గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి | women injured in acid attack at guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి

Nov 28 2016 11:51 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

పెదనందిపాడు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లాలోని పెదనందిపాడు మండలం కట్రపాడులో సోమవారం జరిగింది . గ్రామానికి చెందిన రాధిక రోడ్డు పై నుంచి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement