మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం | sex racket run will be massage center | Sakshi
Sakshi News home page

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం

Mar 1 2014 1:49 AM | Updated on Jul 23 2018 8:49 PM

చెన్నైలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

 తిరువొత్తియూరు: చెన్నైలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

 

ఆయుర్వేద మసాజ్ సెంటర్ పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లు అందాయి. దీనిపై విచారణ చేయాలని పోలీసు కమిషనర్ జార్జి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాలిగ్రామం, అరుణాచలం వీధిలో ఉన్న ఓ మసాజ్ సెంటర్‌ను బుధవారం రాత్రి తనిఖీ చేశా రు.

 

తనిఖీల్లో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దళారి అరుణ్‌దేవ్ (24)ను అరెస్టు చేశా రు. అతని నుంచి ఇతర రాష్ట్రాలకు చెంది న నలుగురు యువతులను విడిపించా రు. అలాగే అరుంబాక్కంలో ఒక లాడ్జి లో తనిఖీ చేయగా కర్ణాటకకు చెందిన జక్కరియా(24), సైనుద్దీన్(24), అబ్దుల్ మజిత్ (24) అనే వ్యభిచార దళారులు చిక్కారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. కోడంబాక్కం పవర్ హౌస్ ప్రాంతంలో తనిఖీ చేయగా అక్క డ వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోకర్లు జోబిజాన్(31),మహమ్మద్ సాఖి(20)ని అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను విడిపించారు.  ఆరుగురిని కోర్టులో హాజ రు పరచి పుళల్ జైలుకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement