మాజీ సీఎంకు రూ. కోటి కారు గిఫ్ట్ | Yeddyurappa uses Rs 1-crore SUV to tour drought-hit areas, earns the ire | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంకు రూ. కోటి కారు గిఫ్ట్

Apr 16 2016 1:38 PM | Updated on Sep 3 2017 10:04 PM

మాజీ సీఎంకు రూ. కోటి కారు గిఫ్ట్

మాజీ సీఎంకు రూ. కోటి కారు గిఫ్ట్

నిన్న, మొన్నటి వరకూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరీదైన వాచీ కలకలం రేపితే...తాజాగా సొంతగూటికి చేరిన మాజీ సీఎం యడ్యూరప్ప కారు వివాదంలో చిక్కుకున్నారు.

బెంగళూరు: నిన్న, మొన్నటి వరకూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరీదైన వాచీ కలకలం రేపితే...తాజాగా సొంతగూటికి చేరిన మాజీ సీఎం యడ్యూరప్ప కారు వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం అధికారికంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యెడ్డీకి... కోటి రూపాయల విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ బహుమతిగా ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటం ఆలస్యం యెడ్డీకి... మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ పార్టీ కార్యాలయంలోనే  ల్యాండ్ క్రూయిజర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

అయితే కరువు ప్రాంతాల్లో సందర్శించేందుకు యడ్యూరప్ప ఈ వాహనాన్ని వినియోగించనున్నారట. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో యడ్యూరప్ప శనివారం నోరు విప్పారు. 'పార్టీ అవసరాల దృష్ట్యా వాడుకునేందుకు మురుగేశ్ నిరానీ నాకు  కారు బహుమతిగా ఇచ్చాడు. పని అయిపోయిన అనంతరం అతడికే కారును అప్పగిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున  సురక్షితమైన, సౌకర్యవంతమైన వాహనం' అవసరమంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కరవు ప్రభావిత జిల్లాల్లో పర్యటించేందుకు యడ్యూరప్ప ఖరీదైన కారు వాడకంపై ప్రతిపక్షం విమర్శల దాడికి దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement