ఏపీకి హోదాను మేం వ్యతిరేకించం: కవిత | we will not oppose special status to andhra pradesh, says mp kavitha | Sakshi
Sakshi News home page

ఏపీకి హోదాను మేం వ్యతిరేకించం: కవిత

Aug 18 2016 8:09 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి హోదాను మేం వ్యతిరేకించం: కవిత - Sakshi

ఏపీకి హోదాను మేం వ్యతిరేకించం: కవిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించబోమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించబోమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏం ఇచ్చినా.. తమకు కూడా న్యాయం చేయాలని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో అక్కడి పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమిస్తున్నారని ఆమె అన్నారు. అందుకే తాను గురువారం కృష్ణా జిల్లా నందిగామలో పర్యటించినట్లు ఆమె తెలిపారు.

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరంలో జరిగిన ఒక శుభకార్యక్రమానికి గురువారం ఆమె హాజరయ్యారు. తెలుగువాళ్లంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆమె అన్నారు. నందిగామ ప్రాంతానికి మొదటిసారి వచ్చానని, ఈ ప్రాంత ప్రజలు తనపై ఎంతో అప్యాయత చూపించడం మరచిపోలేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement