చిన్న పిల్లాడు.. వదిలేయండి | Shah Rukh Khan: Don't Want AbRam to be Part of Circus of Public Life | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లాడు.. వదిలేయండి

Aug 31 2014 10:45 PM | Updated on Apr 3 2019 6:23 PM

తన చిన్న కుమారుడు అబ్‌రామ్ గురించి కూడా సినీపత్రికల్లో రావడంపై సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అసంతృప్తితో ఉన్నాడు. వాడు చిన్నవాడని, అప్పుడే సినీ మాయాప్రపంచంలోకి రావడం ఇష్టం లేదని

తన చిన్న కుమారుడు అబ్‌రామ్ గురించి కూడా సినీపత్రికల్లో రావడంపై సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అసంతృప్తితో ఉన్నాడు. వాడు చిన్నవాడని, అప్పుడే సినీ మాయాప్రపంచంలోకి రావడం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టాడు. సరోగసి (అద్దెగర్భం) విధానం ద్వారా షారుఖ్ దంపతులకు గత మేలో అబ్‌రామ్ జన్మించడం తెలిసిందే. ‘వాడి గురించి అప్పుడే చర్చలు మొదలవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. మీకు (మీడియా) అనుమతి దొరికితే మా ఇంటికి వచ్చి వాడిని చూడండి.
 
  అంతేతప్ప కెమెరా ఫ్లాష్‌లతో మాత్రం ఇబ్బందిపెట్టవద్దు. నేను ఇది వరకే సినిమా సర్కస్‌లో ఉన్నాను. అతణ్ని కూడా ఇందులోకి లాగొద్దు’ అని షారుఖ్ విజ్ఞప్తి చేశాడు. గర్భం దాల్చిన మహిళ ఏడో నెలలోనే అబ్‌రామ్‌కు జన్మనివ్వడంతో మొదట అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాలా కాలంపాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. అప్పుడు కూడా అతని ఆరోగ్యం, పుట్టుక గురించి కూడా పత్రికల్లో వార్తలు రావడంపై ఎంతో కలత చెందానని ఎస్‌ఆర్‌కే అన్నాడు. ‘నేను సినీనటుణ్ని. ఏదైనా కోపముంటే నాపై చూపండి. నా పిల్లల జోలికి రాకండి’ అని స్పష్టం చేశాడు.
 
  పిల్లవాడిని ఎందుకు బయటికి తీసుకురావడం లేదంటూ ఎవరైనా ప్రశ్నిస్తే తనకు బాధగా అనిపిస్తుందన్నాడు. అబ్‌రామ్ పుట్టకముందే తల్లికి లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిపుణుల బృందం షారుఖ్ ఇంటికి వచ్చి విచారణ జరిపింది. అయితే తాము ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని షారుఖ్ చాలాసార్లు వివరణ ఇచ్చాడు. ‘నేనూ చదువుకుణ్ని వాడినే. ఇలాంటివి ఎందుకు చేస్తాను ? అబ్‌రామ్ షారుఖ్ కొడుకు కాబట్టే ఇన్ని వివాదాలు సృష్టించారు’ అంటూ బాధపడ్డాడు. అయితే అబ్‌రామ్ ఎంతో అందంగా ముద్దుగా ఉంటాడని, అతడి రాకతో తమ కుటుంబం మరింత సంతోషంగా ఉందన్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement