నట్టింటికి సినిమా వాయిదా | Unreleased Jai movie in CD by Cheran | Sakshi
Sakshi News home page

నట్టింటికి సినిమా వాయిదా

Jan 12 2015 2:48 AM | Updated on Sep 2 2017 7:34 PM

నట్టింటికి సినిమా వాయిదా

నట్టింటికి సినిమా వాయిదా

సీటూహెచ్ పేరుతో దర్శకుడు చేరన్ నట్టింటిలో కొత్త సినిమా చూపించే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

 సీటూహెచ్ పేరుతో దర్శకుడు చేరన్ నట్టింటిలో కొత్త సినిమా చూపించే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా ఇదే పనిలో ఉన్న ఈ దర్శకుడు ఈ ప్రయోగానికి తన చిత్రం జె కె ఎన్నుమ్ నన్బేవిన్ వాళ్కైతోనే శ్రీకారం చుట్టడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత పలు చిత్రాలకు వరుసగా సీడీల రూపంలో ఇంటింటికీ అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నంగా శర్వానంద్, నిత్యామీనన్ నటించిన జె కె ఎన్నుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ఈ నెల 15న సీడీల రూపంలో విక్రయించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కొత్త ప్రక్రియను కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో చేరన్ పేర్కొంటూ నూతన చిత్రాలను సీడీల రూపంలో ఇంటికే అందించే విధానంతోపాటు థియేటర్లలోను విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలను తీసుకుని చిత్రాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement