breaking news
-
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, రాజాసింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు. -
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌తోపాటు వీరికి ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక, కాంగ్రెస్ నేతలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. వీరికి ఆహ్వానం పంపనున్నారు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు. -
తెలంగాణ సీఎం ప్రమాణస్వీకార ఏర్పాట్లు .. అప్డేట్స్
Live Updates.. రేవంత్ సీఎం.. ఆర్ట్స్ కాలేజ్ వద్ద సంబరాలు ముఖ్యమంత్రిగా గురువారం సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సంబురాలు ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్, బాణసంచా కాల్చి సంబరాలు మీ అందరి ఆశీస్సులతో ప్రమాణం చేయబోతున్నా: రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ తెలంగాణ ప్రజలకు ఆహ్వానం సీఎల్పీ నేత ఎనుముల రేవంత్‌రెడ్డి పేరిట ప్రకటన విడుదల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం తెలంగాణ ప్రజలకు అభినందనలు విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడింది తెలంగాణ మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం హైదరాబాద్‌కు టీ కాంగ్ సీనియర్లు తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన పలువురు సీనియర్ నేతలు సీఎం పదవి కోసం చివరిదాకా కొనసాగిన ఆశావహుల ప్రయత్నాలు తామూ రేసులో ఉన్నామంటూనే.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటనలు ఏఐసీసీ పెద్దలను కలిసి తమ పేర్లను పరిశీలించాలని విన్నపాలు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో రేవంత్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు మంత్రి వర్గ కూర్పుపై నిన్న రాత్రి, ఇవాళ రేవంత్ కసరత్తులు రేపే ప్రమాణం కావడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనం రేవంత్ వెంట మాణిక్‌రావ్ ఠాక్రే కూడా హైదరాబాద్‌కే రేవంత్ బయల్దేరిన కాసేపటికే నగరానికి సీనియర్లు కూడా హైదరాబాద్ బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్బీ స్టేడియం వద్ద భారీగా ఏర్పాట్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేదికగా ఎల్బీ స్టేడియం స్టేడియంలో భారీ ఏర్పాట్లు మొత్తం మూడు వేదికలు ప్రధాన వేదికపైనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం వేదిక ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కు ఘన స్వాగతం అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు స్డేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు ఇబ్బందుల్లేకుండా చర్యలు.. స్టేడియం వద్ద సీఎస్ సమీక్ష ఎల్బీ స్టేడియంలో రేపు జరిగే సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ శాంతకుమారి సాయంత్రం సీఎస్ వెంట డీజీపీ రవిగుప్తా కూడా ఉదయం సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్, డీజీపీ సాయంత్రం మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇద్దరు వచ్చే అతిథులు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం ఠాక్రేతో ముగిసిన రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేముందు ఏఐసీసీ నుంచి రేవంత్‌కు పిలుపు హుటాహుటిన వెనక్కి వెళ్లిన రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ ఏఐసీసీ కార్యాలయంలోని మహారాష్ట్ర సదన్‌లో గంటపాటు చర్చ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్ రేవంత్‌తో పాటు హైదరాబాద్‌కు ఠాక్రే? రేపు రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్న పలువురు రేపు తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్ Telangana CM designate Revanth Reddy meets Congress Telangana in charge, Manikrao Thakare at Maharashtra Sadan, in Delhi. pic.twitter.com/RJODkAaGAE — ANI (@ANI) December 6, 2023 తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4. గడ్డం వివేక్ ( మాల) 5.సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( పద్మశాలి) 8. ఉత్తమ్ కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబీసీ) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ ప్రజలంతా ఎల్బీ స్టేడియంలోప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చింది మాణిక్‌రావు ఠాక్రేతో రేవంత్‌రెడ్డి భేటీ మహారాష్ట్ర సదన్‌లో సమావేశం రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చర్చ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ గత రాత్రి సీఎం ప్రకటన తర్వాత హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి డీకే శివకుమార్ నిన్న అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు రేవంత్ చర్చలు ఈ ఉదయం నుంచి వరుసగా కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తూ వచ్చిన రేవంత్ రేపటి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందజేత మంత్రి వర్గ కూర్పుపైనా చర్చించిన ఏఐసీసీ పార్లమెంట్‌కు వెళ్లి పలువురు ఎంపీలను కలిసిన రేవంత్ స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపిన ఎంపీలు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు రిట్నర్ కాసేపటి కిందట హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సైతం చేరుకున్న రేవంత్ హైకమాండ్ నుంచి రేవంత్‌కు పిలుపు హుటాహుటిన ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డి ఎందుకు పిలిచారో అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ 300 అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారానికి.. 300 మంది అమరవీరుల కుటుంబాలకు టీ పీసీసీ ఆహ్వానం మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు కాంగ్రెస్ విజయం అమరవీరులకు అంకితమని ప్రకటన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ 8వ గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ గ్రౌండ్ కేపాసిటీ మొత్తం 80 వేల మందికి అవకాశం స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు సీసీటీవీ కెమెరాలతో బందోబస్త్ ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు భద్రత కట్టుదిట్టం దాదాపు లక్షమంది స్టేడియానికి వచ్చే అవకాశం ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి ముగిసిన రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నాం తెలంగాణ సీఎంగా ప్రమాణం ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం పలు పార్టీల అగ్రనేతలు, రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, సినీ.. క్రీడా రంగ ప్రముఖులకు ఆహ్వానం రేవంత్‌తో పాటు రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఆరుగురు స్పీకర్ ఎన్నిక తర్వాత మిగిలిన కేబినెట్ ఎంపిక రేపు ఆరుగురి ప్రమాణం? మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అవుతున్న రేవంత్‌రెడ్డి రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురే? ఒక డిప్యూటీ సీఎం , ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాం: డీజీపీ రవిగుప్తా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు సుమారు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు: డీజీపీ రవిగుప్తా ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ఎవరికి వారే.. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం అందరి ప్రయత్నాలు అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్న సీనియర్లు నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందన్న ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలన్న ఖర్గే డీకే శివకుమార్‌ను కలిసి మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశతో ఉన్న ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేవంత్‌కు రాహుల్ అభినందనలు తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్ గాంధీ అభినందనలు తెలంగాణలో ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నెరవేరుస్తుంది రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుత పాలన అక్కడి ప్రజలకు అందుతుంది రేవంత్ ప్రమాణ స్వీకారానికి వాళ్లకు ఆహ్వానం డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెలంగాణ సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్ ఏర్పాట్లు చేస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు ఎల్బీ స్టేడియంలో సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీతోపాటు ఇంటటెలిజెన్స్ అధికారులు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షణ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు ఇప్పటికే పలువురిని వ్యక్తిగతంగా ఆహ్వానించిన రేవంత్ తెలంగాణ అమర వీరుల కుటంబానికి ఆహ్వానం కూడా మంచి పాలన అందిస్తాం: డీకేఎస్ ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన డీకే శివకుమార్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో డీకేఎస్ కీలక పాత్ర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడిగా బాధ్యతలు.. ప్రచారంలో పాల్గొన్న డీకేఎస్ సీఎల్పీ భేటీ వివరాలను అధిష్టానానికి తెలియజేశా: డీకేఎస్ తెలంగాణ ప్రజలు మాకు అధికారం అప్పగించారు: డీకేఎస్ వాళ్లకి మంచి పాలన అందిస్తాం: డీకేఎస్ రేపు హైదరాబాద్‌కు రానున్న డీకేఎస్ రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్ హై కమాండ్ కు నివేదిక అందించాము. హై కమాండ్ సీఎం అభ్యర్థి పై నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానానికి అన్ని అంశాలను వివరించాం ఇకపై అధిష్టానమే నిర్ణయాలను తీసుకుంటుంది. రేవంత్ రాజీనామా వాయిదా? లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపు సీఎం పదవి దక్కడంతో ఎంపీ పదవికి రాజీనామా అయితే రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్? రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేయనున్న రేవంత్ డీకే శివకుమార్‌ను కలిసిన శ్రీధర్‌బాబు డీకే శివకుమార్‌ను కలిసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా డీకే శివకుమార్‌ను కలిశా కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటాం మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే తీసుకుంటాను ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల: బండ్ల గణేష్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల నేను చెప్పినట్లు జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం ఏడోతేదీ అని చెప్పడంతో సంతోషించాను. రేవంత్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన విధానం ప్రజలకు నచ్చింది. రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు టీకాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నట్టు తెలిపిన నేతలు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖ గవర్నర్‌కు అందజేత రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం చేస్తారని గవర్నర్‌కు తెలిపిన నేతలు రేవంత్ రాజీనామా రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు వెళ్లారు ఈ సందర్భంగా ఎంపీ స్థానానికి రేవంత్ రాజీనామా చేశారు. అలాగే, పార్లమెంటులో ఎంపీలను కలిసిన రేవంత్ రెడ్డి రూమ్ నెంబర్-66లో పలు పార్టీల ఎంపీలతో సమావేశమైన రేవంత్ రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు #WATCH | Delhi | Telangana CM-designate Revanth Reddy arrives at the Parliament. The Congress MP from Malkajgiri is expected to tender his resignation as a Member of the Parliament, ahead of his swearing-in ceremony in Hyderabad tomorrow. pic.twitter.com/5Kllvj5fHx — ANI (@ANI) December 6, 2023 రేపు రజినీ ఉద్యోగ నియామకంపై రేవంత్ సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీ దివ్యాంగురాలు రజినీకి హామీ ఇచ్చిన రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రజినీకి పిలుపు. రేపు రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్న రేవంత్. అధిష్టానం నిర్ణయానానికి కట్టుబడాలి: కాంగ్రెస్ నేతలు సాక్షి టీవీతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం పదవి ఎవరైనా ఆశించడంలో తప్పులేదు కానీ అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే లక్ష్యం సాక్షి టీవీతో షబ్బీర్ అలీ.. ఏఐసీసీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఉంటుందా లేదా అనే సమాచారం లేదు అలాంటి చర్చ ఇప్పుడు జరగలేదు ప్రజలకు సుస్థిర పరిపాలన అందిస్తాము. సోనియా, రాహుల్, ప్రియాంకతో రేవంత్ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో రేవంత్ సమావేశం సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించిన రేవంత్ Telangana CM designate Revanth Reddy meets Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra in Delhi pic.twitter.com/hUuu2gl7bF — ANI (@ANI) December 6, 2023 #WATCH | Telangana CM-designate and state Congress president Revanth Reddy arrived at the residence of Congress Parliamentary Party Chairperson Sonia Gandhi to meet her, this morning. pic.twitter.com/JASV0qjvCg — ANI (@ANI) December 6, 2023 రేవంత్ ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైమ్‌లో స్వల్ప మార్పు. రేవంత్ రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎస్, డీజీపీ పర్యవేక్షణ సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చేరుకున్న సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించిన డీజీపీ ఎన్నికల్లో ఓడిన వారికి కేబినెట్లో చోటు.. ►కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ►ఎన్నికల్లో టిక్కెట్ త్యాగం చేసిన వారికి, ఓడిన సీనియర్ నేతలకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు టీకాంగ్రెస్ కసరత్తు ►టిక్కెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్‌తో పాటు ఓడిన షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్న ఏఐసీసీ ఖర్గేతో రేవంత్ భేటీ.. కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ Telangana CM-designate and state party chief Revanth Reddy met the party's national president Mallikarjun Kharge at his residence in Delhi, today. pic.twitter.com/XMOGLKrVo6 — ANI (@ANI) December 6, 2023 #WATCH | Telangana CM elect Revanth Reddy arrives at the residence of Congress President Mallikarjun Kharge in Delhi pic.twitter.com/bDAcNI6pOw — ANI (@ANI) December 6, 2023 కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ.. ఢిల్లీ పర్యాటనలో భాగంగా బిజీగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ అయ్యారు. #WATCH | Telangana CM designate and state Congress President Revanth Reddy leaves from his residence in Delhi pic.twitter.com/tDKTb1jhIV — ANI (@ANI) December 6, 2023 రేవంత్ నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు.. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీస్ ఆంక్షలు ఇంటివద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న పోలీస్ అధికారులు రేవంత్ నివాసం నుండి బయటకు వచ్చే రూట్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రేవంత్ నివాసం వద్ద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్లు వేసి ఆంక్షలు ఇప్పటికే రేవంత్ నివాస పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఇంటెలిజెన్స్ పోలీసులు. కాసేపట్లో ఖర్గేతో రేవంత్ భేటీ.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్న రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్ మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించనున్న రేవంత్ నేడు సోనియా గాంధీని కలవనున్న రేవంత్ నేడు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవనున్న రేవంత్ రెడ్డి రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్ డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో కలిసి క్యాబినెట్‌పై కసరత్తు చేయనున్న రేవంత్ క్యాబినెట్ కూర్పు కసరత్తులో పాల్గొననున్న ఉత్తమ్, భట్టి 9న తెలంగాణ కాంగ్రెస్ కృతజ్ఞత సభ డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్ అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి రేవంత్‌తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా! ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ►కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ►తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ►ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
ఆరేళ్లలోనే... అత్యున్నత హోదాకు
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. వైఫల్యాలను అధిగమిస్తూ.. కాంగ్రెస్ పార్టిలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. -
‘జెడ్పీటీసీ’ టు సీఎం
పేరు : ఎనుముల రేవంత్‌రెడ్డి పుట్టిన తేదీ : 8–11–1967 స్వగ్రామం : కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) చదువు : బీఏ భార్య : గీతారెడ్డి కూతురు : నైమిష–సత్యనారాయణరెడ్డి (అల్లుడు) సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విద్యార్థి దశ నుంచే రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగిడారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీతోపాటు ఆర్ఎస్ఎస్లో కూడా చురుగ్గా పనిచేశారు. కొంతకాలం మలక్‌పేటలో ఉన్న ఆయన నారాయణగూడకు మకాం మార్చారు. నారాయణగూడలో మిస్టర్ ఆడ్స్ పేరుతో ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రింటింగ్ ప్రెస్‌ను తమ్ముడు కృష్ణారెడ్డికి అప్పగించారు. కృష్ణారెడ్డి బర్కత్‌పుర డివిజన్‌కు టీడీపీ తరపున ఎంసీహెచ్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ► 2004లో టీఆర్ఎస్లో చేరి కల్వకుర్తి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్క లేదు. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్‌రెడ్డి గెలిచారు. ► 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా రేవంత్‌రెడ్డి గెలవడం అప్ప ట్లో సంచలనమే. అదే ఏడాదిలో టీడీపీలో చేరారు. ► 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్‌కు టీడీపీ తరఫున పోటీచేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ► 2015 మే 15న రేవంత్‌రెడ్డిని ఓటుకు కోట్లు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్ట్ చేయడం పట్ల రేవంత్ సీరియస్‌గా స్పందించారు. ‘నీ అంతు చూస్తా.. నిన్ను గద్దె దించడమే నా లక్ష్యం’అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ► తెలంగాణలో టీడీపీ ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతో 2017లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ► టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి మూడోసారి బరిలో దిగా డు. పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ► 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ► 2021 జూన్ 26న అధిష్టానం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జరిగిన గ్రేటర్, ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నా.. పట్టుదలతో ముందుకు కదిలి.. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టారు. ► ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్లలో రేవంత్ పోటీ చేయగా, కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్‌లో గెలిచారు. నాపై గెలిచిన వ్యక్తి నేడు సీఎం.. వెరీ హ్యాపీ నాపై పోటీ చేసిన వ్యక్తి నేడు తెలంగాణ సీఎం అవుతుండటం సంతోషంగా ఉంది. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే.. రేవంత్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన సీఎం అవుతున్నారంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. – ఎండీ రబ్బానీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మిడ్జిల్ మండలం -
వాళ్లు ఓడిపోవడం ఏమిటో?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా గెలిచి సత్తా చాటుతారని భావించిన ముఖ్యనేతలే ఓటమి చవిచూడడంపై బీజేపీలో విస్మయం వ్యక్తమవుతోంది. పోటీచేసిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలు కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు. కరీంనగర్ ఎంపీగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుల్లో ముఖ్యుడైన బండి సంజయ్, ఒకప్పుడు బీఆర్ఎస్లో నంబర్–టుగా వెలిగి, ఇప్పటిదాకా ఓటమి ఎరగని ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితపై గెలిచి సంచలనం సృష్టించిన ధర్మపురి అర్వింద్, ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొంది దుబ్బాక ఉప ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేసిన రఘునందన్‌రావు, ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పని చేయని బీసీ నినాదం బీజేపీ బీసీ నినాదం, ఇతర పార్టీల కంటే అత్యధికంగా 36 సీట్లు బీసీలకు కేటాయించిన నేపథ్యం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే పార్టీ విధానపరమైన నిర్ణయం... ఈ ఎన్నికల్లో కనీసంగా పనిచేయలేదని విశ్లíÙస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు మాత్రమే బీసీలు ఉండటం, బీసీ సీఎం అభ్యర్థులుగా ముందువరుసలో నిలిచే సంజయ్, ఈటల, అర్వింద్ ఓటమి పాలవడం చూస్తుంటే బీసీ ప్రభావం ప్రశ్నార్థకంగానే ఉందని అంటున్నారు. సంజయ్‌ను ఓడించేందుకు... రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరై, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నంత స్థాయిలో పార్టీ ఇమేజ్‌ని ఆమాంతం పెంచిన నేతగా గుర్తింపు పొందిన బండి సంజయ్ ఓటమికి పైకి కనిపించని కారణాలు ప్రభావితం చేసినట్టు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ ఫలితాన్ని పోలింగ్ బూత్‌ల వారీగా విశ్లేషించిన పార్టీ నేతలు ముస్లిం, మైనారిటీ ఓటర్లు ఏకపక్షంగా సంజయ్‌కు వ్యతిరేకంగా ఓటేశారని లెక్కలు వేస్తున్నారు. ఎలాగైనా సంజయ్‌ను ఓడించాలంటూ పోలింగ్ సమయం నాటికి బీఆర్ఎస్తో కాంగ్రెస్ మిలాఖత్ అయిందని ఆరోపిస్తున్నారు. మొత్తం 390 పోలింగ్ బూత్‌లలో దాదాపు 200 బూత్‌లలో సంజయ్ ప్రత్యర్ధి గంగుల కమలాకర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మిగిలిన 186 బూత్‌లలోనే బీఆర్ఎస్ అభ్యర్ధి అధిక ఓట్లు సాధించగలిగారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 62 ముస్లిం ఓటర్ల ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓట్లు గంగులకే పడ్డాయి. ఉదాహరణకు చూస్తే హుస్సేన్ పురాలోని 232 నుంచి 241 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 80 శాతానికిపైగా మైనారిటీ ముస్లిం ఓటర్లుండగా, వీటిలో పోలైన 6,764 ఓట్లలో సంజయ్‌కు కేవలం 259 మా త్రమే పడ్డాయి. ఈ బూత్‌లలో 4,979 ఓట్లు అంటే 80 శాతం కమలాకర్‌కు పడ్డాయి. సంజయ్ 3,163 ఓట్లతో వెనకబడడం చూస్తే...ఈ ఓట్లే సంజయ్ ఓటమిని శాసించాయని గణాంకాలతో సహా పార్టీ నాయకులు ఉదహరిస్తున్నారు. ఇక ముస్లిం ఓటర్ల ప్రాబల్యమున్న 62 పోలింగ్ బూత్‌లలో ఒక్కటంటే ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత కనబరచకపోవడం చూస్తే కమలాకర్‌తో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలకు బలం చేకూరుతోందని విశ్లేషిస్తున్నారు. ప్రజల కోసం నిత్యం పోరాడే తనను ఓడించేందుకు ముస్లింలంతా ఏకమయ్యారని, హిందూ సమాజం ఇప్పటికైనా కళ్లు తెరవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. అంతటా తిరగడం వల్లనే ఈటలకు నష్టం కేసీఆర్‌ను గజ్వేల్‌లో పోటీచేసి ఓడిస్తానంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఈటలకు వ్యక్తిగతంగా నష్టం చేసిందని అంచనా వేస్తున్నారు. వరుసగా గెలుస్తూ వచ్చిన హుజూరాబాద్‌లో ఈ సారి త్రిముఖ పోటీ కారణంగా ప్రజా వ్యతిరేకత ప్రాతిపదికన కాంగ్రెస్ అధిక ఓట్లు చీల్చడంతో ఈటల అనూహ్యంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందని పార్టీ నాయకులు విశ్లేíÙస్తున్నారు. -
కరప్షన్ ఫ్రీ కామారెడ్డి
‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. ‘‘దేమె రాజిరెడ్డి కొడుకు తండ్రిలా నిజాయితీపరుడు అన్న పేరు రావాలి. నేను చనిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆఖరి చూపునకు రావాలి. అదే నా కోరిక’’అంటు న్న కేవీఆర్‌ను మంగళవారం ‘సాక్షి’పలకరించింది. జెయింట్ కిల్లర్ అవుతాననుకున్నారా ? కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నపుడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేసినా, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పోటీ చేసినా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలని, అందుకు మనం కష్టపడా లని కార్యకర్తలతో మాటవరుసకు అన్న. దైవ నిర్ణయమో ఏమోగానీ, ఆ రోజు నా నోటి నుంచి వచ్చి నట్టే నామీద కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. ఆ ఇద్దరితో తలపడి ఓడించే అవకాశాన్ని ప్రజలు నాకిచ్చారు. అందుకే రాష్ట్రం, దేశం మొత్తం కామా రెడ్డి ఎన్నికల ఫలితం కోసం ఎదురుచూసింది. ఆ ఇద్దరితో పోటీ అని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు ? దేశంలో ఎవరికీ రాని అవకాశం నాకు దక్కింది. సీఎం, కాబోయే సీఎంలిద్దరూ కామారెడ్డిలో నిలబడుతున్నారని తెలియడంతో ఇద్దరినీ ఓడిస్తానని, ఓడించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన. ఇద్దరితో పోటీపడడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ల దగ్గర డబ్బు, అధికారం, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది. నా కోసం దేనికైనా తెగించే కార్యకర్తల బలం ఉంది. అన్నింటికి మించి ప్రజల్లో నామీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంతోనే వాళ్లను ఓడిస్తానని శపథం చేసిన. ఒకేసారి ఇద్దరు రాజకీయ ఉద్ధండులను కొట్టే అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తున్నా. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇక్కడి ప్రజలు తమ సొంత ఇంటి వ్యక్తిగా భావించి నన్ను గెలిపించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మందిని లొంగదీసుకున్నా, ప్రజలు మాత్రం నావైపు నిలిచారు. ఏ ఊరికి వెళ్లినా మహిళలు ఎంతో ఆదరించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం చేసిన పోరాటం, భూముల కోసం చేసిన ఉద్యమాలతో నన్ను సొంత అన్నలా, తమ్ముడిలా భావించారు. పోయిన ప్రతిచోటా నువ్వే గెలుస్తావంటూ దీవించి పంపించారు. మీకు రాజకీయ ప్రేరణ ఎవరు? నా చిన్నతనంలో మా నాన్న రాజిరెడ్డి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. చదువుకునేరోజుల్లో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్లినా ఆయన గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినేవాన్ని. దేమె రాజిరెడ్డి ఉద్యోగం ఇప్పించాడని చెబుతుండేవారు. వారితో మాట్లాడుతున్నపుడు తాను రాజిరెడ్డి కొడుకునని వారికి తెలియదు. ఆ రాజిరెడ్డి కొడుకును నేనే అన్నప్పుడు వారు నాకు ఇచ్చిన మర్యాద ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అన్నీ నాన్నతో చర్చించేవాడిని. నీతి, నిజాయితీగా పనిచేసినపుడు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన చెప్పిన మాటలు నా మనసులో నిండిపోయాయి. మా నాన్నలాగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆ రోజే అనుకున్నాను. హామీలు నెరవేర్చడానికి ఎంత సమయం తీసుకుంటారు? కామారెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమే నా ముందున్న అతి పెద్ద లక్ష్యం. ప్రధాని మోదీ సహకారంతో కేంద్రం నుంచి 40 వేల ఇళ్లు మంజూరు చేయించుకొని, వాటిని నిర్మించి ఇస్తా. సొంత మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అనుకుంటున్న. ముందుగా రైతులు ఎదుర్కొంటున్న కల్లాల సమస్యను పరిష్కరించేందుకు నెల, రెండు నెలల్లో కార్యాచరణ మొదలుపెడతా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. -
కేసీఆర్‌తో మండలి చైర్మన్ గుత్తా భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం మాజీ సీఎం కేసీఆర్‌తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డితో పాటు ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సుఖేందర్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే విజయుడికి కేసీఆర్ ఆశీస్సులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కూడా ఉన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను అలంపూర్ అభ్యరి్థగా ప్రకటించి చివరి నిమిషంలో కేసీఆర్ విజయుడికి బీ ఫారాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయుడు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని విజేతగా నిలిచారు. -
ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ‘ఆరు గ్యారంటీ’ల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించిన విధంగా ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుకు అవసరం కానున్న నిధులపై ‘సాక్షి’విశ్లేషణాత్మక కథనం.. మహాలక్ష్మికి రూ.10 వేల కోట్లు! మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది. ♦ ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్ సబ్సి డీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది. ♦ మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారుగా రూ.2,200 కోట్ల వ్యయం కానుంది. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తే రూ.750 కోట్లు కానున్నాయి. రైతు భరోసాకు రూ.29 వేల కోట్లు! రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్టు అంచనా. వీరికి రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి ఏటా రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి. అలాగే ఎకరానికి రూ.15 వేలు చొప్పున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ.22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ.3,000 కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, టన్నుకు రూ.500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ.29 వేల కోట్లు అవసరం అని అంచనా. ఇందిరమ్మ ఇళ్లకు రూ.15 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారు లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే అందుకు అవసరం కానున్న నిధులపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే, ఏటా కనీసం 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. యువ వికాసానికి రూ.10 వేల కోట్లు? విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు విషయంలో.. ఏ స్థాయి విద్య కోసం ఎంత మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ.10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు.. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9 శాతం గృహాలు) నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయి. చేయూతకు రూ. 21 వేల కోట్లు చేయూత పథకం కింద నెలకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామ ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తే ఏటా సుమారు రూ.20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి. -
భట్టికి డిప్యూటీ సీఎం+పీసీసీ పగ్గాలు?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో ఆయన స్థానంలో కొత్త నేతను అధిష్టానం ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా సీఎల్పీ నాయకుడి ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన భట్టి ముందు అధిష్టానం ఓ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ కోరినట్టు సమాచారం. అయితే సీఎం పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టిన భట్టి, ఈ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదని చెబుతున్నారు. బీసీ కోటాలో పలువురి పేర్ల పరిశీలన! పీసీసీ చీఫ్ పదవిని భట్టి నిరాకరించిన పక్షంలో.. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, డిప్యూటీ సీఎం ఎస్సీ నేతకు ఇచ్చే పక్షంలో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఈ కోటాలో వినిపిస్తున్న మొదటి పేరు పొన్నం ప్రభాకర్. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రభాకర్.. అటు పార్టీకి, ఇటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు. ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేసిన పొన్నం ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో డి.శ్రీనివాస్ కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మంత్రిపదవి నిర్వహించడాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈ ప్రతిపాదనపై చర్చ జరుపుతోందని తెలుస్తోంది. అది సాధ్యం కాని పక్షంలో మరో ఇద్దరు బీసీ నేతలు మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌ల పేర్లు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలను బట్టి సీనియర్ నేతలైన ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మైనార్టీ నేత షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మల్లురవిల పేర్లను కూడా హైకమాండ్ పరిశీలించే అవకాశముందనే చర్చ జరుగుతోంది. -
రేవంత్ స్వగ్రామంలో సంబరాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వంగూరు: కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఆయన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలు రోడ్లమీదకు వచ్చి టపాకాయలు కాల్చి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. మా మధ్యలో పెరిగిన మా రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే తెలివైనవాడు రేవంత్‌రెడ్డి తాండ్ర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివినప్పుడు నేను టీచర్‌గా పనిచేశాను. అప్పుడే తరగతిగదిలో రేవంత్ మ క్కువను నేను గమనించేవాడిని. భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతాడ ని అనుకున్నాను. నేను చదువు చెప్పిన విద్యార్థి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది. – జగన్మోహన్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం, తాండ్ర చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి రేవంత్‌రెడ్డి నాకు క్లాస్మేట్, బంధువు కూడా. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయా లపై ఆసక్తి ఎక్కువ. చదువులోనే కాకుండా ఆటల్లోనూఉత్సాహం కనబరిచేవాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో, 6వ తరగతి తాండ్ర గ్రామంలో చదువుకున్నాం. నా స్నేహితుడు రాష్ట్రానికి సీఎం కావడం ఎంతో గర్వంగా ఉంది. – కేవీఎన్ రెడ్డి, వంగూరు జెడ్పీటీసీ, రేవంత్‌రెడ్డి స్నేహితుడు నా సంతోషానికి అవధుల్లేవు రాజకీయ నేపథ్యం లేకున్నా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నా స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాతో పాటు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాం. ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం. – ధర్మారెడ్డి, రేవంత్‌రెడ్డి స్నేహితుడు -
మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు మంగళవారం ఎల్లా హాటల్లో భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు రేవంత్‌ను కలిసి అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమను మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనిపై చాడ వెంకటరెడ్డిని ప్రశ్నించగా, తమకు అలాంటి ఆలోచన లేదనీ, అయితే కాంగ్రెస్ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పామన్నారు. అంటే సీపీఐకి ఈ ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం కావాలన్న ఆలోచన ఉన్నట్లుగా సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సీటు గెలిస్తే మంత్రి పదవి వస్తుందా? అయితే, ఒక్క సీటు గెలిచిన సీపీఐకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండదనీ, కాంగ్రెస్‌లో ఉన్న వారికే సర్దుబాటు చేయడం కష్టమని అంటున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి వారు ఉన్నప్పుడు సీపీఐకి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై జ్యూడీషియల్ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన ద్రస్తాలను తగులబెట్టారని విమర్శించారు. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకుచిత వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తోందని విమర్శించిన ఆయన ఇండియా కూటమి బలపడాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానన్నారు. -
ఇద్దరు సీఎంలను ఓడించిన వెంకటరమణారెడ్డికి కీలక బాధ్యతలు..?
సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ముఖ్య నేతలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఒకేసారి ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించిన కేవీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సామాజిక మాద్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఫోన్ చేసి జెయింట్ కిల్లర్ అంటూ అభినందించారు. కేవీఆర్ నామినేషన్ వేయక ముందు నిర్వహించిన బైక్‌ర్యాలీ, సభల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆయన ఫాలోయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేవీఆర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేలా ప్రయత్నిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో మంత్రిని చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే బీజేపీ శాసనసభా పక్షంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన వెంకటరమణారెడ్డికి కీలకమైన పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. రాజకీయాల మీద, వ్యవస్థల మీద అవగాహన ఉన్న వెంకటరమణారెడ్డికి అవకాశం ఇస్తే ఆయన అసెంబ్లీలో ఆయా అంశాల మీద తన గళాన్ని గట్టిగా వినిపించగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయమై శ్రేణుల్లో చర్చ సాగుతోంది. -
ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా..!
నల్గొండ: ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరు ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే, వీరి రాజీనామాతో రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అనే చర్చ జరుగుతోంది. రిప్రజేంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, సెక్షన్ 151–ఎ ప్రకారం.. ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, 17వ పార్లమెంట్ సాధారణ ఎన్నికలు 2024 మేలో జరుగనున్నాయి. వీరిద్దరు ఇప్పుడు రాజీనామా చేసినా.. పార్లమెంట్ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండడంతో ఉప ఎన్నికలు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ స్థానాలు ఖాళీగానే ఉండనున్నాయి. -
సామాజిక కోణంలో కేబినెట్ కూర్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, డి.కె.శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రేల సమక్షంలో చర్చించిన తర్వాత రాహుల్, ఖర్గేలతో మాట్లాడి వారి అనుమతి మేరకు కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేబినెట్లో ఎంతమందిని తీసుకోవాలి? ఎవరెవరిని తీసుకోవాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుని గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులందరి చేత ప్రమాణం చేయించనున్నారు. డిప్యూటీ సీఎంలు ఒకరా... ఇద్దరా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని సీఎంగా నిర్ణయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకరిని నియమించాలా లేదా ఇద్దరికి అవకాశమివ్వాలా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతమున్న సమాచారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి గతంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కేబినెట్లో కీలక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాను భట్టికి మాత్రమే పరిమితం చేస్తారని, అలాగే భట్టితో పాటు మరొకరికి కూడా ఇస్తారనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది? కొత్త మంత్రివర్గాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే అంశంతో పాటు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఎంపిక కాగా.. సీఎంతో పాటు నాలుగు లేదా ఐదు బెర్తులు వారికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)లకు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టేనని తెలుస్తోంది. టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), దొంతి మాధవరెడ్డి (వరంగల్)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు విప్ పదవులు కూడా ఈ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్‌లుగా ఉన్నత విద్యావంతులైన మహిళలు పరణికారెడ్డి, యశస్వినిరెడ్డిల్లో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొండ)లకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్య పదవులు లభించే అవకాశాలున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌రావు, జూపల్లి కృష్ణారావులలో ఒకరికి లేదంటే ఇద్దరికీ మంత్రిగా అవకాశం దక్కనుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మరోమారు కేబినెట్ మంత్రి బాధ్యత అప్పగించడం ఖాయమేనని, ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. బీసీలలో వీరికే.. తాజా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)కు కేబినెట్ బెర్తు ఖరారయిందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు మహిళా కోటాలో కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) పేరు ప్రకటన కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), వాకిటి శ్రీహరి (ముదిరాజ్), బీర్ల అయిలయ్య (యాదవ్)లలో ఒకరికి చాన్స్ దొరకొచ్చని అంటున్నారు. ఎస్సీ కోటాలో రాజనర్సింహ ఖరారు దళిత ఎమ్మెల్యేలకు కూడా కొత్త కేబినెట్లో తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం కసరత్తు సాగుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన భట్టిని ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ (ఆంథోల్)కు కీలక శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆయనతో మాదిగ వర్గానికే చెందిన మరొక నాయకుడికి కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యంకు విప్ పదవి వస్తుందని, ఆయనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశం (నకిరేకల్)కు కూడా విప్ హోదా కల్పించే ప్రతిపాదనలున్నాయని సమాచారం. ఇక ఎస్టీ కోటాలో ధనసరి అనసూయ (సీతక్క)కు మంత్రి పదవి ఖాయమైనట్టే. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివాసీ వర్గాలకు చెందిన ఆమెతో పాటు లంబాడా సామాజిక వర్గం నుంచి ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), రామచంద్రనాయక్ (డోర్నకల్)ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాళీగా కొన్ని బెర్తులు? పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రిని, మంత్రులుగా మరో 17 మందిని నియమించే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఒకేసారి భర్తీ చేస్తారా.. రెండు నుంచి నాలుగు బెర్తులను ఖాళీగా ఉంచి తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రాంతాల వారీ ప్రాధాన్యతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి జిల్లాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో అని బెర్తులనూ నింపకపోవచ్చని తెలుస్తోంది. ఇలా మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న అనేకమంది.. ఏఐసీసీ పెద్దలు, తమకు సన్నిహితులై ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో లాబీయింగ్ చేస్తుండటం గమనార్హం. -
తెలంగాణ 'సీఎం రేవంత్'
వన్ మ్యాన్ షో ఉండదు తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదటిది. అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు తెలిపేది రెండో తీర్మానం. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగిస్తూ మూడో తీర్మానం చేశారు. పార్టీ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం సీనియర్లతో చర్చించాం. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంలో వన్‌మ్యాన్ షో ఉండదు. అందరినీ కలుపుకొంటూ కలసి టీమ్‌గా ముందుకు వెళ్తాం. సీనియర్లు అందరికీ సముచిత గౌరవం ఉంటుంది. – కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. తీర్మానాలను అధిష్టానానికి అందజేసి.. రాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం అనంతరం సోమవారం కొత్త ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు, ఏఐసీసీ పరిశీలకులు సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం, ఎమ్మెల్యే అభిప్రాయాల నివేదికలతో ఢిల్లీకి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు మంగళవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. సీఎంతోపాటు ఇతర కీలక పదవులపై రాష్ట్ర, జాతీయ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికల్లా సీఎంను ఖరారు చేస్తామని ఖర్గే ప్రకటించారు. వరుసగా భేటీలు.. విస్తృతంగా సంప్రదింపులు.. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు కొద్దిసేపు పదవుల అంశంపై చర్చించుకున్నారు. 10.45 గంటలకు ఉత్తమ్ డీకే శివకుమార్‌తో భేటీ అయి.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కీలక శాఖలకు మంత్రులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తనకు సీఎం పదవికి అర్హత ఉందని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు ఉందని వివరించినట్టు సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు ఆమోదమేనని ప్రకటించారు. డీకేతో ఉత్తమ్ భేటీ జరుగుతున్న సమయంలోనే.. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. సీఎం పదవి కోసం తన అర్హతను పరిశీలించాలని కోరారు. ఈ భేటీలు సాగుతున్న సమయంలోనే ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరిగింది. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. పదవికి పోటీ పడుతున్న రేవంత్, ఉత్తమ్, భట్టి పేర్లను పరిశీలించారు. పారీ్టకి పనిచేసిన అనుభవంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న పార్లమెంట్ ఎన్నికలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి వైపే అంతా మొగ్గుచూపినట్టు తెలిసింది. ఈ భేటీ మొదలైన అరగంటకు డీకే శివకుమార్, ఠాక్రే కూడా ఖర్గే నివాసానికి చేరుకుని.. ఎమ్మెల్యేల తీర్మానం కాపీ, వారి అభిప్రాయాల నివేదికను అగ్రనేతలకు అందించారు. ఈ సందర్భంగా అంతా కలసి.. పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు, కీలక శాఖల అప్పగింత, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. రేవంత్ ఎంపికను ఖరారు చేసి, ఈ విషయాన్ని అగ్రనేత సోనియాగాం«దీకి తెలిపి ఆమోదం తీసుకున్నారు. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఉత్తమ్, దామోదర, శ్రీధర్‌బాబు, సీతక్కలకు కీలక శాఖలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, మంత్రులకు శాఖలపై నేడు స్పష్టత సీఎం ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్‌తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవులతోపాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులపై వారు సుమారు గంట పాటు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే, ఉత్తమ్, భట్టిలను వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు ఎందరు ఉండాలి, మంత్రి పదవులు ఎవరికి అన్న దానిపై బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. సోనియాతో జి.వినోద్ భేటీ మరోవైపు మాజీ మంత్రి జి.వినోద్ ఢిల్లీలో సోనియాగాంధీతో విడిగా భేటీ అయ్యారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కోరానని భేటీ అనంతరం వినోద్ తెలిపారు. తన విజ్ఞప్తిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఉత్తమ్ సీఎల్పీ నేత ప్రకటనకు ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని హైకమాండ్‌ను కోరానని చెప్పారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సీఎం ఎంపిక జరుగుతోందని, మిగతా పార్టీ అంతర్గత విషయాలను బయటికి వెల్లడించలేనని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లోనే గడిపారు. ఓవైపు ఢిల్లీలో సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి హోటల్లో కొత్త ఎమ్మెల్యేలతో ఉండి చర్చలు జరుపుతూ గడిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉండగానే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రేవంత్ వెళ్లాక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వారంతా బుధవారం మళ్లీ ఎల్లా హోటల్లో సమావేశం కానున్నారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎంగా రేవంత్ ఎంపిక ప్రకటన వెలువడగానే.. ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ, జై రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం – వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పారిశుధ్యం, త్రాగునీరు, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎం ఎంపిక.. ఇది కాంగ్రెస్సేనా?
కాంగ్రెస్ అధిష్టానం ఏనాడైనా త్వరగతిన ఓ నిర్ణయం తీసుకుంటుందా?.. చర్చోపచర్చలు, అసంతృప్త నేతల బుజ్జగింపులు.. స్టేట్ టు హస్తిన రాజకీయాలు.. క్యాంప్ రాజకీయాలు.. హైకమాండ్ తీవ్ర తర్జన భర్జనలు.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి పరిస్థితులే కనిపించేవి. ఈ పరిస్థితుల్నే ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు హస్తం పార్టీపై జోకులు కూడా పేల్చేవాళ్లు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంత వేగంగా ప్రకటిస్తుందని, అసంతృప్తుల పంచాయితీని కూడా ఇంత తక్కువ టైంలో తేలుస్తుందని రాజకీయ వర్గాలు ఊహించి ఉండవు!. ఏ పార్టీలో అయినా వర్గపోరు.. నేతల విభేదాలు సహజం. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అవి పరిధి దాటిపోతూ కనిపిస్తూ వస్తున్నాయి. సపోజ్.. తెలంగాణ కాంగ్రెస్‌నే పరిశీలిద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం(కొందరు సీనియర్లు) మధ్య విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ నిలువునా చీలిపోతుందేమో అనే పరిస్థితి నెలకొంది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, రాజస్థాన్‌లో సీనియర్ వర్గం జూనియర్వర్గం, కర్ణాటకలోనూ కీలక నేతల మధ్య వర్గపోరుతో దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సీనియర్లు వర్సెస్ జూనియర్ల పంచాయితీలను తీర్చేందుకు కొన్ని సందర్బాల్లో ఏఐసీసీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటిది రేవంత్‌రెడ్డిని సీఎంగా కేవలం రెండే రోజుల్లో ప్రకటించడం ఇప్పుడు కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసేదే!. సెటైర్లు.. జోకులు.. ‘‘ఇక్కడ సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్‌లో కనీసం 8 మంది రెడీగా ఉన్నారేమో!’’ అంటూ.. కిందటి ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. అలాగే.. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా కామెంట్లతో కాంగ్రెస్‌పై జోకులు పేల్చింది. అంతెందుకు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ఫలితాలు వచ్చాక ఐదు రోజుల సమయం తీసుకోవడంపై హస్తం పార్టీని ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. సీఎం పంచాయితీ తప్పదేమోనని భావించిన తరుణంలో త్వరగతిన, అదీ పక్కా నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మాత్రం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవంతోనే ముందుకు సాగింది. ఆ తర్వాతే సీన్ మారింది.. వరుసగా పలు రాష్ట్రాల్లో ఓటములు.. అధికారం కోల్పోవడం గ్రాండ్ ఓల్డ్పార్టీని దెబ్బేస్తూ వచ్చాయి. ఈ మధ్యలో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడ్ని చేశాక.. సీనియర్ల(జీ23 గ్రూప్) స్వరం పెద్ద తలనొప్పిగా మారింది. ఆఖరికి పార్టీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) నిర్వహించినా.. అది కూడా అట్టర్‌ప్లాపే అయ్యింది. ఇలాంటి దశలో కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత సీన్ మారింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. నేతల మధ్య ఐక్యత కోసం ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కలిసి ఉంటేనే దక్కును అధికారం అని నేతలకు హితబోధ చేస్తూ వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షణకు అనుభవజ్ఞులైన నేతల్ని నియమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ సంక్షోభానికి ఎన్నికల వేళ చెక్ పెట్టడం, రెండు రోజుల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, అలాగే.. డీకే శివకుమార్‌లాంటి సమర్థవంతమైన నేతను బుజ్జగించి కర్ణాటకలో సిద్ధరామయ్యను సీఎం చేయడం, ఇప్పుడు తెలంగాణలో అసమ్మతులతో సంప్రదింపులు జరిపి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పెద్ద దెబ్బే. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం కైవసం చేసుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. ఇందుకు.. పార్టీలో ఐక్యత కూడా ఒక కారణమనేది కచ్చితంగా చెప్పొచ్చు. ఇదే టీమ్ ఎఫర్ట్ స్ట్రాటజీతో గనుక ముందుకు సాగితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడంంలో సఫలం కావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే! -
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. తొలి పోస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎంగా తన పేరు ప్రకటనకు కొద్ది నిముషాల ముందే రేవంత్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ‘‘తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. — Revanth Reddy (@revanth_anumula) December 5, 2023 కాగా, తెలంగాణ రాజ్‌భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీ పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీ అయ్యాక ఈ నిర్ణయం వెల్లడించింది. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. -
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. చివరికి రేవంత్ పేరే.. తెలంగాణ రాజ్‌భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీనియర్ల చర్చల పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం వెల్లడించింది హైకమాండ్. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. ‘‘కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది. అందులో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. ప్రచారంలో పాల్గొన్న సీనియర్ నేతల కోసం మరో తీర్మానం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో తీర్మానం. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. స్వతంత్రుడిగా అసెంబ్లీలోకి.. రాజకీయ అటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్ ప్రస్థానం ఆసక్తికరమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారాయన. ఆ తర్వాత 2002లో బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్)లో చేరి కొంతకాలం కొననసాగారు. ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ మెంబర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ ఓడించడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచే పోటీ చేసి.. 14 వేల మెజార్టీతో మళ్లీ నెగ్గారు. ఆపై అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్ లీడర్‌గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నడుమ.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించగా, చివరకు 2017 అక్టోబర్ 31వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారాయన. దూకుడు స్వభావం ఉండడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం ఆయనకు డైనమిక్ లీడర్ అనే గుర్తింపును జనాల్లో తెచ్చిపెట్టాయి. రేవంత్‌కు 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్‌లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. వివాదాలున్నా.. కాంగ్రెస్ విజయ సారథిగా ఈ ఎన్నికలతో గుర్తింపు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి పేరు సీఎం రేసులో ముందు నుంచే వినిపిస్తూ వచ్చింది. అయితే ఓటుకు నోటు లాంటి కేసు, పార్టీలో పలువురితో పొసగడకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పెద్ద మెజార్టీతో గెలుపొందలేదనే కారణాలను చెప్పి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ఎంపికకు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి పేరునే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సమర్థించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారని భావించిన అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపించింది. వ్యక్తిగత జీవితం.. రేవంత్‌రెడ్డి 1969, నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్ నుంచి బీఏ చేశారాయన. జర్నలిస్ట్‌గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్‌రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్‌రెడ్డి తన సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో సంబురంగా షేర్ చేసుకున్నారు కూడా. I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week. I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj — Revanth Reddy (@revanth_anumula) April 9, 2023 -
ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో సీఎం పేరుపై అధికారిక ప్రకటన?
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న హస్తిన చర్చలు మరింత హీటెక్కిస్తున్నాయి. అధిష్టానం పిలుపుతో మంగళవారం సాయంత్రం హుటాహుటిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ జరిగిన సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేత ఎవరనే దానిపై కసరత్తులు జరగ్గా.. మంగళవారం ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళంతా చర్చలు జరిపారు. ఆపై సాయంత్రం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో కీలక భేటీ జరిగింది. డీకేఎస్, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉన్న ఎల్లా హోటల్ నుంచి రేవంత్ ఢిల్లీకి బయల్దేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. . -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్డేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తానని.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు. కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా. విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. కేసీఆర్, రేవంత్ ఇక్కడ పోటీ చేయడంతో కామారెడ్డికి గుర్తింపు వచ్చింది. నిజాయితీకి ఓటు వేయాలని కామారెడ్డి ప్రజలు నిర్ణయించుకుని నన్ను గెలిపించారు’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కాగా, కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వెంకటరమణారెడ్డిని నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్).. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్ కిల్లర్ అన్న పేరు సాధించారు. ఇదీ చదవండి: కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు.. -
కాంగ్రెస్‌లోనే ఉన్నా.. బయటి నుంచి రాలేదు: ఉత్తమ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతుందా? అనే ఉత్కంఠ నెలకొన్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బయటి నుంచి రాలేదని.. సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు పునరుద్ఘాటించారాయన. అలాగే సీఎం ఎంపిక విషయంలో గందరగోళం ఏదీ లేదని.. పార్టీ అధిష్టానం సరైన పద్ధతే పాటిస్తోందని చెప్పారాయన. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలున్నాయనే ఢిల్లీకి వచ్చాను. మొదటి నుంచి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. పార్టీని ఎప్పుడూ వీడలేదు. అలాగని నేనేం బయటి నుంచి రాలేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కాంగ్రెస్ పెద్దలను కలిశాను. చెప్పాల్సింది చెప్పాను’’ అని అన్నారాయన. .. ‘‘నేనూ, నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే పని చేస్తుంటాం. నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తుంటా. ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు బీఆర్ఎస్పై ఇంత వ్యతిరేకత లేదు. కానీ, ఇప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. పీసీసీ ప్రెసిడెంట్‌ను కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోయాను. ఫలితాల్లో 70 స్థానాలు వస్తాయని అనుకున్నాం. కానీ, 64 దగ్గరే ఆగిపోవడం నిరాశపర్చింది. హైదరాబాద్‌లో వాష్ అవుట్ అయ్యాం. ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదు కూడా’’ అని ఉత్తమ్ అన్నారు. అలాగే.. సీఎం పదవిని ముగ్గురు.. నలుగురు ఆశించడంలో తప్పేంటి? ఎంపిక విషయంలో తాత్సారం ఏమీ జరగలేదని.. ఫలితాలు వచ్చి 48 గంటలు మాత్రమే గడిచాయని.. సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అన్నారాయన. సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ సరైన పద్ధతి పాటిస్తోందని, కానీ, అభ్యర్థిని ఎంపిక చేసే ముందు విధేయత, ట్రాక్ రికార్డు, సొంత ఇమేజ్ వంటి అంశాలన్నీ పరిశీలించాలని కోరారాయన. -
తెలంగాణ ఫలితాలపై బీజేపీ పోస్టుమార్టం
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైంది. పార్టీలో జరిగిన పరిణామాలు.. సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కమలసారథి కిషన్ రెడ్డి, అసలు కాషాయ దళపతి హస్తినకు తీసుకెళ్లిన రిపోర్ట్ లో ఏముంది ? ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 8 అసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు సాధించి ఉనికి చాటుకుంది. గత మూడేళ్లుగా బీజేపీ చేసిన పోరాటలకు.. వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు. కిషన్ రెడ్డి ఇస్తున్న రిపోర్ట్ లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు వర్కవుట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, బీసీ సీఎం నినాదం ఎంత వరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినా.. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఆరు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు... టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నా వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది. దీంతో జీహెచ్ఎంసీలో కేవలం ఒక్క గోషామహల్ విజయంతో సరిపెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది. కాంగ్రెస్ ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు పోటీ చేసి పరాజయం పాలుకావడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసినప్పటికీ ఎందుకు గెలవలేదనే దానిపై చర్చ సాగుతోంది. ఎంపీల అతివిశ్వాసం, గ్రేటర్ లో కార్పోరేటర్ల సహాయ నిరాకరణ, నేతల మధ్య ఆధిపత్య పోరులాంటి అంశాలు.. బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు ? పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చదవండి: TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు -
6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇక సర్కారు కొలువుదీరడమే తరువాయి. సీఎం అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ అధి ష్టానం చర్చలు జరుపుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఫలితాలు వెలువడి రోజైనా గడవక ముందే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే హామీలు ఇచ్చింది.. ఎలా అమలు చేస్తుంది.. అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. బస్సుల్లో మహిళలు టిక్కెట్లు తీసుకోవద్దని, మహిళలకు డబ్బులు వస్తాయని.. ఇలా పలు రకాల ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆరు గ్యారంటీలపై... కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే పార్టీ పేర్కొన్న పథకాలపై ప్రచారం షురూ అయ్యింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ ఉంటుందా?.. దానికే రూ.500 కలిపి అందిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సైతం మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, వరిపంటపై రూ.500 బోనస్, తదితర అంశాలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామన్న హామీపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల వరకు విద్యాభరోసా కార్డు, చేయూత కింద వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, తదితర గ్యారంటీ హామీలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.