
నా కుటుంబానికి రక్షణ కల్పించండి
తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని, అందుకుగాను తగిన రక్షణ కల్పించాలంటూ నటుడు పూచ్చి మురుగన్
- తమిళ నటుడు పూచ్చి మురుగన్
తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని, అందుకుగాను తగిన రక్షణ కల్పించాలంటూ నటుడు పూచ్చి మురుగన్ శనివారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.అందులో ఆయన పేర్కొంటూ తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నారు. కొంత కాలం సంఘ నిర్వాహక సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
అదే విధంగా సంఘం భవనం గురించి అది సంఘం సభ్యులకే సొంతం కావాలని పోరాడుతున్నానన్నారు.త్వరలో సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఫోన్‌లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో తనకూ తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందన్నారు. కాబట్టి తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు నటుడు పూచ్చి మురుగన్ పేర్కొన్నారు.