గిరిజనుల సమస్యలు పరిష్కరించండి | TRS MP Sitaram Naik Meets with Union Minister Juel Oram | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యలు పరిష్కరించండి

Sep 21 2016 2:24 AM | Updated on Sep 4 2017 2:16 PM

గిరిజనుల సమస్యలు పరిష్కరించండి

గిరిజనుల సమస్యలు పరిష్కరించండి

తెలంగాణలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యుయల్ ఓరంను ఎంపీ సీతారాం నాయక్ కోరారు.

కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ సీతారాం నాయక్

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యుయల్ ఓరంను ఎంపీ సీతారాం నాయక్ కోరారు. తెలంగాణలో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న జాతీయ ట్రైబ్స్ కార్నివాల్‌లో తెలంగాణ గిరిజనుల సంస్కృతి నృత్యాలు ప్రదర్శించడానికి అనుమతినివ్వాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి గిరిజన సంక్షేమానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement