హోం వర్కు చేయనందుకు టీచర్లు దండిస్తారనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హోంవర్క్ చేయలేదనే భయంతో...
Sep 17 2016 4:31 PM | Updated on Nov 9 2018 4:36 PM
మదనపల్లె: హోం వర్కు చేయనందుకు టీచర్లు దండిస్తారనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లెకు చెందిన నర్సింహులు, పుష్పలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వేణుగోపాల్(14) ఉన్నారు. పిల్లలు ముగ్గురూ మదనపల్లెలోని ఉండి చదువుకుంటుండగా ఆ దంపతులు జీవనోపాధి కోసం కర్ణాటక రాష్ట్రం చింతామణి వెళ్లారు. ఇలా ఉండగా, తొమ్మిదో తరగతి చదువుకుంటున్న వేణుగోపాల్ గత రెండు వారాలుగా స్కూలుకు వెళ్లటం లేదు.
స్కూలుకు వెళితే హోం వర్కు చేయలేదని టీచర్లు దండిస్తారేమోనని తోబుట్టువులతో అంటుండేవాడు. శనివారం ఉదయం అక్క, చెల్లెలు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో అక్క వచ్చి చూడగా వేణుగోపాల్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడు అప్పటికే చనిపోయినట్లు చుట్టుపక్కల వారు గుర్తించారు. ఈ మేరకు ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement