తెలుగు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు | Telugu famous honorary doctorates | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు

Feb 2 2014 3:06 AM | Updated on Sep 2 2017 3:15 AM

వివిధ రంగాలకు విశేష సేవలందించిన ముగ్గురు తెలుగు ప్రముఖులకు ఇక్కడి న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసి సత్కరించింది.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వివిధ రంగాలకు విశేష సేవలందించిన ముగ్గురు తెలుగు ప్రముఖులకు ఇక్కడి న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసి సత్కరించింది. శనివారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివ ర్శిటీ చాన్సలర్ ఆర్‌కే. శ్యామ్‌సన్ నుంచి డాక్టరేట్లను అందుకున్న వారిలో కోట శంకరరావు, గున్నా రాజేందర్ రెడ్డి, అంద్శై ఉన్నారు. సినిమాల్లో సైతం నటించిన శంకరరావుకు, బుల్లి తెరకు అందించిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌ను ఇచ్చారు.

ఇదివరకు ఆయన నాలుగు నంది అవార్డులను కూడా అందుకున్నారు. మరో గ్రహీత రాజేందర్ రెడ్డి 1987 నుంచి సమాజ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. భూదాన్ బోర్డు ట్రస్టు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన అనాథ పిల్లలను బడి బాట పట్టించడంలో విశేష కృషి చేశారు. ఆ విధంగా విద్యా బుద్ధులు నేర్చుకున్న వారిలో వందల మంది ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇక సాహితీ రంగంలోని అంద్శైసహజ కవిగా పేరు గడించారు. 2008లో కాకతీయ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌నిచ్చి సత్కరించింది. కాగా ఈ ప్రదానోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఎల్. నరేంద్ర బాబు ప్రభృతులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement