చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు | sChennai rain: List of trains cancelled/diverted | Sakshi
Sakshi News home page

చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు

Published Wed, Dec 2 2015 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు

చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు

తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా...

చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను  దారి మళ్లిస్తున్నారు.  చెన్నై-గూడూరు మధ్య పలుచోట్ల  రైల్వే బ్రిడ్జ్లపై  నీళ్లు నిలిచి, ప్రమాద స్థాయికి చేరుకోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గత కొద్దిరోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.


రద్దయిన రైళ్ల వివరాలు:
*ట్రయిన్ నెంబర్-17644:  కాకినాడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్
*12604: హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్
*12760: హైదరాబాద్-చెన్నై సెంట్రల్-చార్మినార్ ఎక్స్ప్రెస్
*17652 : కాచిగూడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్
*16031: చెన్నై సెంట్రల్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా అండమాన్ ఎక్స్ప్రెస్
*12621: చెన్నైసెంట్రల్-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్
*12840: చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్
*12842: చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్
*12656: చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్
*22611: చెన్నై సెంట్రల్- న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్
*22403: పుదుచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్

దారి మళ్లించిన రైళ్లు...
12898: భువనేశ్వర్- పుదుచ్చేరి ఎక్స్ప్రెస్...
12507: త్రివేండ్రం సెంట్రల్- గౌహతి ఎక్స్ప్రెస్
16351: సీఎస్టీ ముంబయి-నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్

తాత్కాలికంగా రద్దు అయిన రైళ్లు...
* 12711 - విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ (గూడూరు వరకు మాత్రమే)
* 12712 - చెన్నై సెంట్రల్ - విజయవాడ పినాకిని (చెన్నై నుంచి గూడురు వరకూ రద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement