శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం | technical problem in Satavahana Train in khammam and stopped | Sakshi
Sakshi News home page

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Jan 3 2017 10:56 PM | Updated on Sep 5 2017 12:19 AM

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం తప్పింది.

విజయవాడ : ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళు తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే 494/ 10 విద్యుత్‌ స్తంభం వద్ద వైర్లు ఒక్కసారిగా తెగి కిలోమీటర్‌ మేరకు ఉన్న 494/24 విద్యుత్‌ స్తంభం వరకు వైర్లు పూర్తిగా ధ్వంస మయ్యాయి.

ఆ సమయంలో రైలు వేగంగా వెళుతోంది. దీంతో రైలింజన్‌ ఫాంటో విరిగి పడిపోయింది. కిలోమీటరున్నర మేరకు విద్యుత్‌ పరికరాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ వైర్లు తెగటంతో మంటలు వ్యాపిం చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు వెంటనే రైలును నిలిపివేయగా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రాత్రి 8.40 నుంచి 11 వరకు రైలు నిల్చిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ వైపు వెళ్లే పలు  రైళ్లను ఆయా రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement