ నేతలు డబ్బు, కారును సీజ్ చేసిన ఎన్నికల అధికారులు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు సస్పెండ్ భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీంతో పోలీసుల సోదాలు బీజేపీ కార్యకర్తల ఆందోళన.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ.. పలువురు పోలీసులకు , కార్యకర్తలకు గాయాలు, పలు కార్ల అద్దాలు ధ్వంసం.. చెదరగొట్టిన పోలీసులు.. పలువురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం గాంధీభవన్‌లో ఉదయం 10:30 గంటలకు సమావేశం కానున్న సీనియర్లు సమావేశానికి హాజరు కానున్న రేవంత్, మానిక్రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్, మధు యాష్కీ, వీహెచ్, మహేష్ గౌడ్ సహా తదితరులు కరీంనగర్లో అర్ధరాత్రి హైటెన్షన్ కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో ఉద్రిక్తత బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో కొత్తపల్లికి చేరుకున్న బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల్లో డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ శ్రేణులు రెచ్చిపోయిన బీఆర్ఎస్ నేతలు… బీజేపీ నేతలతో ఘర్షణకు దిగిన కార్యకర్తలు ఇంత బాహాటంగా డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం సమాచారం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి రాక బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం ఇరువర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పోలీసుల రంగ ప్రవేశం ఇరువర్గాలను వేర్వేరుగా ఉంచిన పోలీసులు రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు: వికాస్‌రాజ్ మీడియాతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశం ఈనెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షలు కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు కోటి 62 లక్షల 92వేల 418 మంది పురుష ఓటర్లు 2,676 మంది ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 12వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 9 లక్షల 99వేల 667 మంది ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదు సైలెంట్ పీరియడ్ మొదలైంది స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదు రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్ యూనిట్లు అదనంగా మరో 14 వేలు రిజర్వ్‌లో పెట్టిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది 27, 094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సీనియర్ సిటిజన్ ఓటర్లు(80 ఏళ్ల పైబడి)4,40,371 వీరిలో 1,89, 519 మంది పురుషులు, 2,50,840 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు 12 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు 2,933, దివ్యాంగులు 5 లక్షల 6వేల 921 మంది రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల సమస్యాత్మక కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్‌లో 1,800 సమస్యాత్మక కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఐదంచెల భద్రత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్ కేంద్రాలు సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకూ పోలింగ్ ఈసారి కొత్తగా మోడల్, మహిళా పోలింగ్ కేంద్రాలు హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ప్రతి సెగ్మెంట్లో 5 మహిళ, 5 మోడల్, ఒకటి దివ్యాంగుల పోలింగ్ కేంద్రాలు 375 కంపెనీల నుంచి కేంద్ర బలగాలు, 50 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ 144 సెక్షన్ అమలు 30వ తేదీ సాయంత్రం గం. 5.30ని.ల వరకూ మద్యం దుకాణాలు బంద్. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు.. సీఈఓ వికాస్‌రాజ్ శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
ఆఖరి క్షణం దాకా అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగియడంతో వచ్చే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహంపై భారత్ రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభల పేరిట బహిరంగ సభల్లో పాల్గొన్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ సభ అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సమీక్షించిన కేసీఆర్.. పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్, నాయకులు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు ఓటర్లతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో ఓటును ఒడిసి పట్టుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం పెరిగేలా చూసుకోవడంతో పాటు, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రత్యర్థి పారీ్టల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రలోభాలపై ప్రత్యేకంగా కన్నేసి ఉంచాలంటూ పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. చివరి ఓటు పడేంత వరకు పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న బూత్‌ల పరిధిలో అనుకూల ఓట్లు ఖచ్చితంగా పోలయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. 96 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ గత నెల 15 నుంచి ప్రజా ఆశీర్వాద సభల పేరిట ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33 రోజుల వ్యవధిలో ఏకంగా 96 నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో ప్రారంభించిన ప్రచారాన్ని, మంగళవారం గజ్వేల్‌లో ముగించారు. నవంబర్ 9న తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా రెండు నెలల పాటు నిర్విరామ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. రోడ్‌షోలు, బహిరంగ సభలు కలుపుకొని సుమారు వందకు పైగా ప్రాంతాల్లో ప్రసంగించారు. ఓ వైపు పార్టీ విధానాలను వివరించేందుకు వరుసగా మీడియా సమావేశాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూనే బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ నేతలతో వరుస టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. -
ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలిప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలిప్పుడు? అప్పుడు ఏం సక్కదనం వెలగబెట్టారని పదేపదే ఆ పేరు ఉచ్చరిస్తున్నారు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ.. కాలిన కడుపులు, కాల్చి వేతలు, కూల్చివేతలేగా. ఆ కష్టాలు మనకు అవసరమా? ఎన్కౌంటర్లు, రక్తపాతం, తెలంగాణ ఉద్యమ సమయంలో 1969లో 400 మంది కాల్చి వేత.. ఇవన్నీ మరిచిపోలేదు. కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ పాత చరిత్ర తెస్తామంటున్నారు. కానీ మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలి..’ అని సీఎం, బీఆర్ఎస్ అధినేత, పార్టీ గజ్వేల్ అభ్యర్థి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు మంగళవారం గజ్వేల్‌లో, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన భారీ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదు: ‘ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో వందలాది మంది పిల్లలను, ఉద్యమకారులను పొట్టన బెట్టుకున్న ఘన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. 1956లో తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత నా ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడం, 33 రాష్ట్రాలు మద్దతు లేఖలు ఇవ్వడంతో దిగొచి్చన కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు, హక్కులను పరిరక్షించుకునేందుకు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? అప్పటివరకు రాష్ట్రం ఆకలి కడుపుతో ఉన్నందుకేగా? కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయను ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయని కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మీరు సీఎం చేస్తేనే నేను కష్టపడ్డా.. ‘గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తేనే నేను కష్టపడ్డా. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరించే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. ఆకాశం అంత కీర్తి వచ్చింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 30–40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, రాష్ట్రం ఏర్పడ్డాక సాగు నీరు, ఉచిత విద్యుత్ అందించడం వలన 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ధరణి పోర్టల్ రాకముందు రైతు భూమిపై వీఆర్ఓ నుంచి సీసీఎల్ఏ అధికారుల వరకు 10 మందికి అధికారం ఉండేది. ఇప్పుడు రైతు బొటన వేలికి వారి భూమికి సంబంధించిన హక్కులు ఇచ్చాం. ధరణి ఉంది కాబట్టే ఎవరి భూమి వారికి ఉంది. లేకపోతే ఇబ్బంది ఉండేది. గత పాలకుల పరిపాలనను తలదన్నే విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల చేత భేష్ అనిపించుకుంటున్నాం. కాంగ్రెస్ రాజ్యంలో రూ.200 పింఛన్ ఇస్తే, ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేలు ఇవ్వబోతున్నాం. నెహ్రూ, ఇందిరమ్మ కాలంలో దళిత వర్గానికి మేలు చేస్తే ఇంత దరిద్రంలో ఉండేవారు కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దళితబంధును ఏర్పాటు చేశాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 80 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించాం. అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మితో పేదింట్లో ఆర్థిక భారం తగ్గించాం. అన్ని వర్గాలకు పెద్దన్నగా నిలిచాం. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, మతకల్లోలాలు, గొడవలు లేని వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో వరంగల్‌లో అజాంజాహీ మిల్లును మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు అమ్ముకుంటే వేలాది మంది కార్మీకులు రోడ్డున పడ్డారు. వారికి తిరిగి ఉపాధి కల్పించేందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. సరికొత్త చరిత్ర సృష్టిద్దాం ‘నా వయసు ఫిబ్రవరిలో 70 ఏళ్లకు చేరుతుంది. పదవుల కాంక్ష లేదు.. తెలంగాణను సక్కదిద్దాలనే ఉంది. మనసు పెట్టి సంక్షేమం అందిస్తున్న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి మూడవసారి పాలన తెచ్చుకుందాం. సరికొత్త చరిత్రను సృష్టిద్దాం. సమైక్యవాదులతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు వచ్చి ఓటు వేయాలని అడుగుతారు. అభ్యర్థుల గుణగణాలు, గతంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ తీర్పును దేశం గమనిస్తోంది
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి పెంచినట్టే. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. పదో తేదీన రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగుల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ఓడినా, గెలిచినా ఫాంహౌస్‌లోనే పడుకుంటాడని, కామారెడ్డి ప్రజల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకే తాను వచ్చానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూంలు ఎంతమందికి ఇచ్చాడని, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. గజ్వేల్‌ను వదిలి సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉందన్నారు. మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా రద్దు చేసినా, ఎన్నికల తరువాత మళ్లీ తెరపైకి తెచ్చి భూములను లాక్కుంటారని వివరించారు. తెలంగాణ దశ, దిశను మార్చే తీర్పును దేశమంతా గమనిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.పది వేలు ఇచ్చి, రూ.పదివేల కోట్ల విలువైన భూములు లాక్కుంటారని ఆరోపించారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.... పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి వైశ్యులను మోసం చేశాడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రేవంత్ చెప్పారు. గల్ఫ్ కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారికి అండగా ఉంటామని, కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. -
గిగ్ వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహా పథకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహాలో పథకాన్ని వర్తింప జేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సీఎం, మంత్రివర్గస్థాయిలో గిగ్ వర్కర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక భద్రతతో కూడిన నిధిపై చర్చిస్తామని, తగిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం ఉందని, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు సాయం, సింగిల్ పర్మిట్ పాలసీ, పెండింగ్ చలాన్ 50 శాతం తగ్గింపుతో క్లియరెన్స్ లాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జీహెచ్ఎంసీ పారిశు ధ్య కార్మికులు, గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్ ఆటో, క్యాబ్ డ్రైవర్లు)తో ఆయన ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికుల సమస్య లు, దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా కార్మికులు తమ కష్టాలు ఆయనకు వివరించారు. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పనిచేసి సంపాదించినదంతా డీజిల్, పెట్రోల్‌కే సరిపోతోందని వాపోయారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ పాల్గొన్నారు. -
నేను రాలేకపోతున్నా... మీరు మార్పు తీసుకురండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలనుద్దేశించి మంగళవారం ఓ వీడియో సందేశం పంపారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కానీ మీరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. మీకు ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ అమరవీరుల కలలు నెరవేరడం చూడాలనుకుంటున్నా. మనందరం కలసి దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలి. మీ కలలు సాకా రం కావాలి. ఒక మంచి ప్రభుత్వం రావాలి. సోని యమ్మ అని పిలిచి మీరు నాకు చాలా గౌరవప్రదమైన అమ్మ స్థానం ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలందరికీ నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ కి ఓటేయండి. మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి. జై తెలంగాణ. జైహింద్.’ అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
నన్ను ఓడించేందుకే కుట్రలకు తెరలేపారు: బండి సంజయ్ ధ్వజం
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి/కరీంనగర్ టౌన్: కరీంనగర్లో తన గెలుపు ఖాయమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంచుతూ కుట్రలకు తెరలేపి, దిగజారిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ‘కేసీఆర్.. సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిగ్గు లేదా?’అంటూ ధ్వజమెత్తారు. మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్లో బండి సంజయ్ గెలవబోతున్నాడని, డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లిన బండి సంజయ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్బుల పంపిణీపై తమ కార్యకర్తలు సమాచారం అందించారని చెప్పారు. గంగుల కమలాకర్ కొంతమంది మహిళా గ్రూపులు, మరి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఓటుకు రూ.10 వేలు చొప్పున పంచి పెడుతున్నారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా దాడులకు యత్నించారని అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నా, కొందరు కింది స్థాయి సిబ్బంది గంగులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంజయ్ సహా బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి చేరుకోవడం, బీఆర్ఎస్ నేతలు కొందరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించడం, రెండు వర్గాల నినాదాలతో పట్టణంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ సంజయ్ వారిని నిలదీశారు. -
వారికి అవగాహన లేదు
పాతచింతకాయ పచ్చడిలాగా.. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా.. రాహుల్, ప్రియాంకా గాం«దీలు అవే అసత్యాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్, సోనియా కుటుంబ పార్టీలను ప్రజలు బహిష్కరించాలి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు రాజకీయంగా కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మజ్లిస్.. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ కనీసం వచ్చేముందైనా.. వాస్తవాలు తెలుసుకోవాలి కదా? అని నిలదీశారు. ‘మజ్లిస్‌ను పెంచిపోదించింది మీ కుటుంబం. ముస్లింలీగ్ ను ఈ దేశంలో ఎవరు పెంచి పోషించారు.. ఎవరి కారణంగా దేశ విభజన జరిగింది.. వీటన్నింటికీ మీ కుటుంబమే కారణం కాదా?’అని రాహుల్‌గాందీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో భాగంగా.. చెన్నారెడ్డిని గద్దె దించేందుకు మజ్లిస్‌ను ఎగదోసి భాగ్యనగరంలో మతకల్లోలాలు చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. ‘పాతచింతకాయ పచ్చడిలాగా.. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా.. రాహుల్, ప్రియాంక గాం«దీలు అవే అసత్యాలు మాట్లాడారు. అని ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సునామీలాగా బీజేపీకి ఓటేస్తారు ‘30న సునామీలాగా ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు. 3న బీజేపీ భారీ విజయంతో అధికారంలోకి రానుంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి బీసీ సీఎం ఈ గడ్డపై బాధ్యతలు తీసుకోబోతున్నారు’అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాయలో పడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంబ, సోనియా గాంధీ కుటుంబ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ’’తెలంగాణ భద్రంగా ఉండాలంటే.. మా కుటుంబమే అధికారంలో ఉండాలన్న కేటీఆర్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. వీరి కబంధ హస్తాలనుంచి రాష్ట్రం బయటపడాలి. అమరవీరుల ఆకాంక్షలు రావాలంటే.. బీఆర్ఎస్ పోవాలి. వీళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలి’అని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం,, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజల ఓటేయాలని, ప్రధాని మోదీ కోరినట్లుగా రాష్ట్రంలో బీజేపీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. మేధావులూ ఆలోచించండి: ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది. ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుంది. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ పార్టీలకు సరైన గుణపాఠం చెబుతూ.. బీజేపీకి అండగా నిలవాలని కోరుతున్నాను. మోదీ గ్యారంటీతో తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ ఏర్పాటుకోసం మేం పనిచేస్తాం’అని స్పష్టం చేశారు. బీసీలూ ఆ అవకాశం చేజార్చుకోకండి ‘బీసీ సామాజిక వర్గానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటేసేముందు ప్రతి బీసీ బిడ్డ.. గుండెమీద చేయివేసుకుని ఆలోచించాలని కోరుతున్నాను. ఈ రోజు బీసీ సీఎం తెలంగాణకు అవసరం. కాబట్టి మీరంతా ఆలోచించండి. మీకు వివిధ రకాల పార్టీలతో సాన్నిహిత్యం ఉండొచ్చు. కానీ బీసీ సీఎం అయ్యే మంచి అవకాశాన్ని చేజార్చుకోకండని విజ్ఞప్తి చేస్తున్నాను’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగొద్దు.. ప్లీజ్ ♦ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్లుకలిసి తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయి... ♦ ఆ మూడు పార్టీలకు బుద్ధి చెబుదాం ♦ బీజేపీకి మద్దతిచ్చి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. ♦ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగలేఖ సాక్షి, హైదరాబాద్: ‘ఇక పోలింగ్‌కు మిగిలింది ఒక్క రోజే.. మద్యం, డబ్బు ద్వారా ప్రలోభాలకు గురిచేసేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. దయచేసి ఆ ఒత్తిళ్లకు లొంగకండి’అని తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నాను’అని విన్నవించారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ’’ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? దీనిపై ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. అసలు ఈ పదేళ్లలో రాష్ట్రంలో సంతృప్తి చెందిన వర్గం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉందా? అనిప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ‘మో దీ ఆశీర్వాదంతో బీసీ సీఎం నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. అమరవీరులు కలలుగన్న సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. ఇది మోదీ గ్యారంటీ! ఇది బీజేపీ గ్యారంటీ’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ మూడూ ముంచేస్తాయి: ’’మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయి. అయితే ను వ్వు, లేదంటే నేను.. మనిద్దరిలో ఎవరైనా ఒకరు అధికారంలో ఉండాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీల చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఇదే. 2014, 2018లో కాంగ్రెస్ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయకుండానే.. బీఆర్ఎస్లో చేరడం, మంత్రిపదవులు పొందడం మనందరికీ గుర్తుండే ఉంటుంది.’’అని పే ర్కొన్నారు. ‘నియామకాల విషయంలో.. ప్రభు త్వం అనుసరించిన విధానం తీవ్ర ఆక్షేపణీయం. ఉద్యమంలో యువత లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌ను లెక్కచేయకుండా పోరాడితే.. రాష్ట్రం వచ్చాక యువతకు ఒరిగిందేమీ లేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమైన నిరుద్యోగ యువత.. ఇవాళ ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితికి చేరుకోవడానికి కారణం కేసీఆర్ అసమర్థ పాలన కాదా? టీఎస్పీఎస్సీ పరిస్థితి ‘మూడు లీకేజీలు, ఆరు రద్దులుగా’మారింది. రాష్ట్రంలోని 39 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కశాతానికైనా ఉద్యోగాలు అందాయా? రూ.3,106 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఎందరికి అందింది?’అని ప్రశ్నించారు. ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్ అందరికీ లోకలే.. రేవంత్ నాన్‌లోకల్
సాక్షి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మూలాలు ఇక్కడే (కామారెడ్డి) ఉన్నాయి. అయినా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అందరికీ లోకలే. కానీ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి వచ్చారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పక్క నియోజకవర్గం నుంచి వచ్చారు. అడ్డమైనోళ్లకు, చిటికెడంత లేనోడికి, సన్నాసులకు ఓటేస్తే బతుకులు ఖరాబైతయి’అని మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొనడంతోపాటు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో జాతీయ మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఓ చెత్త పార్టీ...: తెలంగాణలో మార్పు కావాలంటున్న కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, అదో చెత్త పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. మంచిగా కారు (రాష్ట్రాన్ని) నడుపుతున్న డ్రైవర్ (కేసీఆర్)ను కాదని కాంగ్రెసోళ్లను నమ్మితే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని పేర్కొన్నారు. సిలిండర్ ధరను మోదీ రూ. 1,200కు పెంచిండు.. ‘నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాన మంత్రి కాదు.. పిరమైన ప్రధాన మంత్రి. గ్యాస్ ధరను రూ. 400 నుంచి రూ. 1,200కు పెంచిండు. మోదీ పాలనలో పెట్రోల్, ఉప్పు, పప్పు,నూనె ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే గ్యాస్ సిలింండర్ రూ. 400కే ఇవ్వబోతుండు’అని కేటీఆర్ తెలిపారు. బీడు భూములకు సాగునీటి కోసమే కేసీఆర్ తపన.. కామారెడ్డిలో రైతుల భూములను గుంజుకుంటారని కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లర ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ‘కామారెడ్డిలో ఏమైనా లంకె బిందెలు ఉన్నయా ’అని ప్రశ్నించారు. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారని, కామారెడ్డి ప్రాంతంలో బీడువారిన భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనేది కేసీఆర్ తపన అని కేటీఆర్ పేర్కొన్నారు. 90 శాతం పనులు చేశాం.. ‘సాధించాల్సిది ఇంకా ఉంది. అంతా అయిపోయిందని చెప్పట్లేదన్నారు. పొరపాట్లు జరగలేదని అనట్లేదు.. వాటిని సరిదిద్దుకుంటాం. వచ్చేసారి అన్నీ పూర్తి చేసుకుంటాం. నూటికి 90 శాతం పనులు చేశాం.. మరో 10 శాతం పనులు కూడా చేస్తాం. మాకంటే మెరుగైన వాళ్లు, మంచిగా పనిచేసేవాళ్లు ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి’అని కేటీఆర్ కోరారు. కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం... దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎంగా కేసీఆర్ అరుదైన ఘనత సాధించబోతున్నారని, పూర్తి విశ్వాసంతో ఈ మాట చెబుతున్నానని.. ఈ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. ‘కేసీఆర్ గెలుసుడు పక్కానే. భారీ మెజారిటీతో గెలవాలంటే దమ్ము జూపాలె.. దుమ్ములేపాలె’అని ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మతం పేరుతో బీజేపీ, కులం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం తిండిపెట్టవన్న విషయాన్ని గుర్తించి మానవత్వం ఉన్న కేసీఆర్‌కు ఓటేయాలని కోరారు. మహిళల కోసం కేసీఆర్ పడుతున్న తపనను గుర్తించి మహిళలు ఏకపక్షంగా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే మాయామశ్చీంద్రగాళ్లను, ఫేక్ న్యూస్‌లు, ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టివ్వడమే తమ లక్ష్యమని, సంపూర్ణ అక్షరాస్యతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామన్నారు. -
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైబై చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేపర్ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని, ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. ప్రధానికి రెండు విమానాలు ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు. రాహుల్‌పైనే ఒవైసీ విమర్శలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్‌గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్ ఎన్.గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్‌కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్‌కు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్మెంట్పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్‌లకుగాను 90 శాతం బూత్‌లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా... రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
డబ్బులిస్తే తీసుకోండి.. సమర్థులకే ఓటేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం అభ్యర్థులెవరైనా డబ్బులిస్తే తీసుకుని ఓటును మాత్రం సమర్థులకే వేయాలని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరమ్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’వాల్‌పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ మంగళవారం ఆవిష్కరించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ...ప్రజలను మేలుకొల్పడంలో పొలిటికల్ కార్టూన్స్ చాలా ప్రభావం చూపిస్తాయన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం తదితర అవసరాలను మెరుగుపరిచే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. తానెప్పుడూ పొలిటికల్ మేనిఫెస్టో చూడనని, దానిని రూపొందించడం, అమలు చేయడం తెలిస్తే తానే ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయే వాడినని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’లో భాగమైన కార్టూనిస్ట్‌లను ఆర్జీవీ అభినందించారు. వ్యంగ్య చిత్రాలను గీసే వారు ఇంత సీరియస్‌గా ఉంటారని కార్టూనిస్టులను చూశాకే తెలిసిందని చమత్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టులు శంకర్ (సాక్షి), సుభాని, మృత్యుంజయ, నర్సిం, అక్బర్, వెంకటేశ్ కతుల, రాకేశ్, పి.ఎస్.చారీ, సురేందర్ సముద్రాల, జె.వెంకటేశ్, నివాస్ చొల్లేటి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి తదితర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధు ఆగడానికి కేసీఆరే కారణం: భట్టి
మధిర: సీఎం కేసీఆర్ కావాలనే రైతులకు రైతుబంధు నిధులు జమ కాకుండా చేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకునేందుకు కుట్ర చేశారని, రైతులపై శ్రద్ధ ఉంటే వైన్స్ టెండర్ల మాదిరిగా రైతుబంధు కూడా ముందే ఇచ్చేవారని చెప్పారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టులతోనే నిత్యం విద్యుత్ ఇవ్వగలుగుతున్నారని, కేసీఆర్ రాకముందే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత తమ పా ర్టీదని భట్టి తెలిపారు. రైతుల రుణమాఫీ, పంటలకు నష్టపరిహారం, సబ్సిడీలపై ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై విద్యుత్ మోటార్లు తాము ఇవ్వగా, కేసీఆర్ వాటన్నిటినీ నిలిపేశారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమీలేదని ఆరోపించారు. ఈ నెల 30 తర్వాత బీఆర్ఎస్ రాష్ట్రంలో కనిపించదని, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మధిర ఎమ్మెల్యేగా తాను ప్రముఖ పాత్ర పోషిస్తానని భట్టి తెలిపారు. -
అధికారంలోకి రాగానే...ఆరు గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి (హైదరాబాద్): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై మంత్రివర్గం సంతకాలు చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కారే ఏర్పడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజా సర్కార్ కోసం బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. దేశంలో మత విద్వేషాలు లేకుండా చేసేందుకు ఢిల్లీలో నరేంద్ర మోదీని గద్దె దింపాలంటే, ముందుగా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. మోదీ విద్వేషాలతో కూడిన భారతదేశాన్ని తయారు చేశారని, తాము ప్రేమతో కూడిన దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రేమను పంచాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర చేశానని, ఈ సందర్భంగా ప్రజల కష్టాలను నేరుగా చూశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం.. హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని బజార్‌ఘాట్ చౌరస్తాలో, మల్కాజిగిరి ఇందిరా చౌక్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో రాహుల్ మాట్లాడారు. మోదీతో రాజీపడే ప్రసక్తే లేదు ‘కాంగ్రెస్ పోరాటం కేవలం కాషాయం విద్వేషాలపైనే. మోదీతో రాజీ పడే ప్రసక్తే లేదు. బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం బీ టీం కాకుంటే అవినీతిపరుడైన కేసీఆర్‌తో పాటు ఒవైసీపై ఒక్క కేసు, ఈడీ దాడులు ఎందుకు లేవు? మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. ఉత్తరాది, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మజ్లిస్ పారీ్టకి కనీసం ఉనికి, ఒక్క ఓటు లేకున్నా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల బరిలో దిగుతుంది. మజ్లిస్ ఎక్కడ పోటీ చేయాలో కూడా బీజేïపీ నిర్ణయిస్తోంది. కేవలం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే మజ్లిస్ ఉద్దేశం. ఈ మూడూ ఒకటే టీమ్. కలిసే పనిచేస్తాయి..’ అని రాహుల్ ధ్వజమెత్తారు. నేను, ప్రియాంక సైనికుల్లా ఉంటాం ‘అధికారంలోకి వస్తే తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్నదంతా తిరిగి ప్రజల జేబులో వేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. విద్యార్థులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున ఢిల్లీలో పోరాడడానికి తాను, సోదరి ప్రియాంక సైనికుల్లా ఉంటామని రాహుల్ చెప్పారు. అసలు ప్రభుత్వాన్ని చూపిస్తాం: ప్రియాంక పది సంవత్సరాల తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ ఇల్లు ఇచ్చారా? అని ప్రజలను ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. పదేళ్లూ ఫాంహౌస్ పాలన కొనసాగిందని, ఆయన కుటుంబంలోని వారికి మంత్రి పదవులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే అసలు ప్రభుత్వాన్ని చూపిస్తామని అన్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో బోనాలతో మహిళలు, కల్లు గీసే పనిముట్లతో గీత కారి్మకులు, వలలు పట్టుకుని గంగపుత్రులు పాల్గొన్నారు. మూడు రంగుల జెండా పాటకు రాహుల్, ప్రియాంక, రేవంత్, హన్మంతరావు ఉత్సాహంగా నృత్యం చేశారు. కాగా జూబ్లీహిల్స్ యూసుఫ్‌గూడలో కార్యక్రమానంతరం అక్కడి నుంచి నాంపల్లి కార్నర్ మీటింగ్‌కు రాహుల్ ఆటోలో వచ్చారు. రాహుల్ తన ఆటోలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోనంటూ ఆటో డ్రైవర్ ఆశోక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నాంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధులు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చేతికి వెళ్తే కుక్కలు చింపిన విస్తరే
సిద్దిపేట జోన్, మద్దూరు: ‘కొంతమంది దొంగలు, తెలంగాణ ద్రోహులు ఓటు కోసం బయల్దేరారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాటం, రాజీనామాలు, దీక్షలు చేసిండ్రా? అన్నీ చేసింది కేసీఆర్. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కానీ ఇప్పుడు కుర్చీ మీద కూసోవడానికి వస్తుండ్రు. తప్పిపోయి రాష్ట్రం కాంగ్రెస్ చేతికి పోతే కుక్కలు చింపిన విస్తరే’ అని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పారీ్టకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు. వాళ్లు ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరని, ఎన్నికలున్నా లేకున్నా ఐదేళ్లు తాను ప్రజల మధ్య ఉంటానని హరీశ్ హామీ ఇచ్చారు. కొందరు సిద్దిపేట అభివృద్ధి మీద విమర్శలు చేశారని, ఇక్కడి ప్రగతిని చూసి ఓర్వలేని వారికి, అభివృద్ధిని విమర్శించిన వారికి ఓటు రూపంలో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతిసారీ తన మెజార్టీ పెంచుతూ ఎంతో ప్రేమను అందించిన సిద్దిపేటకు తన జీవితం అంకితమని హరీశ్ వ్యాఖ్యానించారు. యూపీలో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా? ’’ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్గా వ్యవహరించిన ప్రియాంకాగాంధీ 6 నెలలు రాష్ట్రం మొత్తం పర్యటిస్తే అక్కడ కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు 2 అని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా’’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో 2.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 180 రోజులు గడిచినా ఒక్క నోటిఫికేషన్ వేయలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుంది అంటున్నారు.. రైతులు ఆలోచించాలి.. రేవంత్‌రెడ్డి ఇవాళ టికెట్లు అమ్ముకున్నాడు. అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని ఆరోపించారు. సోనియాగాందీని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో దేవత అంటున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అతన్ని ప్రజలు నమ్మడం లేదని, పోటీ చేస్తున్న రెండు చోట్లా ఓడిపోతున్నాడని హరీశ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ది బలుపు కాదు.. వాపు గెలిచి నిలిచేది బీఆర్ఎస్సే: ‘ఎక్స్‘లో హరీశ్ రావు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ది బలుపు కాదు వాపు అని ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు రుజువు చేశాయని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎన్నికల ప్రచారానికి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కే బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. ఈ నెల 30 న జరిగే పోలింగ్‌లో కేసీఆర్ పై తెలంగాణ ఏక పక్షంగా తన అభిమానాన్ని చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడో సారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని హరీశ్ తెలిపారు. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు.