కొత్త సీజేగా సంజయ్ కిషన్ | Sanjay Kishan Kaul Sworn in as Chief Justice of Madras High Court | Sakshi
Sakshi News home page

కొత్త సీజేగా సంజయ్ కిషన్

Jul 26 2014 11:25 PM | Updated on Oct 8 2018 3:56 PM

కొత్త సీజేగా సంజయ్ కిషన్ - Sakshi

కొత్త సీజేగా సంజయ్ కిషన్

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సంజయ్ కిషన్ కౌల్ శనివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే ముఖ్యమంత్రి జయలలిత

చెన్నై, సాక్షి ప్రతినిధి : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సంజయ్ కిషన్ కౌల్ శనివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే ముఖ్యమంత్రి జయలలిత  రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ కే రోశయ్య న్యాయమూర్తి చేత ఉదయం 11.30 గంటలకు ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం, గవర్నర్లు వేర్వేరుగా జస్టిస్ సంజయ్ కిషన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఎం జయలలితతోపాటూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంగత్, మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, టీకేఎస్ ఇళంగోవన్, మాధవరం మూర్తి హాజరయ్యూరు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యా యవాదులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు లో అందరూ పాల్గొన్నారు.
 
 మద్రా స్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండిన రాజేష్ కుమార్ అగర్వాల్ ఐదు నెలల క్రితం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. సంతోష్‌కుమార్ అగ్నిహోత్రి తాత్కాలిక న్యాయమూర్తిగా ఇంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు.1958లో ఢిల్లీలో జన్మించిన సంజయ్ కిషన్ కౌల్ 1976లో బీకాం పూర్తిచేసి 1982లో లా పట్టాను అందుకున్నారు. సివిల్, రిట్, కంపెనీ లా లో ప్రతిభావంతులుగా పేరుతెచ్చుకున్నారు. 2011 మే 3న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013 నాటికి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరి 6 నుంచి పంజాబ్-హర్యానా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తూ ప్రస్తుతం చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈనెల 30న హైకోర్టు ప్రాంగణంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement