కూల్‌డ్రింగ్‌ తాగబోయి ...

Snake Head Struck in Cool Drink Tin - Sakshi

యశవంతపుర : పర్యటకులు తాగి పడేసిన కూల్‌డ్రింక్‌ టిన్‌లో తలదూర్చిన పాము చిక్కుకుని విలవిలలాడింది. చివరకు ఓ వ్యక్తి చొరవ తీసుకుని పాముకు స్వేచ్ఛ కల్పించారు. ఈ సంఘటన  చిక్కమగళూరు తాలూకా మల్లందూరు గ్రామంలో జరిగింది. రోడ్డు పక్కన మిరిండా ఖాళీ టిన్‌ ఒక జెర్రిపోతు పాముకు కనపడింది. ఆ పానీయం రుచి చూద్దామని కాబోలు అది టిన్‌ రంధ్రం గుండా తలను లోపలకు దూర్చింది. అయితే తల తీయడానికి దాని వల్ల కాలేదు. టిన్‌లో చిక్కుకొంది. ఇలా సుమా రు గంట పాటు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ అందోళన చెందింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయింది.  ఈ సమయంలో చిక్కమగళూరు నుంచి మల్లందూరుకు కారులో వెళ్తున్న వన్యప్రాణి ముఖ్యడు శ్రీదేవ్‌  పట్టుకుని లాగడంతో పాము బయటకు వచ్చింది. హమ్మ య్య అనుకుంటూ చెట్లలోకి వెళ్లిపోయింది.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top