breaking news
-
TS: బీజేపీ కీలక భేటీ.. శాసనసభాపక్షనేత ఎన్నిక?
సాక్షి, హైదరాబాద్: నేడు బీజేపీ కీలక సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. వివరాల ప్రకారం.. కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిపై రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చ జరగనుంది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురితో కూడిన జాబితాను సిద్ధం చేసి నేతలు కేంద్ర కమిటీకి పంపించనున్నారు. ఇక, పార్లమెంట్లో పొలిటికల్ ఇంఛార్జ్‌లు, కన్వీనర్లతో సమావేశం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మరోవైపు, బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా నేడు ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్, మహేశ్వర్రెడ్డిలలో ఒకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, పార్లమెంట్ ఎన్నికలు సమన్వయం, రామ మందిర దర్శనం తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్‌బన్సల్, సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్‌లు హాజరయ్యారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే, రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. -
కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగాఉందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహా పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్‌లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటులో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయపారీ్టలతో జరిగే త్రిముఖ పోటీ బీఆర్ఎస్కే అనుకూలిస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిలో పునరాలోచన: అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకుందని, ప్రజల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వారు పునరాలోచనలో పడ్డారని, అప్పులను బూచిగా చూపి హామీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో తొందరపడటం లేదని, బీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని, కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ పదాన్ని కాంగ్రెస్ నిషేధించిందని, బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పారీ్టలు సిద్ధంగా ఉన్నాయని, పారీ్టలకు ఎత్తు పల్లాలు తప్పవన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో అందరికీ దళితబంధు సాయం అందగా, ఇతర వర్గాలు ఓట్లు వేయలేదని, దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు వంటి పథకాల ప్రభావం బీఆర్ఎస్పై పడిందని చెప్పారు. జుక్కల్‌లో షిండే ఓడిపోతారని తాము భావించలేదన్నారు. అధికారం కోల్పోయినా మునుపటి ఉత్సాహమే : హరీశ్‌రావు పార్టీ తరపున తప్పులు ఉంటే మన్నించాలని, అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటమిని దిగమింగుకొని లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల సంఖ్య బలంగా ఉంటేనే లోక్‌సభలో తెలంగాణ గళం వినిపిస్తుందన్నారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండిచేయి, కాంగ్రెస్‌ది తొండిచేయి అని, కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నిస్తే గతంలో బీజేపీతో తాము కుమ్మక్కు అయినట్టు రేవంత్ ఆరోపించారన్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన 1.25 కోట్ల దరఖాస్తులకు మోక్షం కల్పించాలని, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని హరీశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో కాకుండా బీఆర్ఎస్ బలహీనతల వల్లే గెలిచిందని, బీఆర్ఎస్లో కొందరు సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని చెప్పారు. అభివృద్ది ఎజెండాగా కాకుండా, ఇతర అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో కాంగ్రెస్ సఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో గెలుపుపై బీఆర్ఎస్ ధీమా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా బీఆర్ఎస్ బలోపేతమవుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశం అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మీడియాతో మాట్లాడారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యేలు మాణికరావు, చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు -
కేసీఆర్‌ను కాపాడాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ సమన్వయకర్తల జాబితాను ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆదిలాబాద్ (ఎస్టీ)– సీతక్క, పెద్దపల్లి (ఎస్సీ) –డి.శ్రీధర్‌బాబు, కరీంనగర్– పొ న్నం ప్రభాకర్, నిజామాబాద్– టి.జీవన్‌రెడ్డి, జహీరాబాద్– టి.సుదర్శనరెడ్డి, మెదక్– దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి– తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్– మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్– మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్– రేవంత్‌రెడ్డి, చేవెళ్ల–రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూలు (ఎస్సీ)– జూపల్లి కృష్ణారావు, నల్లగొండ– ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ (ఎస్సీ)– కొండా సురేఖ, మహబూబా బాద్ (ఎస్టీ)– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. -
ఈ నెలలోనే మోదీ సభలు
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్‌బన్సల్, సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. ఓటర్ల దగ్గరకు వెళ్లాలని, వారికి కేంద్ర ప్రభుత్వ విధానాలు, చేసిన, చేస్తున్న అభివృద్ధిపై వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే, రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. నవ యువ ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర్ దర్శన కమిటీ, లాభార్తి(లబ్ధిదారుల)అభియాన్ కమిటీ, మహిళ, స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో, బస్తీ చలో తదితర కమిటీలతో సమావేశమయ్యారు. నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఆఫీసు బేరర్స్ పాల్గొంటారు. -
సోనియాపై ఎవరూ పోటీకి దిగొద్దు
వైరా/వైరా రూరల్: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ప్రేమ ఉన్న ఏ పార్టీ కూడా సోనియాపై పోటీకి దిగవద్దని భట్టి సూచించారు. రాష్ట్రంలో గత తొమ్మిదేన్నరేళ్లలో పాలన గాడి తప్పిందని, దాన్ని తమ ప్రభుత్వం తిరిగి దారిలో పెడుతోందన్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు 21వ తేదీ తర్వాతే జీతాలు అందేవని, ఈనెల మొదటి వారంలోనే జీతాలు పొందేలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నామని తెలిపారు. మిషన్ భగీరథలో అవినీతిని త్వరలో బయటపెడతాం మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారు చేస్తున్నామని, అందులోని అవినీతిని త్వరలోనే బయటపెడతామని భట్టి ప్రకటించారు. కాళేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే బీఆర్ఎస్కు ఆ ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించే వారని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి సమాచారం ఉన్నా నాటి బీఆర్ఎస్తో కుమ్మక్కయినందునే కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనీ, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామనీ, నల్లధనం బయటకు తీస్తామని ప్రకటించిన బీజేపీ నాయకులు ఇప్పుడు వాటిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
TS: లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ► ఆదిలాబాద్- సీతక్క( అనసూయ) ►పెద్దపల్లి - శ్రీధర్‌బాబు ►కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ ►నిజామాబాద్ - జీవన్ రెడ్డి ►జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి ► మెదక్ - దామోదర రాజనర్సింహ ►మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు ►సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క ►చేవెళ్ల, మహబూబ్‌నగర్ - సీఎం రేవంత్ రెడ్డి ►నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు ►నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి ►భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి ►వరంగల్ - కొండా సురేఖ ►మహబూబాబాద్, ఖమ్మం - శ్రీనివాస్ రెడ్డి -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?: మాజీ ఎంపీ వినోద్
సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపేరు ఒకటైతే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తనపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీరియస్ అయ్యారు. కాగా, వినోద్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జెన్కో ప్రభాకర్‌రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?. అలాగైతే ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పులను ప్రోత్సహించలేదు. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను. బండి సంజయ్ కావాలనే నాపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం ఆపాలి. ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా?’ అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నెల రోజుల పాలన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, రాష్ట్రంలో నెల రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఔ కాగా, రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నాం. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ నెల రోజుల పాలన సాగింది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’ అంటూ కామెంట్స్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT — Revanth Reddy (@revanth_anumula) January 7, 2024 -
TS BJP: టార్గెట్ ఎలక్షన్స్.. బీజేపీ మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్త ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది. వివరాల ప్రకారం.. బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సారధిగా కిషన్‌రెడ్డి ఉన్నారు. ఇక, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కోసం పది కమిటీలను బీజేపీ వేసింది. పది కమిటీలతో కిషన్‌రెడ్డి నేడు, రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. మరోవైపు, బీజేపీ మళ్లీ చేరికల సమన్వయ కమిటీని వేసింది. ఇక, చేరికల కమిటీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక, కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే, ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరుగనున్నాయి. -
అధైర్య పడొద్దు..ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధికారం కోల్పోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, మున్ముందు మంచిరోజులు వస్తాయని శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రానున్నారని తెలిపారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తరువాత కోలుకుంటున్న కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు జరుపుతారని చెప్పారు. వచ్చే నెలలో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫొటో తొలగించినా ప్రజల గుండెల నుంచి తొలగించలేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే పనిలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందనీ కిట్ నుంచి కేసీఆర్ ఫొటో, పేరును తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయి దాలు అన్నట్టుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు.కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు ఇప్పటికీ వేయలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు., ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కీలక పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు అధికారిక మీటింగ్‌లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. రెవెన్యూ తదితర కీలకమైన శాఖల్లో పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారని, రేవంత్ మనుషులు విచ్చల విడిగా సిటీ చుట్టుపక్కల లే అవుట్లు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. రేవంత్ కనీస హోం వర్క్‌చేయడం లేదు: కడియం సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలి యదని, సీఎం దేనిపైనా కనీస హోం వర్క్ కూడా చేయడం లేదనిపిస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఫార్మా సిటీ, మెట్రో రైలుపై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారిందన్నారు. అదానీని నాగపూర్‌లో విమర్శించిన సీఎం హైదరా బాద్‌లో అదే అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకా లను ప్రారంభించకపోగా, కేసీఆర్ పథకాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించాలన్నారు. దళితబంధు పథకంలో సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాన్నే ఎత్తివేస్తూ దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుపై బీజేపీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కచ్చి తంగా పది గెలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న కీలక సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఎన్నికల కసరత్తు నిమిత్తం 10 కమిటీలను నియమించనుండగా, రాష్ట్ర పార్టీ ఆ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీల నియామకానికి ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికల కమిటీ ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా జి.కిషన్‌రెడ్డి నియమితులు కాగా, సభ్యులుగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జీలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా మొత్తం 13 మందిని నియమించినట్టు సమాచారం. శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ సమన్వయకర్తగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇన్చార్జిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర కమిటీతో పాటు కొత్త ఓటర్లతో సమ్మేళన కమిటీకు కార్యదర్శిగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీకి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా.ఎస్.ప్రకాష్‌రెడ్డి, హర్గావ్ జానా (ప్రతీ గ్రామాన్ని సందర్శించే)కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీలో ఆ ముగ్గురూ! పార్టీ చేరికల కమిటీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ పొంగులేటి సుధాకరరెడ్డి సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల చైర్మన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని (అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన త్రిపుర గవర్నర్‌గా నియామకం) నియమించగా ఆ బాధ్యతల నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈటలకు బాధ్యతలు అప్పగించగా, ఇప్పుడు ముగ్గురితో కలిసి చేరికల కమిటీని నియమించినట్టు పార్టీ నాయకుల సమాచారం. టార్గెట్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేంద్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర పరిమితం కాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి పెద్దగా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు లేనందున కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
త్వరలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్: హరీష్ రావు
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతీ రోజూ కార్యకర్తలను కలుస్తారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయి. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోంది. కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోంది. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా బస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
HYD: ఫార్ములా ఈ-రేసింగ్ రద్దు.. కేటీఆర్ సీరియస్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దైన విషయం తెలిసిందే. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఇక, ఫార్ములా రేసింగ్ రద్దుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని సూచించారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారు. This is truly a poor and regressive decision by the Congress Government Events like Hyderabad E-Prix enhance the brand image of our City and Country across the world. We had put in a lot of effort and time to bring Formula E-Prix for the first time to India 🇮🇳 In a world… https://t.co/8tCIBEcgB5 — KTR (@KTRBRS) January 6, 2024 ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అంతకుముందు ఫార్ములా రేసింగ్‌పై నిర్వాహకులు స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో తెలిపారు. అలాగే, ఫార్ములా రేసింగ్‌ను హైదరాబాద్‌కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. -
సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసుకుంటూ వెళ్తోందని భారత్ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అయితే గృహలక్ష్మిలో భాగంగా ఎంపికై, అధికారిక పత్రాలు అందుకున్న లబ్ది దారుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటా మొత్తం చెల్లించిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధును కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితబంధును మరింతగా విస్తరించి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ది దారులకు రూ.10 లక్షలు లేదా కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.12 లక్షలైనా వెంటనే అందించాలన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ది దారులకు అండగా నిలబడేలా నిరసనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు తెలిపారు. లబ్ధిదారుల కోసం పార్టీ బాధ్యులంతా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు సైతం రద్దు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మండిపడ్డారు. మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ, ఇతర సంస్థల ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మంజూరును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై లబ్ది దారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
మన పార్టీ వాళ్లే ఓడించారు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారం జరిగిన చేవెళ్ల సమావేశంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మన వాళ్లే పనిచేశారని ఓడిన నా యకుడు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాండూరు అసెంబ్లీస్థానం నుంచి ఓడిపోయిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై సభా వేదికగానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. ఓడిన నేతను వేదికపై ఎలా కూర్చోబెడతారు? సమావేశంలో పైలట్ రోహిత్‌రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడాన్ని పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు తప్పు పట్టడంతో వివాదం రేగింది. ఓడిపోయిన నాయకున్ని స్టేజీ మీద ఎలా కూర్చోబెడతారని, రోహిత్‌రెడ్డిని కిందికి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం పట్టుపట్టింది. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, ఆయన వల్లనే ఓడిపోయామని పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారని సమాచారం. ఈ సమయంలోనే మహేందర్‌రెడ్డి కారణంగానే తాను ఓడినట్లు రోహి త్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో మహేందర్ రెడ్డి సైతం రోహిత్‌పై విమర్శలు చేసినట్లు చెబుతున్నారు. ఓ సమయంలో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు అరుచుకుంటూ కుర్చిలు విసిరేసే వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి టి. హరీశ్‌రావు జోక్యం చేసుకొని పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో గొడవ పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం: పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించామని, మరోసారి గెలిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై కొందరిలో ఆవేదన ఉందని, ఇప్పుడన్నీ సమసిపోయాయన్నారు. ఇల్లు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే తన బలం, చేవెళ్ల పార్లమెంట్ ప్రజలే తన బలగమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. -
ఎవరెవరికి... ఏమేమిద్దాం!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ పదవులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల గాందీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన తర్వాత ఈ చర్చ ఉధృతమైంది. భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపై స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది? తొలిదఫాలో ఎన్ని కార్పొరేషన్లు భర్తీ చేస్తారు? అందులో కీలకమైన కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయి? ఆ కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్ హోదాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పుడు గాందీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటుండటం గమనార్హం. ఇక, సంక్రాంతికి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ, సంక్రాంతికి ముందే ఉంటుందా? లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టత రావడం లేదు. అటు ఎమ్మెల్యే కోటా, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లోగా ఖాయం అయితే, లోక్‌సభ ఎన్నికల్లోపు మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ భర్తీ ఉంటుందనే చర్చ జరుగుతుండగా, సంక్రాంతిలోపు భర్తీ చేస్తే మాత్రం తొలి దఫాలో కేవలం 10 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులే నింపుతారని, అదే జాప్యం జరిగితే మాత్రం కొన్ని పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తొలిదఫా నామినేటెడ్ పందేరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకని వారు, పార్టీ కోసం త్యాగం చేసిన వారు, జిల్లా స్థాయిలో ముఖ్య హోదాల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశముంటుందని సమాచారం. ఆశావహులు ఎవరెవరంటే.. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఒబేదుల్లా కొత్వాల్, చారకొండ వెంకటేశ్, రాజీవ్‌రెడ్డి, కేతూరి వెంకటేశ్ (మహబూబ్‌నగర్), కె.కె.మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రమ్యారావు, నేరెళ్ల శారద (కరీంనగర్), చల్లా నర్సింహారెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సామా రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), విశ్వప్రసాద్, నల్లాల ఓదెలు (ఆదిలాబాద్), రవళి, వెన్నం శ్రీకాంత్ (వరంగల్), మెట్టు సాయికుమార్, మోతె రోహిత్, నూతి శ్రీకాంత్ (హైదరాబాద్), అన్వేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్, కాసుల బాలరాజు, గడుగు గంగాధర్ (నిజామాబాద్), త్రిషా దామోదర్, ఆంజనేయులు గౌడ్ (మెదక్), బొర్రా రాజశేఖర్, లోకేశ్‌యాదవ్, కోటా రాంబాబు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సాధు రమేశ్‌రెడ్డి, నాగా సీతారాములు, తూళ్లూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్, శంకర్‌నాయక్, పున్నా కైలాశ్‌నేత, సర్వయ్య, ముత్తినేని వీరయ్య వర్మ, చెవిటి వెంకన్న యాదవ్ (నల్లగొండ) తదితరులు కీలక కార్పొరేషన్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నేతలు కూడా బడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఆశలపల్లకిలో 3వేలమంది ఇక, మరికొన్ని కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్ల స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య 3వేలకు పైగా ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో కొందరికి ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం మాత్రం అధికార కాంగ్రెస్ వర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు యాభై వాస్తవానికి, రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు చిన్నా చితకా, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 50 వరకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. వీటిని వీలున్నంత త్వరగా భర్తీ చేస్తే రెండేళ్ల పదవీ కాలం చొప్పున మరో రెండు మార్లు ఇతర నేతలకు అవకాశమివ్వచ్చని, అలా 1,500 మంది వరకు నేతలకు నామినేటెడ్ పదవులు ఈ ఐదేళ్ల కాలంలో పంపిణీ చేయవచ్చనేది టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తొలిదఫా భర్తీ ఎప్పుడు పూర్తవుతుందన్న దాన్ని బట్టి 1,500 మంది వరకు అవకాశం కల్పించవచ్చని, జాప్యం జరిగిన కొద్దీ నేతల సంఖ్య తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఏఐసీసీ సిఫారసులు... ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు 5–10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. -
ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే.. రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా వచ్చేవి. రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు. -
TS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వివాదం నెలకొంది. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు స్థానాలకు జనవరి 29వ తేదీన విడివిడిగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే తేదీలో రెండు విడివిడిగా ఎన్నికలు జరుగుతామని ఈసీ తెలిపింది. రెండు సార్లు తమ ఓటును ఎమ్మెల్యేలు వినియోగించుకోనున్నారు. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున, ఎన్నికల నిబంధనల ప్రకారం విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. 119 మంది ఎమ్మెల్యే లలో 65 స్థానాలతో అధికార పార్టీ బలంగా ఉంది. సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాకేనని కాంగ్రెస్ అంటోంది. రెండు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పోగొట్టుకోనుంది. ఇదీ చదవండి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్‌లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై మండిపడ్డారాయన. తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్ఎస్ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని. బీఆర్ఎస్ది కేసీఆర్ పాలన. కాంగ్రెస్‌ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్ఎస్కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు. -
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
TS: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర
జోగిపేట,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదీచదవండి..కీచక తండ్రి..తప్పించుకుని వెళితే మరో దారుణం -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం. కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్‌ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం. సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడొద్దు ‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే అధిక్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్‌లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్‌రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు.