నోట్ల మార్పిడి ముఠా అరెస్టు | rs. 4 lakh new currency caught in nalgonda district | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

Dec 17 2016 1:01 PM | Updated on Aug 29 2018 4:18 PM

పాతనోట్లకు కమీషన్‌పై కొత్తనోట్లను ఇచ్చే ముఠాను యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ పోలీసులు పట్టుకున్నారు.

వలిగొండ: పాతనోట్లకు కమీషన్‌పై కొత్తనోట్లను ఇచ్చే ముఠాను యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్‌కు చెందిన ఐదుగురు, వలిగొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం స్థానిక అరూర్ రోడ్డులో నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్నారు. వారి నుంచి రూ.4 లక్షల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement