వొడాఫోన్‌: నెలకు 9జీబీ 4జీడేటా | Vodafone is offering 27GB free 4G data for 3 months, but that’s not all | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌: నెలకు 9జీబీ 4జీడేటా

Apr 26 2017 12:27 PM | Updated on Sep 5 2017 9:46 AM

వొడాఫోన్‌: నెలకు 9జీబీ 4జీడేటా

వొడాఫోన్‌: నెలకు 9జీబీ 4జీడేటా

వొడాఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో ‘అమేజింగ్‌ ఆఫర్స్‌ ’ పేరుతో రెండు ఆఫర్లను ప్రకటించింది.

రిలయన్స్ జియో దెబ్బకు మేజర్‌ టెలికాంసంస్థలు దిగివస్తున్నాయి.తగ్గింపు ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్ కూడా తన పోస్ట్‌పెయిడ్  కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన నెట్‌వర్క్‌ను వాడుతున్న పోస్ట్‌పెయిడ్ యూజర్లకు నెలకు 9 జీబీ డేటా చొప్పున 3 నెలలకు గాను 27 జీబీ 4జీ డేటా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది.

వొడాఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో ‘అమేజింగ్‌ ఆఫర్స్‌ ’ పేరుతో రెండు ఆఫర్లను ప్రకటించింది.  దీని ప్రకారం  ఈ ఆఫర్‌ పొందాలంటే  ఈ నెట్‌వర్క్‌లో పోస్ట్‌పెయిడ్ యూజర్లు అయి ఉండాలి. 4 జీ హ్యాండ్‌ సెంట్‌ వాడుతూ ఉండాలి. నెలకు కనీసం 1 జీబీ 4జీ డేటాను ఇప్పటికే వాడుతూ ఉండాలి. దీనికిగాను వొడాఫోన్ రెడ్‌కు చెందిన రూ.499 లేదా, రూ.699 ప్లాన్ కస్టమర్లు(ఎక్సెప్ట్‌ రెడ్‌ఫ్యామిలీ) అయినవారు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు.

ప్లాన్‌ రెండు ప్రకారం ఇప్పటికే రెడ్‌ ప్లాన్‌ లో ఉన్నవారికి  12 నెలలపాటు 3జీబీ అదనపు డేటాను  అందించనుంది. రెడ్‌ అన్‌ లిమిటెడ్‌ ప్లాన్లో ఉన్నవారికే ఈ సదుపాయం.  అందుకు గాను యూజర్లు వొడాఫోన్ సైట్‌కు వెళ్లి తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఆ తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో ఫ్రీ 4జీ డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

 
ఇక ప్రీపెయిడ్ యూజర్లకు కూడా వొడాఫోన్ ఓ నూతన ప్లాన్‌ను ప్రకటించింది. దాని ప్రకారం 4జీ ఫోన్ ఉన్నవారు రూ.352తో రీచార్జి చేసుకుంటే వారికి 28రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా లభించనుంది. పూర్తి వివరాలకు వొడాఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. 

Advertisement
 
Advertisement
Advertisement