కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం.. | software engineer posts her wife's nude photos on social media | Sakshi
Sakshi News home page

కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం..

Mar 14 2016 10:55 PM | Updated on Sep 3 2017 7:44 PM

కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం..

కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం..

కట్నం కోసం తను కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడమే కాక ఆ చిత్రాలతో కూడిన సీడీని ఆమె తండ్రికి పంపించాడు సాఫ్ట్ వేర్ ఇంజరీగ్ గా పనిచేస్తోన్న ఓ నీచుడు.

సాక్షి, బెంగళూరు: కట్నం కోసం తను కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడమే కాక ఆ చిత్రాలతో కూడిన సీడీని ఆమె తండ్రికి పంపించాడు సాఫ్ట్ వేర్ ఇంజరీగ్ గా పనిచేస్తోన్న ఓ నీచుడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది.

కాసరగోడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అతనికి  చేర్తళ(కేరళ)కు చెందిన 20 ఏళ్ల యువతితో ఫేస్‌బుక్ స్నేహం కుందిరింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఏడాది కిందట గురువాయూర్ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే పుట్టింటినుంచి కట్నం తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడా నీచుడు.

వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో క్రూరంగా మారిపోయిన భర్త.. గతంలో భార్యకు తెలియకుండా తీసి భద్రపరుచుకున్న ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాక ఆ ఫొటోల సీడీని యువతి తండ్రికి పంపాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాసరగోడు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement