రూట్ క్లియర్... | Root Clear ... | Sakshi
Sakshi News home page

రూట్ క్లియర్...

Mar 14 2014 3:01 AM | Updated on Sep 2 2017 4:40 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి మాత

బళ్లారి బీజేపీ టికెట్ శ్రీరాములుకే
 నేడు పార్టీలో చేరిక
 మారుతున్న రాజకీయ సమీకరణలు
 బలోపేతమవుతున్న బీజేపీ
 అసెంబ్లీలోనూ పెరిగిన ‘కమలం’ బలం
 ఎనిమిది మందితో రెండో జాబితా రెడీ
 త్వరలో అధికారిక ప్రకటన

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ  రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి మాత ృ పార్టీలో చేరిన విధంగానే, బీఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీరాములు కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ అభ్యర్థిగా బళ్లారి నుంచి శ్రీరాములును ఎంపిక చేయాలని నిర్ణయిం చారు. జగదీశ్ శెట్టర్ శ్రీరాములు తరఫున అధిష్టానం వద్ద గట్టిగా వాదించినట్లు సమాచారం. ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించకపోతే హై-క ప్రాంతంలో కనీసం ఐదారు స్థానాల ను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం ఆయనకు టికెట్టును ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో శ్రీరాములు శుక్రవారం పార్టీలో చేరనున్నారు.
 
శాసన సభలో పెరగనున్న బీజేపీ బలం


గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో 40 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఓట్ల శాతంలో తేడా వల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పొందలేక పోయింది. తదనంతరం యడ్యూరప్ప తనతో పాటు కేజేపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ సంఖ్యా బలం 44కు పెరగడం వల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పొందగలిగింది. ప్రస్తుతం బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను శాసన సభలో ఇకమీదట బీజేపీ సభ్యులుగా పరిగణిస్తారు. దీంతో ఆ పార్టీ సంఖ్యా బలం 48కి పెరగనుంది.
 
బీజేపీ జాబితా...?

 
రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను బీజేపీ 20 మందితో తొలి జాబితాను ఇదివరకే ప్రకటించింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉడిపి-చిక్కమగళూరు స్థానానికి మాజీ మంత్రి శోభా కరంద్లాజె, తుమకూరుకు జీఎస్. బసవరాజు, కోలారుకు ఎం. నారాయణస్వామి, మండ్యకు శివలింగయ్య, మైసూరుకు జర్నలిస్టు ప్రతాప సింహ, హాసనకు సీహెచ్. విజయ్ శంకర్, బీదర్‌కు సూర్యకాంత నాగమారపల్లిలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement