యూరి దాడి ఘటనపై ఆగ్రహజ్వాల | vhp leaders slams over uri attacks | Sakshi
Sakshi News home page

యూరి దాడి ఘటనపై ఆగ్రహజ్వాల

Sep 21 2016 11:21 AM | Updated on Apr 6 2019 9:31 PM

యూరి దాడి ఘటన హేయమైన చర్య అని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి అన్నారు.

కర్నూలు : యూరి దాడి ఘటన హేయమైన చర్య అని విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్‌పీ)రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి అన్నారు. భారతసైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్ర పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం  వద్ద పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌షరీఫ్‌ దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన తెలి పారు.  

ఈ సందర్భంగా నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రశాంతతను భంగం కలిగించడమే పాకిస్థాన్‌ లక్ష్యంగా మారిందన్నారు. వీహెచ్‌పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ  మన సైన్యాన్ని ఎదుర్కొవటం చేతగాక దొడ్డిదారిలో పొరుగుదేశం దాడులకు పాల్పడుతుందన్నారు.  ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ  జేసీ –2 రామస్వామికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టన్న, నగర కార్యదర్శి భానుప్రకాష్, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర ప్రముఖ్‌ వేద ప్రకాష్, నగర ప్రముఖ్‌ రామకృష జిల్లా అధ్యక్షుడు నరసింహుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement