ఆరేటి సత్యవతికి వైఎస్ జగన్ పరామర్శ | Ys Jagan mohan reddy visitation to Sub jail to meet Aareti Satyavati | Sakshi
Sakshi News home page

ఆరేటి సత్యవతికి వైఎస్ జగన్ పరామర్శ

Oct 19 2016 12:30 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఏలూరు:  మెగా ఆక్వాఫుడ్కు వ్యతిరేకంగా పోరాడి 36 రోజులుగా తణుకు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో బుధవారం వైఎస్ జగన్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా ఆయన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి వెళ్లనున్నారు.  ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని  కలుసుకుని ముఖాముఖీ మాట్లాడనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement