వైద్యం వికటించి యువతి మృతి | The health of the young woman died. | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి యువతి మృతి

Jul 22 2017 3:42 AM | Updated on Sep 5 2017 4:34 PM

వైద్యం వికటించి యువతి మృతి

వైద్యం వికటించి యువతి మృతి

వైద్యం వికటించి యువతి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు.

అన్నానగర్‌: వైద్యం వికటించి యువతి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. ఈ ఘటన మూలకడైపట్టిలో చోటుచేసుకుంది. నెల్లై జిల్లా మూలకడైపట్టి సమీపంలో ఉన్న కల్లత్తి ప్రాంతానికి చెందిన మనోహర్‌(50). ఇతని కుమార్తె ఉషారాణి(17). ఈమె ప్లస్‌టూ చదివి మూలకడైపట్టిలో ఉన్న ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తోంది.

గత 18వ తేదీ రాత్రి ఉషారాణికి కడుపునొప్పి రావడంతో సోమవారం మూలకడై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం హఠాత్తుగా ఉషారాణి మృతి చెందింది. ఈ క్రమంలో తన కుమార్తె మృతికి ప్రైవేటు ఆస్పత్రి వైద్యమే కారణం అని మూలకడైపట్టి పోలీస్‌స్టేషన్‌లో మనోహర్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాళయంకోట ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు.

ఈ క్రమంలో ఉషారాణి కుటుం బీకులు, బంధువులు, స్థానికులు మంగళవారం మూలకడైపట్టిలో ఉన్న ఆస్పత్రి ఎదుట మెయిన్‌ రోడ్డులో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నాంగునేరి సహాయ పోలీసు సూపరింటెండెంట్‌ అరుణ్‌ బాలగోపాలన్, నాంగునేరి సీఐ సురేష్‌ బెలీక్స్‌పోర్, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఉషారాణి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవా లని,  ప్రభుత్వ సాయం ఇవ్వాలని అధికారుల వద్ద డిమాండ్‌ చేశారు. సమస్య పరిస్కరిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement