హిజ్రాల మధ్య ఘర్షణ | Two Hijra groups quarrel in Tamilnadu | Sakshi
Sakshi News home page

హిజ్రాల మధ్య ఘర్షణ

May 16 2018 11:12 AM | Updated on Aug 21 2018 7:53 PM

Two Hijra groups quarrel in Tamilnadu - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి
చెన్నై, తిరువణ్ణామలై: మామూళ్ల వసూళ్లలో హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు హిజ్రాలు గాయాలతో తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువణ్ణామలై ఎళిల్‌ నగర్‌కు చెందిన అన్బు అలియార్‌ అన్బరసి హిజ్రా. ఈమె సహ హిజ్రాలతో బస్టాండు, గిరివలం రోడ్డు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో మామూళ్లు వసూళ్లు చేస్తుండేది. దీనిపై మరో వర్గానికి చెందిన హిజ్రాలు అన్బరసిని మంగళవారం నిలదీశారు. అన్బరసి వర్గీయులు మరో సంఘానికి చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అన్బరసి వర్గీయులు ముందుగానే తెచ్చుకున్న కత్తులు, రాడ్లతో వ్యతిరేక వర్గ హిజ్రాలపై దాడిచేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల హిజ్రాలతో బాధితులు పోలీస్‌స్టేషన్లను ముట్టడించారు. అన్బరసి వర్గీయులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement