నల్ల సూరీడుకి ఘన నివాళి | Solid tributes to Nelson Mandela | Sakshi
Sakshi News home page

నల్ల సూరీడుకి ఘన నివాళి

Dec 11 2013 11:32 PM | Updated on Sep 2 2017 1:29 AM

భారత సంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ సమితి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని గాంధీపీస్ పౌండేషన్ హాలులో నెల్సన్ మండేలాకి ఘనంగా నివాళులర్పించారు.

సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ సమితి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని గాంధీపీస్ పౌండేషన్ హాలులో నెల్సన్ మండేలాకి ఘనంగా నివాళులర్పించారు. భానుదేవదత్త అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సంతాప సభలో సంఘానికి చెందిన 13 రాష్ట్రాల ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎల్‌ఏకె.సుబ్బరాజు తెలిపారు. మండేలా సంతాప దినాలను సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో సంతాపసభలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.జాతి వివిక్షత,అస్పృశ్యత, అణచివేతలకు వ్యతిరేకంగా మండేలా చేసిన పోరు అందరికీ స్పూర్తిదాయకమని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప సభలో మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ప్రొఫెసర్ దేవేంద్ర కౌషిక్, విజయ్ కుమార్ పడిహారి, రాధాకృష్ణన్,నారాయణన్, సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement