పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది.
గోదావరి మధ్యలో నిలిచిన బోటు
Dec 29 2016 12:44 PM | Updated on Apr 3 2019 5:24 PM
దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు గోదావరి మధ్యలోనే నిలిచి పోయింది. వివరాలివీ.. గురువారం ఉదయం సుమారు 150 మంది యాత్రికులు సాయిగాయత్రి బోట్‌లో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వైపు బయలు దేరారు. బోట్ స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరవరం లంక వద్ద నది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను మరో బోట్ ద్వారా గమ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, ఈ హఠాత్ పరిణామంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement