చూతము రారండి | srirama navami special | Sakshi
Sakshi News home page

చూతము రారండి

Apr 13 2016 2:04 AM | Updated on Sep 3 2017 9:47 PM

యలహంక సమీపంలోని బాగళూరు క్రాస్‌లో ఉన్న సీతారామస్వామి దేవాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు

బాగళూరు క్రాస్‌లో నేటి నుంచి సీతారాముల కల్యాణ వేడుకలు
బాగళూరుక్రాస్‌లో స్వామి వారి కళ్యాణం  జరుగనున్న దేవాలయం

 

యలహంక :  యలహంక సమీపంలోని బాగళూరు క్రాస్‌లో ఉన్న సీతారామస్వామి దేవాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానఅర్చకుడు శ్రీహరిశర్మ మంగళవారం వివరాలు వెల్లడించారు  బుధవారం ఉదయం మహా గణపతి పూజ,  స్వస్తీవాచన, ధ్వజారోహణ, గురువారం ఉదయం కలస స్థాపన, గోపూజ, మూల మంత్ర జపం, సుదర్శన హోమం, మూల వీరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం దేవాలయం ఆవరణంలో భక్తి గీతాల ఆలాపన ఉంటుంది.


శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు సీతారాముల వారి కల్యాణ మహోత్సవం వేడుకలు జరుగునున్నాయి. ఇందు కోసం అన్ని ఎర్పాట్లు సిద్ధం చేసినట్లు శ్రీహరిశర్మ తెలిపారు వేడుకల్లో పాల్గోనే   సుమారు 6 వేల ఆరువేల మందికి అన్న దానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement