
మైసూరు: ఆకలితో అలమటించిన పెద్దపులి చివరకు ప్రాణాలు వదిలిన ఘటన శుక్రవారం మైసూరు జిల్లా బండీపుర అభయారణ్యం పరిధిలోని కాళయ్యనకట్టె వద్ద జరిగింది. రెండురోజుల క్రితం బండీపురలోని సోమనాథపుర అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు పులి కనిపించింది. దీంతో పులిని బంధించడానికి ముమ్మరంగా యత్నించారు. చివరకు పులి విగతజీవిగా కనిపించింది. పులి కళేబరానికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు అది ఆకలి బాధతోనే చనిపోయినట్లు తెలిపారు.