మహిళా రౌడీషీటర్ యశస్విని అరెస్ట్ | Sakshi
Sakshi News home page

మహిళా రౌడీషీటర్ యశస్విని అరెస్ట్

Published Fri, May 13 2016 2:48 AM

మహిళా రౌడీషీటర్ యశస్విని అరెస్ట్

అప్పు చెల్లించలేదని దాడి

బెంగళూరు(బనశంకరి) :  తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళా రౌడీషీటర్ ఓ యువతి ఇంటికి వెళ్లి తీవ్రపదజాలంతో దూషించి బెదిరించిన సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుదవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... ఫైనాన్స్, వ డ్డీ వ్యాపారం నిర్వహించే యశస్విని బుధవారం రాత్రి తన ఇంటికి వచ్చి బెదిరించి తీవ్రంగా దూషించినట్లు బాధితురాలు తాయమ్మ ఇక్కడి సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనారోగ్య నిమిత్తం తాను యశస్విని వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నానని, వడ్డీ కూడా చెల్లించానని తాయమ్మ వాపోయారు. రాత్రి ఒక్కసారిగా తన ఇంటికి వచ్చి యశస్విని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇదిలా ఉంటే బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్ జాబితాలో యశస్విని పేరు ఉందని పోలీసులు తెలిపారు. సుబ్రమణ్యపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement