వర్ధన్నపేటలో దొంగలు బీభత్సం | robbers hulchul in vardanna pet | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేటలో దొంగలు బీభత్సం

Apr 14 2017 11:36 AM | Updated on Aug 30 2018 5:27 PM

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం లేబర్తి గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

వర్ధన్నపేట: వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం లేబర్తి గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు ఇళ్లలో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. శుక్రవారం ఉదయం తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదుతో పాటు 5 తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement