దొంగల్లో ఈ దొంగలు వేరయ్యా..! | Unknown person theft the gold in Real Estate Merchant House | Sakshi
Sakshi News home page

దొంగల్లో ఈ దొంగలు వేరయ్యా..!

Published Thu, Sep 14 2017 7:10 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

దొంగల్లో ఈ దొంగలు వేరయ్యా..!

చెన్నై: దొంగలు కూడా విభిన్న రీతిలో దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో వారిని భయపెట్టి లూటీ చేయడం, ఎవరు లేని సమయంలో దొంగతనాలు చేయడం గురించి విన్నాం. కానీ వీటికి విభిన్నంగా ఓ ఇంట్లో దొంగతనానికి దుండగులు యత్నించారు. కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న గదికి తాళం వేసి నగలు, నగదు ఉన్న బీరువాను ఎత్తుకుపోయారు.

ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెరియకుళమ్ తెన్‌కరై భారతి నగరానికి చెందిన అబ్దుల్‌రహీం(63) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. బుధవారం రాత్రి ఇతడు కుటుంబీకులతో తన ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నాడు. వంట గది కిటికీని పగులగొట్టుకుని లోపలికి  చొరబడిన దుండగులు ఇంట్లో వారు నిద్రిస్తున్న గదికి బయట నుంచి తాళం వేశారు. తరువాత ఇంట్లో విలువైన వస్తువుల కోసం వెదికారు. ఓ గదిలోని బీరువా లాకర్‌ను తెరిచేందుకు యత్నించగా అది  తెరుచుకోలేదు. 

దీంతో బీరువాలో ఉన్న దుస్తులను కింద వేసి బీరువాను మాత్రం ఎత్తుకొని వెళ్లారు. లాకర్‌ను పగులగొట్టి అందులో ఉన్న నగలను, నగదును ఎత్తుకుపోయారు. గురువారం నిద్ర లేచిన అబ్దుల్‌ రహీం గది తలుపులను తెరిచేందుకు యత్నించారు. ఆ గదికి బయట తాళం వేయడంలో తెరవలేక పోయరు. ఇంటి పక్కన వారికి ఫోన్‌ చేయటంతో వారు వచ్చి తలుపులు తెరిచారు. బయటకు వచ్చిన వారికి గదిలో బీరువా కనిపించలేదు.

దీంతో అబ్దుల్ రహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న 52 సవర్ల నగలు, రూ. 55 వేల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారని అందులో పేర్నొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement