
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో తీవ్రతరమవుతున్న నీటి సంక్షోభాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని.. సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నగరంలోని చెరువులు, రిజర్వాయర్లలో యుద్దప్రాతిపదికన పూడికలు తీసి వర్షపునీటిని సంరక్షించాలని సూచించారు. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న పలు ప్రాంతాలలో మంచినీరు సరఫరా చేస్తున్న రజనీ మక్కల్ మండ్రం సేవలను తలైవా అభినందించారు. పోస్టల్ బ్యాలెట్ అందని కారణంగా నడిగర్ సంఘం ఎన్నికలలో ఓటు వేయలేకపోవడం బాధ కలిగించిందని రజనీ తెలిపారు.