సింగం-3కి సన్నాహాలు | Suriya all set for 'Singam 3′ | Sakshi
Sakshi News home page

సింగం-3కి సన్నాహాలు

Feb 27 2015 12:33 AM | Updated on Sep 2 2017 9:58 PM

సింగం-3కి సన్నాహాలు

సింగం-3కి సన్నాహాలు

సింగం, సింగం-2 చిత్రాలు సాధించిన విజయాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి.

సింగం, సింగం-2 చిత్రాలు సాధించిన విజయాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి. ఈ రెండు చిత్రాలు సూర్యను మాస్ హీరోగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టాయి. అందుకేనేమో దర్శకుడు హరి అంటే సూర్యకు ప్రత్యేక అభిమానం. అంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన వేల్ తదితర చిత్రాలు ప్రజాదరణ పొందాయి. తాజాగా సింగం-3 ఈ హిట్ కాంబినేషన్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలోనూ సీక్వెల్ చిత్రాల్లో నటించిన అనుష్కనే నాయకిగా నటించనున్నట్లు సమాచారం. అయితే సింగం సీక్వెల్‌గా సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కాకుండా సింగం-3కి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందించనున్నారు.
 
 ప్రస్తుతం కథాచర్చల్లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం సూర్య మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నయనతార, ప్రణీత నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. షూటింగ్ తుదిదశకు చేరుకున్న మాస్ చిత్రాన్ని అజిత్ పుట్టిన రోజు అయిన మే 1న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సూర్య సొంతంగా 2డీ పిక్చర్స్ పతాకంపై పాండిరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న హైకు చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. తదుపరి మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 24 అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement