చెన్నై, సాక్షి ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖ (చెన్నై) అదనపు ఎస్పీ హరీష్ (33) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుండెపోటు కారణమని పోలీసు లు చెబుతుండగా, ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని మరో ప్రచారం జరుగుతోంది. చెన్నై ఏసీబీ విభాగంలో ఎన్ హరీష్ అదనపు ఎస్పీ గా రెండు నెలల క్రితమే చేరారు. అవివాహితుడు కావడంతో చెన్నై ఎగ్మూరులోని పోలీసు అధికారు లు క్వార్టర్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం ఉద యం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఆయన కారు డ్రైవర్ ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన క్వార్టర్స్ సిబ్బంది ఎగ్మూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా మంచంపై హరీష్ శవంగా పడి ఉన్నాడు.
పోలీసు అదనపు కమిషనర్ శంకర్, సహాయ కమిషనర్ పెరుమాళ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న సమాచారం వేగంగా ప్రచారం కావడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు క్వార్టర్స్ సముదాయం వద్దకు చేరుకోగా రెండుగేట్లు మూసివేసి అడ్డుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడిలో శిక్షణ పూర్తిచేసుకుని అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. మదురై జిల్లాలో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం చెన్నై ఏసీబీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్‌లో ఉత్తీర్ణులైన వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన భాషలోఉత్తీర్ణత పొందాలని చెబుతున్నారు. అయితే హరీష్ తమిళ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని తెలుస్తోంది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే హరీష్ ఉన్నతాధికారుల వద్ద దాసోహం అన్నట్లు వ్యవహరించలేదని అంటున్నారు.
దీనిని మనసులో పెట్టుకుని గతంలో డీజీపీ రామానుజం హరీష్‌పై విచారణకు ఆదేశించారు. ఈ విచారణ సంఘటన తరువాత పోలీస్‌శాఖలోని ఉన్నతాధికారులంతా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరీష్‌పై విచారణ సాగుతున్నందున పదోన్నతిని కోల్పోయారు. అతనితోపాటు పనిచేసిన ఐపీఎస్ అధికారులు 2013లోనే ఎస్పీలుగా పదోన్నతిని పొందారు. హరీష్ తరువాత బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సైతం పదోన్నతిని అందుకున్నారు. దీంతో తనకంటే జూనియర్ల వద్ద హరీష్ పనిచేయాల్సి వచ్చింది.
శాంతి భద్రతల విభాగంలో ఉంటే తన కంటే జూనియర్ల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్న బాధతోనే ఏసీబీకి మార్చమని ప్రస్తుత డీజీపీ అశోక్‌కుమార్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు వేధింపులు కొనసాగడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరీష్ ఇంటిలో ఉత్తరం దొరికిందని తెలుస్తోంది. అయితే పోలీసులు ఉత్తరం విషయాన్ని ధ్రువీకరించడం లేదు. హరీష్‌ది ఆత్మహత్య కాదు, గుండెపోటుకు గురై మరణించాడని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతో తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఈ దశలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్‌శాఖను కలవరపెడుతోంది.
గుండెపోటా..వేధింపులా?
Published Fri, Feb 19 2016 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement