జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదగాలి | Thank players at the national level | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదగాలి

Oct 14 2014 2:09 AM | Updated on Sep 2 2017 2:47 PM

గ్రామీణ స్థాయి నుంచి జాతీయ క్రికెట్ ఆటగాళ్లుగా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ జాతీయ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అన్నారు.

సాక్షి, బళ్లారి : గ్రామీణ స్థాయి నుంచి జాతీయ క్రికెట్ ఆటగాళ్లుగా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ జాతీయ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అన్నారు. ఆయన సోమవారం నగరంలోని పోలీసు జింఖానాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో యువత ఆసక్తి కనబరిస్తే ఖచ్చితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వీలవుతుందన్నారు.

కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చనేందుకు మన భారతీయులు ఎందరో ఉదాహరణగా నిలుస్తారని గుర్తు చేశారు. మహిళలు క్రికెట్ పోటీల్లో రాణించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. బాలికలను చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ప్రోత్సాహం అందిస్తే ముందుకు వెళతారన్నారు. ఉత్తర కర్ణాటకలో మహిళలు క్రికెట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుందన్నారు.

బాలికలకు చిన్నప్పటి నుంచి క్రికె ట్‌పై ప్రోత్సాహం అందిస్తే వారు కూడా జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీలవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోను ప్రతిభావంత క్రీడాకారులను ప్రోత్సాహం అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అండర్-14,16,19 ఏర్పాటు చేసి, రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళుతున్నామన్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాలుగా ఉచిత సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు.

కేఎస్‌సీఏ జిల్లా కో-ఆర్డినేటర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ బళ్లారి జిల్లా నుంచి అండర్-14,16,19ల నుంచి 11 మంది ఎంపిక కావడం ఎంతో సంతోషం కలుగుతోందన్నారు. యువత ముందుకు వస్తే క్రికె ట్‌లో రాణించేందుకు మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. వీరశైవ విద్యావర్ధక సంఘం క్రికె ట్‌కు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement