
విజయవాడలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
విజయవాడ: నగరంలోని బందరురోడ్డులో ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల వివరాలు తెలియలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది.