సజీవ సమాధి అవుతా!

Woman Demand On Government Scheme - Sakshi

అత్తికడవు– అవినాశి పథకాన్ని నెరవేర్చాలని మహిళ డిమాండ్‌

తమిళనాడు, టీ.నగర్‌: అత్తికడవు– అవినాశి పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని లేదంటే సజీవ సమాధి పోరాటం చేస్తానంటూ ఓ మహిళ హెచ్చరించింది. వివరాలు.. చెన్నై అన్నానగర్‌ వెస్ట్‌ ప్రాంతానికి చెందిన నందకుమార్‌ భార్య, సామాజిక సేవకురాలైన నర్మద (39) గురువారం అవినాశి కొత్త బస్టాండు ఎదురుగా నేలపై పడుకుని ఆందోళన చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆమెతో చర్చలు జరిపారు. అత్తికడవు– అవినాశి పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని.. పోరాటం విరమించాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత మహిళ ఆందోళన విరమించింది. నర్మద విలేకరులతో మాట్లాడుతూ 60 ఏళ్లుగా తిరుపూర్, కోయంబత్తూరు, ఈరోడ్‌ జిల్లా ప్రజలు అత్తికడవు పథకం కోసం పోరాడుతున్నారన్నారు. ఈ పథకం అమలుకు ముందు మాజీ ముఖ్యమంత్రికి రూ.50 కోట్లతో స్మారకమండపం నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top