భివండీలో టెక్స్‌టైల్ పార్క్: కిషన్‌రెడ్డి | Textile Park in Bhivandi: Kishan Reddy | Sakshi
Sakshi News home page

భివండీలో టెక్స్‌టైల్ పార్క్: కిషన్‌రెడ్డి

Oct 11 2014 11:35 PM | Updated on Mar 29 2019 9:24 PM

భివండీలో టెక్స్‌టైల్ పార్క్: కిషన్‌రెడ్డి - Sakshi

భివండీలో టెక్స్‌టైల్ పార్క్: కిషన్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెంటనే భివండీలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేయించేందుకు కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

భివండీ, న్యూస్‌లైన్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెంటనే భివండీలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేయించేందుకు కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని 136-పడమర భివండీ, 137-తూర్పు భివండీ నియోజక వర్గాల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న మహేష్ చౌగులే, సంతోష్ శెట్టి తరఫున శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక తెలుగు ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రి, రవాణా ట్రాన్స్‌పోర్టు, లోకల్ సేవ సదుపాయాలు, మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సభకు ముఖ్య అతిథులుగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్, కొల్లా వెంకట్రావ్, ముంబై నుంచి వచ్చిన మండల గురునాథ్‌తో పాటు స్థానిక ఎంపీ కపిల్ పాటిల్, ఆర్‌పిఐ  పట్టణ అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజెంగి, తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ అధ్యక్షుడు గుండ్ల శంకర్, చైర్మన్ పాము మనోహర్, శ్యామ్ అగర్వాల్, కముటం సుధాకర్, నిష్కమ్ భైరి, నిలేశ్ చౌదరితో పాటు తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement